This Week Ott Releases: తమ్ముడు, 3 BKH, హౌజ్ ఫుల్ 5.. ఓకే రోజే ఓటీటీలోకి 4 చిత్రాలు.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీ చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కుతోంది. ప్రస్తుతం థియేటర్లలో కంటే ఓటీటీల్లోనే సినిమాలు చూసేందుకు ఆడియెన్స్ మొగ్గు చూపిస్తున్నారు. ఈ క్రమంలో జూలై 31 నుంచి ఆగస్టు 5 వరకు వారం రోజుల్లో ఓటీటీలోకి వచ్చిన, వస్తున్న చిత్రాలపై ఫుల్ డిటైయిల్స్ ఇక్కడ ఉన్నాయి. థియేటర్లలో మెప్పించి ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్ధమైన చిత్రాలు, వాటికి సంబంధించిన ఓటీటీ వేదికల వివరాల్లోకి వెళితే..
3 BHK..
స్టార్ హీరో సిద్ధార్థ నటించిన రీసెంట్ ఫిల్మ్ 3 BHK. తమిళ భాషలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తెలుగులోనూ గ్రాండ్ గా విడుదలైంది. థియేటర్లలో ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శాంతి టాకీస్ బ్యానర్ పై అరుణ్ విశ్వా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. శరత్ కుమార్, దేవయాని, మీతా రఘునాథ్, యోగి బాబు ఈ చిత్రంలోని కీలక పాత్రలను పోషించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 1 ఆగస్టు 2025 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

Oh Bhama Ayyo Rama..
తెలుగు రొమాంటిక్ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రీసెంట్ గా చిత్రం హో భామ అయ్యో రామ. ఈ చిత్రంలో యంగ్ స్టార్ సుహాస్, మాళవికా మనోజ్ జంటగా నటించారు. వీ ఆర్ట్స్ బ్యానర్ లో హరీశ్ నల్ల నిర్మించిన ఈ చిత్రానికి రాము గోదాల దర్శకత్వం వహించారు. అర్జున్ రెడ్డికి సంగీతం అందించిన రాధన్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయడం విశేషం. జూలై 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆగస్టు 1 నుంచి ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్ వీడియోల్లో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.
Thammudu
టాలీవుడ్ స్టార్ నితిన్ ఇటీవలి చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించడం విశేషం. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ శ్రీ వెకంటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో 70 కోట్ల రూపాయాలతో నిర్మించారు. జూలై 4న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. హీరోయిన్ గా సప్తమి గౌడ నటించింది. ఇక ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఆగస్టు 1 నుంచి అందుబాటులోకి వచ్చింది.
Housefull 5
రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ లో దుమ్ములేపిన చిత్రం హౌజ్ ఫుల్ 5. కన్నప్ప చిత్రం తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హౌజ్ ఫుల్ 5తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మర్డర్ మిస్టరీతో కామెడీ థ్రిల్లర్ గా రూపొందింది. తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించారు. నడియాద్వాలా ఎంటర్ టన్ మెంట్స్ బ్యానర్ లో సాజిత్, ఫిరుజీ ఖాన్ నిర్మించారు. జూన్ 6న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడంతో 8 వారాల తర్వాత ఆగస్టు 1న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
Red Sandalwood
తమిళ భాషలో రూపుదిద్దుకున్న ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ రెడ్ సాండల్ వుడ్. గురు రామానుజం దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం 2023 సెప్టెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సప్సెన్స్, యాక్షన్, డ్రామా వంటి అంశాలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 31 నుంచి ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది.
Saayiraa
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది హిందీ మ్యూజికల్ రొమాంటిక్ ఫిల్మ్ సైయారా. ఈ చిత్రానికి ఆషికీ 2 డైరెక్టర్ మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించారు. వీరి నటనకు నార్త్ ఆడియెన్స్ నుంచి విశేషమైన స్పందన లభిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రం జూలై 11నే థియేటర్లలో విడుదలైంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. ఆగస్టు మూడో వారంలో ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఇంకా పక్కా డేట్ అనౌన్స్ కాలేదు.


Click it and Unblock the Notifications











