This Week OTT Releases: ఓటీటీలోకి ఛావా, కోర్టు.. ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు ఎక్కడ చూడొచ్చంటే?

థియేట్రికల్ రిలీజ్ కంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం ప్రేక్షకుల నుంచి భారీ డిమాండ్ కనిపిస్తున్నది. ఇప్పటికే విజయవంతమైన, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన సినిమాలు థియేట్రికల్ రన్ ముగించుకొని ఓటీటీలోకి వస్తున్నాయి. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ గురించిన వివరాల్లోకి వెళితే..

సైంటిఫిక్, ఫిక్షన్‌గా రూపొందిన బ్లాక్ మిర్రర్ వెబ్ సిరీస్ గత ఆరు సీజన్లుగా ప్రేక్షకులను రంజింప చేస్తున్నది. గత కొద్దికాలంగా ఓటీటీ ప్రేక్షకులకు ఆసక్తిగా 7వ సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గత సీజన్లు చూడని వారి కోసం రెండు ఎపిసోడ్స్‌ను ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఆ రెండు ఎపిసోడ్స్ చూస్తే 7వ సీజన్ పూర్తిగా అర్ధం అవుతుందని తెలిపారు. బ్లాక్ మిర్రర్ సీజన్ 7 నెట్ ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 10 తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నది.

This Week OTT Releases

ఆస్కార్ అవార్డు గ్రహీత వైలా డేవిస్ నటించిన యాక్షన్, థ్రిల్లర్ చిత్రం G20. కేప్‌టౌన్‌లో జరిగే జీ20 సదస్సుపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంగా కథ రూపొందింది. ఈ చిత్రంలో అధ్యక్షుడు డేనియెల్లే సట్టన్‌గా వైలా డేవిస్ నటిస్తున్నారు. ఈ యాక్షన్, పొలిటికల్ డ్రామా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నది.

ఛోరీ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా ఛోరీ 2 ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఏడేళ్ల తర్వాత రెండో సీజన్ రావడం గమనార్హం. ఈ వెబ్ సిరీస్‌లో నుస్రత్ బరుచ్ఛా, సోహా అలీ ఖాన్, గష్మీర్ మహాజనీ నటించారు. ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ ఏప్రిల్ 11 తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నది.

లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా, రష్మిక మందన్న, వికీ కౌశల్ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ఛావా మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్దమైంది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితంలోని కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా రూపొందిన ఈ సినిమా అక్షయ్ ఖన్నా కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 11వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్నది.

మలయాళ చిత్ర సౌబీన్ షాహిర్, బాసిల్ జోసెఫ్, చెంబన్ వినోద్ జోష్ నటించిన చిత్రం ప్రావిన్‌కూడు షాప్పు. డార్క్ కామెడీగా, మర్డర్ మిస్టరీగా రూపొందిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మర్డర్ ఇన్వెస్టిగేషన్ మూవీకి శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఏప్రిల్ 11వ తేదీన సోని లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నది.

తెలుగులో సంచలన విజయం సాధించిన కోర్టు డ్రామా త్వరలోనే ఓటీటీలోకి రానున్నది. నాని నిర్మాతగా వ్యవహరించిన కోర్టు సినిమాలో ప్రియదర్శి, సాయికుమార్ తదితరులు నటించారు. చిన్నారులపై లైంగి దాడి చేస్తే విధించే పోస్కో చట్టం గురించి తెలియజేసే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం ఏప్రిల్ 11వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నది.

ఇవే కాకుండా డాక్టర్ 2 ఏప్రిల్ 12వ తేదీన, బిహైండ్ ది కర్టైన్: స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ ఏప్రిల్ 15వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో, ది గ్లాస్ డోమ్ చిత్రం ఏప్రిల్ 15వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్నది. ఇంకా పలు ఓటీటీల్లో భారీగా ఈ వారం స్ట్రీమింగ్ అవుతూ సమ్మర్ సెలవుల్లో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు సిద్దమవుతున్నది.

More from Filmibeat

Read more about: chhaava court netflix
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X