OTT: సండే ఫన్ డే... ఈ వారం ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి చూసే చిత్రాలివే!
ఇక వీకెండ్ వచ్చిందంటే.. చాలా మంది ఫ్యామిలీతో కలిసి సినిమాలకు వెళ్తుంటారు. అయితే కొంత మంది థియేటర్ కు పోయే ఓపిక లేక ఓటీటీలోనే చూస్తుంటారు. ఓటీటీలో ప్రతి వారం కొత్త సినిమాలు, సిరీసులు వస్తుంటాయి. ఇక ఈ వారం కూడా బోలేడన్నీ సినిమాలు, సిరీసులు వచ్చాయి. కానీ అందులో ఫ్యామిలీతో కలిసి చూసేవి మాత్రం కొన్ని మాత్రమే ఉంటాయి. ఈ వారం మీ ఇంట్లోని ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చూసే చిత్రాలు ఏంటి.. ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఆ వివరాలు చూసేద్దాం.
ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం పండగే అని చెప్పవచ్చు. ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం బోలెడన్నీ చిత్రాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అందులో మొదట మహేష్ బాబు నటించిన గుంటూరు కారం. మదర్ సెంటిమెంటుతో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా.. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.

ఇక ఈ సినిమా రమ్యకృష్ణ, జయరామ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ వేదిగా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులోనే కాదు.. తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ సినిమాను ఈ వారం ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే చూసేయొచ్చు.
ఇక గుంటూరు కారం కాకుండా ఓటీటీలోకి ధనుష్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ కెప్టెన్ మిల్లర్ కూడా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమాలో కాస్త యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉన్నా ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చుతుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాతో పాటు.. అయలాన్ కూడా స్ట్రీమింగ్ కు వచ్చింది. థియేటర్లో రిలీజ్ కాకముందే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. సన్ నెక్ట్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక వీటితో పాటు.. కన్నడ చిత్రం కాటేరా కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాాగా నచ్చుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమా వీడియోలీ ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమాను కూడా ఫ్యామిలీతో కలిసి చూసేయొచ్చు.

ఇక వీటితో పాటు యూత్ ఎంటర్ టైనర్ బబుల్ గమ్, షారుఖ్ నిర్మాణంలో తెరకెక్కిన భక్షక్, ఆర్య: అంతిమ్ వార్ సీజన్ 3 వంటివి స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ ఇవి ఫ్యామిలీతో కలిసి చూడలేం. ఇక ఈ సండే ఫన్ డే గా మార్చుకోవాలంటే.. మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











