This Week Ott Releases : ఈ వారం ఓటీటీ సినిమాల సందడి.. వీర ధీర శూర, ఎంపురాన్, మరిన్ని.. ఇక్కడ చూసేయండి
ఈ వారం ఓటీటీకి పవర్ ఫుల్ డ్రామాలు, థ్రిల్లింగ్ మూవీస్ విడుదల కాబోతున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం చిత్రాలు ఓటీటీ రిలీజ్ కు సిద్ధంగా ఉండటం విశేషం. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమోజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్, జీ5 వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి.
1. జ్యూవెల్ థీఫ్ : ది హెయిస్ట్ బిగిన్ (The Jewel Thief : The Heist Begins)
జ్యూవెల్ థీఫ్ : ది హెయిస్ట్ బిగిన్ ఇది ఒక యాక్షన్ మూవీ. దొంగతనంలో ఆరితేరిన ఒక వ్యక్తి తరుచూగా పలు మిషన్స్ ను అంగీరిస్తూ ఉంటాడు. ఆఫ్రియన్లకు చెందిన అత్యంత విలువైన రెడ్ సన్ డైమండ్ ను ఎలా దింగలించాడనేది ఈ మూవీ సారాంశం. నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 25 నుంచి ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులోకి రానుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్, జైదీప్ అల్హావట్, కునాల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

2. యూ సీజన్ 5 (You Season 5)
అమెరికన్ సైకాలాజికల్ థ్రిల్లర్ 'యూ' ఓటీటీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. నెట్స్ ఫ్లిక్స్ లో ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించిన నాలుగు ఎపిసోడ్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 5వ సీజన్ కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 24న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఆడియెన్స్ కు అందుబాటులోకి రానుంది.
3. హవోక్ (Havoc)
ఒక డ్రగ్ డీలింగ్ లో జరిగిన తప్పిదం వల్ల బడా పొలిటీషియన్ కొడుకు ప్రమాదంలో పడుతాడు. అండర్ వరల్డ్ మాఫియాకు చిక్కుతాడు. వారి నుంచి డిటెక్టివ్ ఎలా క్రిమినల్స్ ను ఎదుర్కొన్ని అతన్ని రక్షించాడనేది ఈ మూవీ సారాంశం. ఈ అమెరియన్ యాక్షన్ థ్రిల్లర్ కు నెట్ ఫ్లిక్స్ లో మంచి ఆదరణ ఉంది. ఏప్రిల్ 25 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
4. వీరా ధీరా సూరన్ పార్ :2 (Veera Dheera Soora)
తమిళ స్టార్, చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'వీర ధీర శూర'. సాధారణ జీవితం గడుపుతున్న ఓ స్టోర్ యాజమానికి జీవితం ప్రమాదకరమైన క్రైమ్ నెట్ వర్క్ లోకి ఎలా లాగబడిందనేది సినిమా కథ. ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 24 నుంచి అందుబాటులోకి రానుంది. చియాన్ విక్రమ్ తో పాటు ఎస్జే సూర్య, దసరా విజయన్ కీలక పాత్రలు పోషించారు.
5. L2 : ఎంపురాన్ (L2: Empuraan)
మలయాళ ఇండస్ట్రీ నుంచి రీసెంట్ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపిన యాక్షన్ థ్రిల్లర్ L2 : ఎంపురాన్ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయ్యింది. జియో హాట్ స్టార్ లో ఏప్రిల్ 24 నుంచి ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, మంజు వారియ్, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
6. అయ్యన మనె (Ayyana Mane)
కన్నడ చిత్రంలో వచ్చిన సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ 'అయ్యన మన్నె' అనే సినిమాకు అక్కడ మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. జీ5లో ఏప్రిల్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఖుషి రవి, మనాసి సుధీర్, అక్షయ్ నాయక్ ప్రధాన పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











