This Week Ott Releases: మయసభ, అరేబియా కడలి.. ఈ వారం ఓటీటీ‌‌లోకి వచ్చే సినిమాలు ఇవే!

కరోనా తర్వాత దేశంలో ఓటీటీలకు గిరాకీ పెరిగిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఒరిజినల్ కంటెంట్, సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఓటీటీలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రతి వారం ఏమేం సినిమాలు థియేటర్‌లో రిలీజ్ అవుతున్నాయో తెలుసుకుంటున్నారో లేదో గానీ ఓటీటీలో వచ్చే సినిమాలను మాత్రం మిస్ చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం ప్రముఖ ఓటీటీ సంస్థలలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు పరిశీలిస్తే..

మయసభ:
దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా మయసభ. హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్స్‌పై లింగమనేని విజయ్ కృష్ణ, శ్రీహర్ష ఈ సిరీస్‌ను నిర్మించారు. ఆది పినిశెట్టి, చైతన్యరావు కీలకపాత్రల్లో నటించిన మయసభ ఆగస్ట్ 7వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్‌లోకి అందుబాటులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో దిగ్గజాలుగా పేరొందిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జీవితాల్లో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. మొత్తం 9 ఎపిసోడ్‌లను ఈ సిరీస్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

This Week Ott Release Movies and Series Mayasabha arabia kadali badmashulu And More To Watch

అరేబియా కడలి:
సత్యదేవ్, ఆనంది జంటగా నటించిన వెబ్ సిరీస్ అరేబియా కడలి. సూర్యకుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రచయితగా, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. టీజర్‌, ట్రైలర్లతో అంచనాలు పెంచేసిన ఈ సినిమాను ఆగస్ట్ 8వ తేదీ నుంచి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి తీసుకురానున్నారు.

బద్మాషులు:
మురళీధర్ గౌడ్, మహేశ్ చింతల, విద్యాసాగర్ కారంపూరి నటించిన చిత్రం బద్మాషులు. శంకర్ చేగూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ బద్మాషులు చిత్రం ఆగస్ట్ 8వ తేదీ నుంచి ఈటీవీ విన్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

పరంధుపో:
శివ, గ్రేస్ ఆంటోని, మిథుల్ ర్యాన్, అంజలి, అజు వర్గీస్ నటించిన చిత్రం పరంధు పో. రామ్ దర్శకత్వం వహించారు. జూలై 4న థియేటర్‌లలో రిలీజైన తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఆగస్ట్ 5 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

వెన్స్‌డే సీజన్ 2 పార్ట్ 1:
ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సూపర్‌ నేచురల్ ఫాంటసీ సీరిస్ వెన్స్ డే సీజన్ 2. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ ఫస్ట్ పార్ట్ ఆగస్ట్ 6 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. జెన్నా ఓర్టెగా ఇందులో కీలకపాత్ర పోషించగా.. స్టీమ్ బుకెమీ నటించారు.

మెటీరియలిస్ట్:
మిస్టరీ థ్రిల్లర్ స్టోరీకి కామెడీని కూడా జోడించి ఓటీటీలోకి వచ్చిన వెబ్‌సిరీస్ మెటీరియలిస్ట్. డకోటా జాన్సన్, క్రిస్ ఇవాన్స్, పెడ్రో పాస్కల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జూన్ 13న థియేటర్‌లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తాజాగా ఈ సినిమా ప్రైమ్ వీడియోలో రెంట్/ బై పద్ధతిలో అందుబాటులో ఉంది.

మిక్కీ 17:
సైన్స్ ఫిక్సన్ బ్లాక్ కామెడీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన మిక్కీ 17 చిత్రానికి బాంగ్ జూన్ హో దర్శకత్వం వహించారు. రాబర్ట్ పట్టిన్సన్, స్టీవెన్ యెన్, టోనీ కోలెట్టె, మార్క్ రూఫాలోలు కీలకపాత్రలు పోషించారు. వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మార్చి 7న ప్రేక్షకుల ముందుకు రాగా.. తాజాగా జియో హాట్ స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది.

లవ్ హర్ట్స్:
జోనాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్సన్ కామెడీ చిత్రం ఫిబ్రవరి 7న అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో రిలీజైంది. అరియానా దేబోస్, కీ హూ క్వాన్, డేనియల్ వూ, ముస్తాఫా షాకిర్, లియో టిప్టన్‌లు కీలకపాత్రలు పోషించారు. 87 నార్త్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

28 ఇయర్స్ లేటర్:
డేనీ బోయల్ దర్శకత్వంలో జాడీ కోమెర్, ఆరాన్ టేలర్ జాన్సన్, జాక్ ఓ కానిల్, ఆల్ఫీ విలియమ్స్, రాల్ఫ్ ఫిన్స్‌లు నటించిన చిత్రం 28 ఇయర్స్ లేటర్. కొలంబియా పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో రెంట్/ బై పద్ధతిలో అందుబాటులో ఉంది.

More from Filmibeat

Read more about: ott news Mayasabha netflix
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X