ఈ వారం ఓటీటీలో, థియేటర్లలో విడుదలయ్యే టాప్ సినిమాలు.. అందరి ఫోకస్ ఆ మూవీపైనే..
ఓటీటీలు వచ్చాక ఎంటర్‌టైన్మెంట్ కు కొదవ లేకుండా పోయింది. వారం వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు, డాక్యుమెంటరీలు విడుదల అవుతూ ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఓటీటీలు వచ్చినప్పటి నుండి థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందనే చెప్పాలి. మంచి చిత్రాలు వస్తే టాకీసులకు వెళ్లి చూసే వారి సంఖ్య కూడా ఏమాత్రం తక్కువగా ఉండటం లేదు. అయితే ఈ వారంలో ఏయే సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీల్లో, టాకీసుల్లో విడుదల కానున్నాయో ఇప్పుడు చూద్దాం.
ఈ వారంలో ఓ పెద్ద సినిమా ఓటీటీలోకి రానుంది. అలాగే మరో పెద్ద మూవీ థియేటర్లో విడుదల కానుంది. శ్రీకాంత్ ఓదెల, నేచురల్ స్టార్ నాని కాంబోలో వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం దసరా. తెలంగాణలో సింగరేణి ప్రాంతం నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఏప్రిల్ 27వ తేదీ గురువారం రోజు నుండి స్ట్రీమింగ్ కానుంది.

సురేందర్ రెడ్డి, అక్కినేని అఖిల్ కాంబోలో తెరకెక్కిన సినిమా ఏజెంట్. మాఫియా, అండర్ వరల్డ్ నేపథ్యంలో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 28న శుక్రవారం థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో మలయాళ మెగస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.
మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ ప్రాజెక్టులో రెండో పార్ట్ కూడా ఈ వారంలోనే థియేటర్లలో విడుదల కానుంది. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీపై తమిళ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ వారంలో ఏప్రిల్ 26వ తేదీన ఆహా ఓటీటీలో జల్లికట్టు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ తమిళ పెట్టాయికాలికి డబ్బింగ్ గా వస్తోంది. ఏప్రిల్ 28వ తేదీ నుండి సిటాడెల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. హాలీవుడ్ స్టార్ రిచర్డ్ మ్యాడెన్ కీలక పాత్రలో నటించగా తనకు జోడిగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించింది. ఇందులో టాలీవుడ్ నటి సమంత కూడా కీలక పాత్ర పోషించింది.


Click it and Unblock the Notifications











