This Week OTT Releases: ఈ వారం ఓటీటీ రిలీజ్‌లు ఇవే.. పంచాయత్ 4, మిస్ట్రీ, స్క్విడ్ గేమ్3 .. ఇంకా!
ఓటీటీల రాకతో దేశ వినోద రంగంలో కీలక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నిర్మాతలకు అదనపు ఆదాయంతో పాటు ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందుతోంది. లవ్, కామెడీ, ఫ్యామిలీ, సస్పెన్స్, థ్రిల్లర్, హార్రర్ , క్రైమ్ జోనర్స్‌లో ప్రతి వారం వందలకొద్ది సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటి వివరాలను ఓటీటీ సంస్థలు ప్రతివారం అందిస్తున్నాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ సహా టాప్ ఓటీటీ సంస్థలలో రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు మీకోసం.
పంచాయత్ సీజన్ 4:
జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, ఫైసల్ మాలిక్, చందన్ రాయ్ నటించిన ఈ విలేజ్ కామెడీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

హ్యాపీ గిల్మోర్ 2:
రిటైర్డ్ గోల్ఫ్ ఆటగాడి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా జూన్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తన కూతురు స్కూల్ ఫీజు కట్టడం కోసం రిటైర్డ్ గోల్ఫర్ దాదాపు 30 ఏళ్ల తర్వాత ఓ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడం, ఈ సమయంలో ఆయన ఎదుర్కోనే అనుభవాల చుట్టూ ఈ సిరీస్ నిర్మించారు. ఆడం శాండ్లర్, జూలీ బోవెన్, డేనిస్ దుగాన్, క్రిస్టోఫర్ మెక్‌డొనాల్డ్‌లు ఇందులో కీలకపాత్రలు పోషించారు.
స్క్విడ్ గేమ్ సీజన్ 3:
ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన స్క్విడ్ గేమ్ సిరీస్‌లో భాగంగా మూడో సీజన్ జూన్ 27న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. లీ జుంగ్జే, లీ బైయాంగ్హున్, వీ హాజౌన్, ఇమ్ సివాన్ తదితరులు ఈ వెబ్ సిరీస్‌లో కీలకపాత్రలు పోషించారు.
మిస్ట్రీ:
మాజీ పోలీస్ అధికారి, ఓ డిటెక్టివ్ కలిసి క్లిష్టమైన కేసులను సింపుల్‌గా ఎలా పరిష్కరించారన్నదే ఈ మిస్ట్రీ ఇతివృత్తం. అయితే మాజీ పోలీస్ అధికారికి ఓసీడీ సమస్యలు ఉండటంతో దర్యాప్తు సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. ఈ సందర్భంగా చోటు చేసుకునే కామెడీ సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. రామ్ కపూర్, శిఖా తలసానియా, మోనా సింగ్, అభిజిత్ ఛిత్రే తదితరులు ఇందులో కీలకపాత్రలు పోషించారు. ఈ మిస్ట్రీ సిరీస్ జూన్ 27 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఐరన్ హార్ట్ :
2022లో రిలీజైన బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ సినిమాలోని ఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఐరన్ హార్ట్ జూన్ 25 నుంచి మూడు ఎపిసోడ్‌లతో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. డొమినిక్ థోర్న్, ఆంథోనీ రామోస్, షియో కౌలే, మానీ మోంటానా, సచా బరాన్ కోహెన్‌లు కీలకపాత్రలు పోషించారు.
గ్రౌండ్ జీరో:
బీఎస్ఎఫ్ జవాన్ నరేంద్రనాథ్ ధర్ దూబే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైనికుడిగా కీలకపాత్ర పోషించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది
కేరళ క్రైమ్ ఫైల్స్ 2:
అజు వర్గీస్, లాల్, జిన్జ్ షాన్, శ్రీజిత్ మహాదేవన్ కీలకపాత్రల్లో నటించిన ది కేరళ క్రైమ్ ఫైల్స్ 2 ప్రస్తుతం జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు/ వెబ్ సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
కె-పాప్ డెమన్ హంట్స్
ట్రైన్ వ్రిక్: మేయర్ ఆఫ్ మహ్యమ్
ఏ కింగ్ లైక్ మి
గ్రెన్ఫెల్: అన్ కవర్డ్
ది మెనీ డెత్స్ ఆఫ్ ఎనోరా డాల్మస్సో
డల్లాస్ కౌబాయ్స్చర్ లీడర్స్
సెమి సియోటర్
ఎ లాగోస్ లవ్ స్టోరీ
లాటిన్ బ్లడ్
ది వాటర్ ఫ్రంట్
బేబీ ఫార్మ్
అమెజాన్ ప్రైమ్ వీడియో:
ది ఎక్స్‌టార్షన్
పార్లలల్
ఫస్ట్ కాపీ
కాప్ అండ్ ఏ హాఫ్
యుద్ధకాండ చాప్టర్ 2
లవ్లీ
వి వర్ లయర్స్
ది హోల్డోవర్స్


Click it and Unblock the Notifications











