This Week OTT Release Movies: ఈ వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లో ఎంటర్‌టైన్‌మెంట్ జాతర..

This Week OTT Release Movies: వీకెండ్ వచ్చిందంటే? మూవీ లవర్స్ లో ఒకే ఒక్క ప్రశ్న 'ఏం చూడాలి?' థియేటర్లలో సినిమాలు ఉన్నా, ఇంట్లో కూర్చొని ఓటీటీ ద్వారా వినోదాన్ని ఆస్వాదించడం ఇప్పుడు చాలా మందికి అలవాటు అయిపోయింది. అలాంటి డిజిటల్ ప్రేక్షకుల కోసం ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫాంలు భారీగా కంటెంట్‌ను సిద్ధం చేశాయి. మార్చి 30 నుంచి ఏప్రిల్ 5 వరకు వివిధ ప్లాట్‌ఫాంలలో దాదాపు 16కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానుండటం విశేషం. తెలుగు, హిందీ, తమిళం, హాలీవుడ్, కొరియన్ కంటెంట్ ఇలా అన్ని జానర్లలో ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉండటంతో ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగ వాతావరణం నెలకొంది.

మృత్యుంజయ్ (ఏప్రిల్ 03)
ఈ వారం తెలుగు కంటెంట్‌ స్పెషల్ ఆట్రాక్షన్ గా మారింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీవిష్ణు నటించిన 'మృత్యుంజయ్'. థియేటర్లలో మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఒక జర్నలిస్ట్ వరుసగా జరుగుతున్న అనుమానాస్పద మరణాల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే కథ ఇది. సాధారణంగా మొదలయ్యే కథ, క్రమంగా ప్రమాదకరమైన కుట్రగా మారడం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఇది ఒక బెస్ట్ ఛాయిస్‌గా చెప్పొచ్చు.

This Week OTT Releases 16 Movies amp amp Series to Watch on Netflix Prime amp amp More

హే బల్వంత్‌( మార్చి 31)
ఇక సుహాస్ నటించిన 'హే బల్వంత్' కూడా ఈ వారం హైలైట్‌గా నిలుస్తోంది. జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం కామెడీతో పాటు భావోద్వేగాలను కలగలిపిన కథతో సాగుతుంది. తండ్రిని ఆదర్శంగా భావించే ఓ యువకుడు, అతని జీవితంలో ఒక షాకింగ్ నిజం బయటపడిన తర్వాత జరిగే పరిణామాలు కథలో ప్రధానాంశం. సుహాస్ తన సహజ నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండే ఈ సినిమా, వీకెండ్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని (ఏప్రిల్‌ 3)
ఇక శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' కూడా ఈ వారం ఓటీటీకి వస్తోంది. థియేటర్లలో మంచి స్పందన పొందిన ఈ క్రైమ్ కామెడీ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగిన అనుకోని సంఘటన, దాన్ని దాచిపెట్టే ప్రయత్నంలో వచ్చే హాస్యభరిత పరిస్థితులు కథను ఆసక్తికరంగా మార్చుతాయి. చాలా కాలం తర్వాత లయ తెరపై కనిపించటం, అలాగే బిగ్‌బాస్ తర్వాత శివాజీకి వచ్చిన క్రేజ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది.

సితారే జమీన్ పర్ (ఏప్రిల్ 03)
బాలీవుడ్ కంటెంట్ విషయంలో కూడా ఈ వారం మంచి ఎంపికలు ఉన్నాయి. ఆమిర్ ఖాన్ నటించిన 'సితారే జమీన్ పర్' సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న పిల్లలు, వారి జీవితం, విజయం వంటి భావోద్వేగ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను కదిలించేలా ఉంటుంది. అలాగే 'హ్యాపీ పటేల్' అనే యాక్షన్ కామెడీ చిత్రం, 'వధ్-2' అనే క్రైమ్ డ్రామా కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నాయి.

ఇక హాలీవుడ్, ఇంటర్నేషనల్ కంటెంట్ విషయానికి వస్తే.. ఈ వారం భారీగా వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవుతున్నాయి. 'బ్లడ్‌హౌండ్స్ సీజన్ 2' యాక్షన్, రివెంజ్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. 'జో కిట్టీ సీజన్ 3' యువతరానికి బాగా కనెక్ట్ అయ్యే లవ్ డ్రామా. 'హై టైడ్స్ సీజన్ 2' రిచ్ లైఫ్‌స్టైల్, స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక హారర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం 'సెండ్ హెల్ప్' అనే హాలీవుడ్ హారర్ మూవీ అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. అలాగే 'ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ 2' కూడా హారర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధంగా ఉంది.

అమెజాన్ ప్రైమ్:
మా కా సమ్- సీజన్-1(హిందీ సిరీస్) - ఏప్రిల్ 04
సెండ్ హెల్ప్- ఇంగ్లిష్ సినిమా - మార్చి 31
అవతార్ ఫైర్ అండ్ యాష్ - మార్చి 31

జియో హాట్‌స్టార్‌:
సెండ్ హెల్ప్‌(హాలీవుడ్ హారర్‌ మూవీ) - మార్చి 31
ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్‌-2(హాలీవుడ్ సినిమా) - ఏప్రిల్ 03

నెట్‌ఫ్లిక్స్:
రిపుల్(హాలీవుడ్ వెబ్ సిరీస్) - మార్చి 31
హ్యాపీ పటేల్(హిందీ సినిమా) - ఏప్రిల్ 01
జో కిట్టీ- సీజన్-3(హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఏప్రిల్ 02
మృత్యుంజయ్(తెలుగు సినిమా) -ఏప్రిల్ 03
మామ్లా లీగల్‌ హై- సీజన్-2(బాలీవుడ్ వెబ్ సిరీస్) - ఏప్రిల్ 03
వధ్‌-2(హిందీ సినిమా) -ఏప్రిల్ 03
బ్లడ్‌హౌండ్స్ సీజన్-2(హాలీవుడ్ వెబ్ సిరీస్) -ఏప్రిల్ 03
హై టైడ్స్- సీజన్-2(హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఏప్రిల్ 03

జీ5:
హే బల్వంత్‌(తెలుగు)మార్చి 31,
బాబ్జీ ఘర్‌ పర్‌ హై-ఫన్ ఆన్ ది రన్(హిందీ),
తానా - ఏప్రిల్ 3

ఈటీవీ విన్: 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'- ఏప్రిల్ 3

ఆపీల్ టీవీ ప్లస్: యువర్ ఫ్రెండ్స్ అండ్ నెబర్స్(హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఏప్రిల్ 03

సోనీ లివ్: సితారే జమీన్ పర్(బాలీవుడ్ )- ఏప్రిల్ 03

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X