OTTలో మూవీ ఫెస్టివల్.. ఏకంగా 25 సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్!
సినిమా లవర్స్ కు ఈ వారం పండగే అని చెప్పవచ్చు. అటు థియేటర్లలో ప్రభాస్ నటించిన సలార్, షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా సందడి చేస్తుండగా.. ఇటు ఓటీటీల్లో ఏకంగా 25కు పైగా సినిమాలు, సిరీసులు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏ సిరీస్, ఏ సినిమాలు ఆసక్తి కలిగిస్తున్నాయో పూర్తి వివరాల్లోకి వెళితే...
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ ఎట్టకేలకు డిసెంబర్ 22న థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. మరోవైపు షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా సైతం ఈరోజు థియేటర్లలో సందడి చేస్తుంది. ఇక ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్అయితే వస్తుంది. ఇదిలా ఉంటే.. అటు ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు, సిరీసులు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఆసక్తి కలిగిస్తున్న చిత్రాలు సిరీసులు ఏంటో తెలుసుకుందాం.

టాలీవుడ్ హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల నటించిన 'ఆదికేశవ' సినిమా ఒకటి కాగా... కన్నడ హీరో రక్షిత్ శెట్టి, రుక్మిణి నటించిన 'సప్త సాగరాలు దాటి సైడ్-బి' చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లు, బాలీవుడ్ చిత్రాలు సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. ఏయే సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం.

ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు, సిరీసుల లిస్ట్ ఇదే...
నెట్‌ఫ్లిక్స్:
1. సిండీ లా రెజీనా: ద హై స్కూల్ ఇయర్స్ (స్పానిష్ సిరీస్) - డిసెంబరు 20 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
2. మ్యాస్ట్రో (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 20 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
3. ద టేమింగ్ ఆఫ్ ష్రూడ్ 2 (పోలిష్ సినిమా) - డిసెంబరు 20 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
4. అల్హమర్ H.A (అరబిక్ మూవీ) - డిసెంబరు 21 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
5. లైక్ ఫ్లవర్స్ ఇన్ సాండ్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 21 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
6. రెబల్ మూన్ పార్ట్ 1: ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 21 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
7. ఆదికేశవ (తెలుగు మూవీ) - డిసెంబరు 22న స్ట్రీమింగ్
8. కర్రీ & సైనైడ్: ద జాలీ జోసెఫ్ కేస్ (హిందీ సిరీస్) - డిసెంబరు 22న స్ట్రీమింగ్
9. యోంగ్‌సాంగ్ క్రియేచర్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 22న స్ట్రీమింగ్
10. కుయికో (తమిళ మూవీ) - డిసెంబరు 22న స్ట్రీమింగ్
11. ఏ వ్యాంపైర్ ఇన్ ద ఫ్యామిలీ (పోర్చుగీస్ సినిమా) - డిసెంబరు 24న స్ట్రీమింగ్
12. పింక్ ఫాంగ్ సింగ్-అలాంగ్ మూవీ 3: క్యాచ్ ద జింజర్ బ్రెడ్ మ్యాన్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 24న స్ట్రీమింగ్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
13. BTS మాన్యుమెంట్స్: బియాండ్ ద స్టార్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 20
14. డ్రాగన్స్ ఆఫ్ వాండర్ హ్యాచ్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 20 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
15. పెర్సీ జాక్సన్ అండ్ ఒలింపియన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 20 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
16. వాట్ ఇఫ్..?: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 22న స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ వీడియో:
17. ద ఏసెస్ (ఇండోనేసియన్ మూవీ) - డిసెంబరు 21 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
18. డ్రై డే (హిందీ సినిమా) - డిసెంబరు 22న స్ట్రీమింగ్
19. సాల్ట్ బర్న్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 22న స్ట్రీమింగ్
20. సప్త సాగరాలు దాటి సైడ్-బి (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 22న స్ట్రీమింగ్
జీ5:
21. అడి (మలయాళ మూవీ) - డిసెంబరు 22న స్ట్రీమింగ్
22. హోమోరస్లీ యూవర్స్: సీజన్ 3 (హిందీ సిరీస్) - డిసెంబరు 22న స్ట్రీమింగ్
జియో సినిమా:
23. బార్బీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 21 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
24. హే కమీని (హిందీ మూవీ) - డిసెంబరు 22న స్ట్రీమింగ్
లయన్స్ గేట్ ప్లే:
25. ఫియర్ ద నైట్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 22న స్ట్రీమింగ్


Click it and Unblock the Notifications











