This week OTT Releases: విడుదలకు సిద్దమైన ఆసక్తికరమైన సినిమాలు.. అందరి ఫోకస్ దానిపైనే!
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో గత వారం పెద్ద సినిమాలు బాగానే సందడి చేశాయి. ఇక రాబోయే రోజుల్లో కూడా కొన్ని ఆసక్తికరమైన సినిమాలు వెబ్ సీరీస్ లు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇక ఈ వారం స్ట్రీమింగ్ కాబోతున్న కొన్ని ప్రాజెక్ట్ లు ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ కానున్నాయి అనే వివరాల్లోకి వెళితే.. రీసెంట్ గా ఆయుష్మాన్ ఖురానా నుంచి వచ్చిన అనేక్ సినిమా థియేట్రికల్ గా దారుణంగా డిజాస్టర్ అయ్యింది.
వరుసగా ప్రయోగాత్మకమైన సినిమాలతో మెప్పించిన ఆయుష్మాన్ ఈసారి కాస్త భిన్నంగా చేసిన ఆర్మీ బ్యాక్ డ్రాప్ యాక్షన్ మూవీ అనేక్ కొన్ని గంటల ముందే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఇక చాలా రోజులుగా అందరిని ఎంతగానో ఉరిస్తున్న వెబ్ సీరీస్ లలో స్ట్రేంజర్ థింగ్స్ 4 కూడా టాప్ లిస్ట్ లో ఉంది. నెట్ ఫ్లిక్స్ లో టాప్ వ్యూవ్స్ అందుకున్న సీరీస్ లలో ఇదొకటి. ఇక ఇప్పుడు ఫైనల్ ఎపిసోడ్స్ ను జూలై 1వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక రెజీనా కాసాండ్రా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ అనన్య ట్యుటోరియల్ మూవీ కూడా విడుదలకు సిద్ధమైంది. ఆహా యాప్ లో జూలై 1వ తేది నుంచి సందడి చేయబోతోంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులలో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. తప్పకుండా ఓటీటీ ఆడియెన్స్ ఈ మూవీ కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు అనే చెప్పాలి.
బాలీవుడ్ లో ఇటీవల దారుణంగా డిజాస్టర్ అయినటువంటి కంగనా రనౌత్ యాక్షన్ మూవీ దాఖడ్ కూడా విడుదలకు సిద్ధమైంది. జూలై 1న ఈ సినిమా జీ5లో ప్రసారం కానుంది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా 80కోట్లకు పైగా నష్టాలను మిగిల్చిన ఈ సినిమా కోసం విడుదలకు ముందు కంగనా రనౌత్ ప్రమోషన్స్ అయితే గట్టిగానే చేసింది. లాక్ డౌన్ లోనే ఈ సినిమాకి డైరెక్ట్ ఓటీటీ రీలీజ్ కోసం మంచి ఆఫర్స్ వచ్చాయి. దాదాపు 70కోట్లకు ఒక ఆఫర్ వచ్చిందట. కానీ థియేట్రికల్ సినిమా సక్సెస్ అవుతుందని ఆశపడి దారుణంగా నష్టపోయారు. కనీసం పెట్టిన పెట్టుబడితో సగంలో సగం కూడా దాఖడ్ వెనక్కి తీసుకు రాలేకపోయింది. ఇక ఓటీటీలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











