Don't Miss!
- News
sister: శాడిస్టు సిస్టర్, కోట్ల రూపాయల ఆస్తి, అన్నను కిడ్నాప్ చేసి ఏం చేసిందంటే?, ఆంటీ కొడుకు!
- Sports
అప్పుడు బీసీసీఐ మోసం చేసింది.. అందుకే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదు: స్టీవ్ స్మిత్
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఈ వారం ఓటీటీ లో విడుదల కాబోతున్న సినిమాలు.. జాన్వీ కపూర్ ఈసారైనా సక్సెస్ అవుతుందా?
థియేటర్స్ లో కంటే ప్రతీ వారం ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లోనే చాలా ఎక్కువ సినిమాలు విడుదలవుతున్నాయి. ఇక ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జీ 5, హాట్‌స్టార్, సోనీ లివ్ అలాగే ఇతర OTT ప్లాట్‌ఫారమ్ లలో కూడా కొన్ని ఆసక్తికరమైన సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లు రాబోతున్నాయి. థియేట్రికల్ గా విడుదలకు నోచుకోని కొన్ని సినిమాలు ఈ రూట్లో మంచి క్రేజ్ అందుకుంటున్నాయని చెప్పవచ్చు. ఇక అందులో ఎక్కువగా హైలెట్ అయ్యే కంటెంట్ వివరాల్లోకి వెళితే..
777 చార్లీ సినిమా కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా కన్నడ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది అతిపెద్ద హిట్ అని చెప్పవచ్చు. రక్షిత్ శెట్టి నటించిన ఈ చిత్రంలో ఒక పెంపుడు కుక్క చుట్టూ కథ తిరుగుతుంది. ఇక ఈ చిత్రం ఈ నెల 29 నుంచి వూట్ సెలెక్ట్‌లో ప్రసారం కానుంది.

జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన గుడ్ లక్ జెర్రీ చిత్రంపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా నయనతార నటించిన తమిళ మూవీ కో కో కోకిల సినిమాకు హిందీ రీమేక్. ఇక ఈ చిత్రం జూలై 29న డిస్నీ+ హాట్‌స్టార్‌లో రానుంది. ఇప్పటివరకు ఓటీటీ లో సరైన సక్సెస్ అందుకోలేని జాన్వీ ఈ సినిమాతో అయినా సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి.
వినూత్నమైన ప్రయోగలతో ఆకట్టుకునే విజయ్ సేతుపతి ఈసారి 19(1) (ఎ) అనే సినిమాతో రానున్నాడు. విజయ్ సేతుపతి నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఆకట్టుకోనుంది. ఇక ఈ సినిమా జూలై 29 నుండి డిస్నీ+ హాట్‌స్టార్ లో సందడి చేయబోతోంది. ఇక ఆహా లో షికారు అనే మరో డిఫరెంట్ కామెడీ డ్రామా కూడా విడుదల కానుంది. సాయి ధన్శిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో హుషారు ఫేమ్ తేజ్ కొర్రపాటి హీరోగా నటించాడు. ఇక ఈ సినిమా కూడా ఓటీటీ లో ఓ వర్గం వారిని ఆకట్టుకునే అవకాశం ఉంది.