ఓటీటీలో ఈ వారం టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఇవే.. వాటిని ఎక్కడ చూడాలంటే?

మంజుమ్మెల్ బాయ్స్
థియేటర్లలో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మెల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చి చాలా కాలం అయిపోతుంది. మే 5న హాట్ స్టార్ లోకి వచ్చిన ఈ మూవీ ఇంకా ట్రెండింగ్ లో టాప్ 1 లో నిలవడం విశేషం. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ తెలుగుతో పాటు మిగతా భాషలలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

2. భీమా
భీమా మూవీ థియేటర్లలో పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. కానీ ఓటిటిలో మాత్రం ఈ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మార్చ్ 8న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో ఏప్రిల్ 9 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వారం టాప్ 10 లో ఈ మూవీ 2 వ స్థానంలో నిలిచింది.

This week Disney Plus Hot star s Top 10 Trending Movies list

3. డోరేమాన్
ఈ సమ్మర్ హాలిడేస్ లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చిన్న పిల్లలకు కూడా ఫేవరెట్ గా మారింది. అందులో భాగంగానే పిల్లలు ఎక్కువగా ఇష్టపడే డోరేమాన్ అనే యానిమేటెడ్ షో ప్రస్తుతం టాప్ 3 లో నిలవడం విశేషం.

4. సేవ్ ది టైగర్
గత ఏడాది సమ్మర్ లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. మహి వి రాఘవ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రను పోషించారు. దానికి సీక్వెల్ గా రూపొందిన సేవ్ ది టైగర్స్ ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోకి వచ్చేసింది. కానీ ఈ వారం మాత్రం ఫస్ట్ పార్ట్ టాప్ 4 లో ట్రెండ్ అవుతోంది.

5. సైరెన్
రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సైరన్. ఇందులో జయం రవి హీరో, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హిందీ మూవీ ఏప్రిల్ 19 నుంచి నేరుగా తెలుగులో కూడా స్ట్రీమింగ్ మొదలైంది. ఈ వారం ఈ మూవీ టాప్ 5లో ట్రెండ్ అవుతుంది.

6. షిన్ చాన్
ఇక టాప్ 6లో చిన్న పిల్లలను విపరీతంగా ఆకట్టుకునే షిన్ చాన్ అనే యానిమేషన్ షో ట్రెండ్ అవుతుంది.

7. రోమాంచం
చిన్న సినిమాగా వచ్చి థియేటర్లలో సంచలనం సృష్టించిన రోమాంచం మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ టాప్ 7లో ఉంది. ఈ మూవీ ఏప్రిల్ 7 నుంచి హాట్స్టార్ లో తెలుగు తో పాటు హిందీ తమిళ భాషలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

This week Disney Plus Hot star s Top 10 Trending Movies list

8. స్కంద
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, భారీ సినిమాల డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద టాప్ 8 లో ట్రెండ్ అవుతుంది.

9. లవర్
గుడ్ నైట్ మూవీ తో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మణికందన్ హీరోగా, శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్గ గా నటించిన మూవీ లవర్ మూవీ ప్రస్తుతం హాట్ స్టార్ లో టాప్ 9లో ఉండడం విశేషం.

10 . RRR
రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ RRR టాప్ 10లో ఉంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రీ రిలీజ్ నేపథ్యంలో మరోసారి ట్రెండ్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X