OTT Releases on Netflix కరీనా కపూర్ ఓటీటీ ఎంట్రీ.. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఇవే

ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలోకి ఓటీటీలు ప్రవేశించిన తర్వాత బలమైన కంటెంట్, ఆసక్తికరమైన చిత్రాలను ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ+హాట్ స్టార్ లాంటి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌పై ఒరిజినల్ చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నాయి. దాంతో థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఒరిజినల్ కంటెంట్‌తో సినిమాలు నిర్మించడంపై పలు ఓటీటీ సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్‌ నెలలో రిలీజ్ అయ్యే అలాంటి ఓటీటీ చిత్రాలు వివరాల్లోకి వెళితే..

ఫ్రైడే నైట్ ప్లాన్ (Friday Night Plan):అలనాటి స్టార్ హీరోయిన్ జుహీ చావ్లా ప్రధాన పాత్రలో బాబిల్ ఖాన్, అమ్రిత్ జయన్ నటించిన చిత్రం ఫ్రైడే నైట్ ప్లాన్. న్యూ ఏజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కథ.. ఇద్దరు సోదరుల మధ్య జరిగే మానసిక సంఘర్షణ. వ్యక్తిగత జీవితంలో రిలేషన్‌షిప్స్ గురించి చర్చించే విధంగా ఉండబోతున్నదనే చిత్ర యూనిట్ వెల్లడించింది. మదర్ సెంటిమెంట్‌తో వచ్చే ఈ మూవీ సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ కానున్నది.

ది వండర్‌ఫుల్ స్టోరి ఆఫ్ హెన్నీ షుగర్ (The Wonderful Story of Henny Sugar):ప్రఖ్యాత ఫిల్మ్ మేకర్ వెస్ అండర్సన్ తాజాగా మానవ స్వభావం గురించి రూపొందించిన భావోద్వేగమైన చిత్రం ది వండర్‌ఫుల్ స్టోరి ఆఫ్ హెన్నీ షుగర్. మనుషుల్లో ఉండే రకరకాల మనస్తత్వాలు గురించి విపులంగా సినిమాలో చూపించే ప్రయత్నం చేసినట్టు తాజా ట్రైలర్ స్పష్టం చేసింది. ఆకట్టుకొనే విజువల్స్, హ్యూమర్, ఎమోషన్స్ ఈ సినిమాకు హైలెట్‌గా కనిపించాయి. ఈ చిత్ర సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ అవుతున్నది.

This month OTT Releases on Netfilx: Kareena Kapoor to debut digital platform

డిస్ఎన్‌చాంట్‌మెంట్ పార్ట్ 5 Disenchantment' (Part 5):డిస్ఎన్‌చాంట్‌మెంట్ పార్ట్ 5 గత నాలుగు సీరిస్‌లకు మంచి స్పందన ప్రేక్షకుల నుంచి వచ్చింది. ఐదో సిరీస్ కోసం భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే డిస్ఎన్‌చాంట్‌మెంట్ నాలుగు పార్టులకు నెట్‌ఫ్లిక్స్‌లో మంచి డిమాండ్ కనిపిస్తున్నది. ఐదో సిరీస్ వస్దున్నందున గత నాలుగ సీజన్లకు మళ్లీ క్రేజ్ ఏర్పడింది. డిస్ఎన్‌చాంట్‌మెంట్ పార్ట్ 5 సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ అవుతున్నది.

This month OTT Releases on Netfilx: Kareena Kapoor to debut digital platform

సెక్స్ ఎడ్యుకేషన్ సీజన్ 2 (Sex Education Season 2):సెక్స్ ఎడ్యుకేషన్ సీజన్‌ 1 వెబ్ సీరీస్‌‌కు విశేష ఆదరణ లభించింది. ఆసా బటర్‌ఫీల్డ్, కుటి గట్వా, ఎమ్మా మాకీ నటించిన ఈ వెబ్ సిరీస్‌కు నెట్‌ఫ్లిక్స్‌లో మంచి ఆదరణ లభిస్తున్నది. జనవరి 2019లో రిలీజైన ఈ వెబ్ సిరీస్ కోసం ఓటీటీ ప్రేక్షకులు అతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 21న రిలీజ్ అయ్యేందుకు నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేసింది.

This month OTT Releases on Netfilx: Kareena Kapoor to debut digital platform

కరీనా కపూర్.. జానే జాన్ (Jaane Jaan):బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తొలిసారి ఓటీటీలోకి ప్రవేశించనున్నారు. ఆమె నటించిన క్రైమ్ థ్రిల్లర్ జానే జాన్ చిత్రం విడుదలకు సిద్దమైంది. డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ X అనే జపనీస్ నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో విజయ్ వర్మ, జైదీప్ అహ్లావత్ తదితరులు నటించారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుజోష్ ఘోష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 21వ తేదీన రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X