OTT ప్రియులకు న్యూ ఇయర్ వీక్లీ ట్రీట్.. హాయ్ నాన్నతో పాటు అద్భుతమైన సినిమాలు ఓటీటీలోకి!
2023కి బాయ్ బాయ్ చెప్పేసి కొత్త ఏడాదికి వెల్ కమ్ చెప్పేశాం. అద్భుతమైన ఆశలు, ఆశయాలతో 2024లో అడుగు పెట్టిన అందరికీ కొత్త కొత్త సినిమాలు వెల్ కమ్ చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం అంతా కొత్త కొత్త అద్భుతమైన చిత్రాలు అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే ఈ కొత్త సంవత్సరం రారోతున్న తొలి చిత్రాలు ఏవి, అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2024 కొత్త సంవత్సరం సందర్భంగా టాలీవుడ్ టాప్ సింగర్ సునీత కొడుకు ఆకాశ్ హీరోగా చేసిన సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. సర్కారు నౌకరి అనే చిత్రంలో ఆకాశ్ తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టబోతున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. అలాగే శివ కంఠమనేని హీరోగా.. రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో రాఘవరెడ్డి అనే సినిమా రాబోతుంది. ఈ సినిమా జనవరి 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సీంజీవ్ మేగోటి దర్శకత్వం వహించిన ఈ సినిమా సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందుతోంది.

బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ శివాజి, వాసుకిల కాంబోలో రాబోతున్న అద్భుతమైన వెబ్ సిరీస్ కూడా ఈ వారంలోనే స్ట్రీమింగ్ కాబోతుంది. జనవరి 5వ తేదీన నుంచి ఈ #90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. శివాజి, వాసుకిలతో పాటు ఆనంద్, మౌళి, వసంతిక, రోహాన్, స్నేహల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈటీవీ విన్ వేధికగా ఈ వెబ్ సిరీస్ జనవరి 5వ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతుంది. అలాగే జీ5 వేధికగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వచ్చిన తేజస్ సినిమాలో కూడా స్ట్రీమింగ్ కాబోతుంది.
న్యాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రాబోతున్న హాయ్ నాన్న సినిమా కూడా ఓటీటీలోకి రాబోతుంది. డైరెక్టర్ శౌర్యువ్ తెరకెక్కించిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ వేధికగా జనవరి 4వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది. అలాగే బిట్ కాన్డ్ అనే హాలీవుడ్ సినిమా జనవరి ఒకటవే తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కాబోతుంది. పూల్ మీ వన్స్ అనే వెబ్ సిరీస్ కూడా ఈరోజు నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. జనవరి 4వ తేదీ నుంచి ది బ్రదర్స్ సన్ అనే వెబ్ సిరీస్ అందుబాటులోకి రాబోతుంది. అలాగే నెట్ ఫ్లిక్స్ వేధికగానే జనవరి 5వ తేదీ నుంచి కన్జూరింగ్ కన్నప్పన్ సినిమా, గుడ్ గ్రీఫ్ అనే హాలీవుడ్ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుంది.

అమెజాన్ ప్రైమ్ వేధికగా.. మారీ మై హజ్బెండ్ అనే కొరియన్ సినిమా జనవరి 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. జనవరి 3వ తేదీ నుంచి మెగ్ 2: ది ట్రెంచ్ అనే హాలీవుడ్ సినిమా అందుబాటులోకి రాబోతుంది. ఇక జీ5 వేధికగా తేజస్ అనే హిందీ సినిమా జనవరి 5వ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతుంది. యూబికల్స్ అనే మరో హిందీ సినిమా జనవరి 5వ తేదీ నుంచే సోనీలివ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.


Click it and Unblock the Notifications











