OTT ప్రియులకు సంక్రాంతి సర్‌ప్రైజ్.. సూపర్ హిట్టు సినిమాలతో పాటు స్పెషల్ వెబ్ సిరీస్‌లు ఓటీటీలోకి!

సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో అద్భుతమైన చిత్రాలు రాబోతున్నాయి. చాలా పెద్ద పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మూడ్రోజుల్లోనే మొత్తం 6 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు హీరోగా చేసిన గుంటూరు కారం, తేజ సజ్జా హీరోగా చేసిన హనుమాన్, శివకార్తికేయన్ అయలాన్ లు జనవరి 12వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్నాయి. అలాగే విక్టర్ వెంకటేష్ సైంధవ్ జనవరి 13న, నాగార్జున హీరోగా చేసిన నా సామి రంగా జనవరి 14వ తేదీన థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.

ఇంత మంచి సినిమాలు థియేటర్లలోకి రాబోతుండగా.. మరిన్ని అద్బుతమైన సినిమాలు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అయ్యాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఓటీటీ ప్రియలకు భలే సర్ ప్రైజ్ ఉండబోతుంది. జనవరి రెండో వారంలో భాగంగా సూపర్ హిట్టు సినిమాలతో పాటు సెన్సేషన్ క్రియేట్ చేసే వెబ్ సిరీస్ లు విడుదల కాబోతున్నాయి. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

This week OTT Movies: Kotabommali PS, Killer Soup, Tamil Journey Movies Will Be Streaming on January Second Week 2024

నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోయే చిత్రాలు.. బ్రేక్ పాయింట్, కింగ్ డమ్ - 3 సినిమాలు జనవరి 10వ తేదీన విడుదల కాబోతున్నాయి. అలాగే అదే రోజున బ్రేక్ పాయింట్, ది ట్రస్ట్, బాయ్ స్వాలోస్ యానివర్స్ వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. జనవరి 11వ తేదీన కిల్లర్ సూప్, ఛాంపియన్ లు రిలీజ్ కానుండగా.. లిఫ్ట్ సినిమా జనవరి 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా జనవరి 11వ తేదీన ఎకో, జనవరి 12వ తేదీన ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ చిత్రాలు రాబోతున్నాయి.

సోనీలివ్ లో జనవరి 12వ తేదీన జర్నీ అనే తమిళ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే ఆహాలో జనవరి 11వ తేదీ నుంచి కోట బొమ్మాళి పీఎస్ రిలీజ్ కాబోతుంది. జనవరి 12వ తేదీ నుంచి సేవప్పి అనే సినిమా కూడా స్ట్రీమింగ్ కానుంది. ఇక బుక్ మై షోలో జనవరి 9వ తేదీ నుంచి వన్ మోర్ షాట్ అనే హాలీవుడ్ చిత్రం విడుదల కాబోతుంది. జియో సినిమాలో లవ్ బ్రియా అనే వెబ్ సిరీస్ జనవరి 10 నుంచి, టెడ్ అనే వెబ్ సిరీస్ జనవరి 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

This week OTT Movies: Kotabommali PS, Killer Soup, Tamil Journey Movies Will Be Streaming on January Second Week 2024

అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ అనే హాలీవుడ్ సినిమా జనవరి 11 న విడుదల కానుంది. అలాగే రోల్ ప్లే అనే హాలీవుడ్ సినిమా కూడా జనవరి 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఆపిల్ టీవీ ప్లస్ లో క్రిమినల్ రికార్డ్ అనే వెబ్ సిరీస్ జనవరి 10వ తేదీ నుంచి రాబోతుంది. కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ అనే హాలీవుడ్ సినిమా కూడా జనవరి 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ అద్భుతమైన ఓటీటీ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను కూడా ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X