This Week OTT: ఓటీటీ ప్రియులకు రిపబ్లిక్ డే ట్రీట్.. యానిమల్ సహా అద్భుతమైన సినిమాలు అందుబాటులోకి!
2024 మొదలు అయినప్పటి నుంచి అద్భుతమైన సినిమాలు అటు థియేటర్లలో ఇటు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. న్యూ ఇయర్ మొదలుకొని సంక్రాంతి వరకు అనేక చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా రిపబ్లిక్ డేకు కూడా చాలానే సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధం కాగా ఓటీటీ ప్రియులను అలరించడానికి కూడా సరికొత్త సినిమాలు వస్తున్నాయి. అయితే ఈ వారం అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శివకార్తికేయన్ హీరోగా వచ్చిన అయలాన్ సినిమా జనవరి 26వ తేదీన తెలుగులో మాత్రమే థియేటర్లలో విడుదల కాబోతుంది. అలాగే ధనుష్ కెప్టెన్ మిల్లర్ తెలుగు వర్షన్ సినిమా కూడా జనవరి 25వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మరోవైపు హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా నటించిన యాక్షన్ మూవీ ఫైటర్ కూడా జనవరి 25నే విడుదల కాబోతుంది. దీంతోపాటే మోహన్ లాల్ హీరోగా వస్తున్న మలైకోటై వాలిబన్ సినిమా కూడా జనవరి 25వ తేదీన రిలీజ్ కానుంది. ఒకే ఒక్క పాత్రతో తెరకెక్కిన 105 మినిట్స్ సినిమా కూడా జనవరి 26నే రిలీజ్ కాబోతున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించేసింది.

ఇక ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెట్ ఫ్లిక్స్ వేధికగా.. జనవరి 24వ తేదీ నుంచి క్వీర్ ఐ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అలాగే సిక్స్ నేషన్స్ అనే వెబ్ సిరీస్ కూడా జనవరి 24 నుంచే అందుబాటులోకి రాబోతుంది. జనవరి 26వ తేదీ నుంచి యానిమల్ సినిమా కూడా హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. అదే రోజున బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ అనే కొరియన్ సినిమా కూడా స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ వేధికగా జనవరి 24వ తేదీ నుంచి హస్లర్స్ అనే హిందీ సినిమా స్ట్రీమింగ్ కానుంది. జనవరి 26వ తేదీ నుంచి పంచాయత్ అనే సినిమా అమెజాన్ ప్రైమ్ వేధికగా విడుదల కానుంది. ఇక జీ5లో శామ్ బహదూర్ అనే హిందీ సినిమా జనవరి 26 నుంచి అందుబాటులోకి రానుంది. మలయాళ బ్లాక్ బస్టర్ హిట్టు సినిమా నేరు కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా జనవరి 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అదే కాకుండా కర్మా కాలింగ్ అనే హిందీ సినిమా జనవరి 26 నుంచి అందుబాటులోకి రానుంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగానే... ఫ్లెక్స్ ఎక్స్ కాప్ అనే కొరియన్ సినిమా జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఫైట్ క్లబ్ అనే తమిళ సినిమా జనవరి 27వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. సోనీలివ్ లో షార్క్ ట్యాంక్ ఇడియా అనే హిందీ సినిమా జనవరి 22వ తేదీన విడుదల కానుంది. బుక్ మై షోలో వోంకా అనే హాలీవుడ్ సినిమా జనవరి 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలాగే ఆక్వామెన్ 2 జనవరి 23 నుంచి అందుబాటులోకి రానుంది. అదే రోజున ఫియర్ అనే సినిమా కూడా విడుదల కాబోతుంది ఇక యాపిల్ టీవీ ప్లస్ లో మాస్టర్స్ ఆఫ్ ది ఎయిర్ అనే వెబ్ సిరీస్ జనవరి 26 నుంచి అందుబాటులోకి రానుంది.


Click it and Unblock the Notifications











