OTT Releases: టాలీవుడ్ టు బాలీవుడ్.. ఏ సినిమా ఏ ఓటీటీకి అంటే..
గత కొన్నాళ్ల నుంచి దాదాపు ఇండియన్ సినిమా దగ్గర అన్ని భాషల్లో కూడా ఒకింత డ్రై వాతావరణమే నడుస్తుంది. నెలలో ఉన్న నాలుగు శుక్రవారాల్లో దాదాపు మూడు శుక్రవారాలు పండుగ రోజులు ప్రభుత్వ సెలవు రోజుల్లో సరైన సినిమాలు పడట్లేదు. మరి ఇలా కొంచెం డ్రై వాతావరణం కొనసాగుతున్న సమయంలో లేటెస్ట్ గా ఈ ఫ్రైడే కంటే ముందే వచ్చిన మేడే సెలవు రోజున పాన్ ఇండియా లెవెల్లో అది కూడా మూడు ప్రధాన భాషల ఇండస్ట్రీల నుంచి మూడు సినిమాలు రిలీజ్ కి వచ్చాయి.
కాగా ఇపుడు పాన్ ఇండియా మార్కెట్ లో కేవలం తెలుగు, హిందీ తమిళ్ మాత్రమే ప్రధాన భాషలుగా నిలిచాయి. కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా సినిమాలు అంతగా రిలీజ్ కూడా కావట్లేదు. మరి ఇంట్రెస్టింగ్ గా ఈ మూడు భాషల్లోనే నేడు మేడే కానుకగా అది కూడా అవైటెడ్ సినిమాలు రావడంతో ఆడియెన్స్ మళ్ళీ కొంచెం ఆసక్తి చూపించారు.

కాగా ఈ చిత్రాల్లో మొదటగా మన తెలుగు నుంచే చూసుకుంటే ఒకో సినిమాతో క్రమంగా ఎదుగుతూ వెళుతున్న నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అవైటెడ్ మాస్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం హిట్ 3 విడుదలకి వచ్చింది. నాని పరిచయం చేసిన దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు సహా హిందీ, తమిళ భాషల్లో కూడా విడుదల అయ్యింది.
ఇక తమిళ్ నుంచి చూసుకున్నట్టయితే నటుడు సూర్య నుంచి తెలుగు ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా రెట్రో విడుదల అయ్యింది. ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించారు. కాగా హిందీ సినిమాలో కూడా అవైటెడ్ సీక్వెల్.. బాలీవుడ్ లో భారీ హిట్ అయ్యిన రైడ్ కి సీక్వెల్ గా రైడ్ 2 ఇపుడు వచ్చింది. నటుడు అజయ్ దేవగన్ నటించిన ఈ సినిమాకి ఫస్ట్ పార్ట్ నే తెలుగులో రవితేజ మిస్టర్ బచ్చన్ గా రీమేక్ చేశారు.
దాని సీక్వెల్ నే రైడ్ 2 కూడా దీనిని అటు నార్త్ మార్కెట్ లో గ్రాండ్ గా విడుదల చేశారు. ఇలా వచ్చిన మూడూ మంచి బజ్ ఉన్న సినిమాలే కాగా ఇలాంటి సినిమాలకి ఓటిటిల విషయంలో కూడా ఆడియెన్స్ లో ఒకింత ఆసక్తి ఉంది. మరి ఇంట్రెస్టింగ్ గా ఈ మూడు సినిమాలు ఒకేరోజు విడుదల అయ్యిన వాటి హక్కులు ఓకే స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ సొంతం చేసుకోవడం విశేషం.
కాగా ఈ మూడు సినిమాల తాలూకా హక్కులు పాపులర్ సంస్థ నెట్ ఫ్లిక్స్ నే సొంతం చేసుకుంది. దీంతో వచ్చి నాలుగు నుంచి 8 వారాల వ్యవధిలో ఈ మూడు సినిమాలని నెట్ ఫ్లిక్స్ చూడవచ్చు. సో ఈ మేడే సినిమాలు అన్నీ థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఒకే ఓటిటిలో ఇంకా చెప్పాలంటే అందులో కూడా దాదాపు ఒకే సమయంలో కూడా రిలీజ్ అయ్యి సందడి చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











