This Week OTT Movies: ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది అలరించే చివరి చిత్రాలు ఇవే!
మరో వారం రోజుల్లో 2023వ సంవత్సరం ముగిసిపోతుంది. మరో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే ఈ వారం ఓటీటీల్లో, థియేటర్లలో విడుదల అయ్యే చిత్రాలు చాలానే ఉన్నాయి. ఇవే ఈ ఏడాది అలరించబోయే చిత్రాలు కాబోతున్నాయి. ముఖ్యంగా అందరూ మెచ్చే అద్భుతమైన సినిమాలు ఈ వారం అటు థియేటర్లలో, ఇటు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. అయితే ఆ చిత్రాలు ఏవి ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
డిసెంబస్ చివరి వారంలో వచ్చే శుక్రవారం రోజు అంటే డిసెంబర్ 29వ తేదీ రోజు కల్యాణ్ రామ్ హీరోగా రాబోతున్న డెవిల్ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్, మాళవిక నాయర్ లు హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టు అవుతుందనేది. అలాగే రాజీవ్ కనకాల, సుమ కనకాలల కుమారుడు రోషన్ కనకాల హీరోగా వచ్చిన తాజా చిత్రం బబుల్ గమ్. రవికాంత్ పేరెపు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా డిసెంబర్ 29వ తేదీనే విడుదల కాబోతుంది. తెలుగులో ఈ రెండు చిత్రాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి.

నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోయే చిత్రాలివే..!:డిసెంబర్ 25వ తేదీన స్నాగ్ స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే 26వ తేదీ నుంచి ఖో గయే హమ్ కహా అనే హిందీ సినిమా విడుదల కాబోతుంది. లిటిల్ డిక్సీ అనే హాలీవుడ్ చిత్రం డిసెంబర్ 28వ తేదీ స్ట్రీమింగ్ కాబోతుంది. డిసెంబర్ 29వ తేదీ నుంచి అన్నపూరణి కూడా స్ట్రీమింగ్ కానుంది. ఇవి మాత్రమే కాకుండా బెర్లిన్ అనే వెబ్ సిరీస్, శాస్త్రి అనే సినిమాలు కూడా అదే రోజు విడుదల అవుతున్నాయి. బీస్ట్ సినిమా డిసెంబర్ 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

అమెజాన్ ప్రైమ్, జీ5, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో..:ఇస్టూసీ బాత్ అనే హిందీ సినిమా డిసెంబర్ 24వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వేధికగా స్ట్రీమింగ్ కానుంది. ఇక జీ5లో డోనో, సఫేద్ అనే సినిమాలు డిసెంబర్ 29వ తేదీన విడుదల కానున్నాయి. వన్ అప్ ఆన్ టూ టైమ్స్ అనే హిందీ సినిమా డిసెంబర్ 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిసెంబర్ 26వ తేదీ నుంచి మంగళవారం సినిమా స్ట్రీమింగ్ కానుంది. అలాగే 29వ తేదీ నుంచి 12th ఫెయిల్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇక ఆహాలో డిసెంబర్ 29వ తేదీ నుంచి ది కర్స్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. జియో సినిమాలో ఆస్టరాయిడ్ సిటీ అనే హాలీవుడ్ చిత్రం డిసెంబర్ 25 నుంచి విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











