OTT ప్రియులకు సమ్మర్ ట్రీట్.. ఓప్పెన్ హైమర్ సహా 20 సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలోకి!
సమ్మర్ వచ్చేసిందో లేదో అనేక సినిమాలు సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అటు థియేటర్లలో, ఇటు ఓటీటీల్లో కొత్త కొత్త చిత్రాలు వస్తున్నాయి. ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాల హవా కొనసాగుతుండగా.. ఓటీటీలోకి మాత్రం అనేక పెద్ద పెద్ద చిత్రాలు రాబోతున్నాయి. ఈ వారం ఏకంగా 20 సినిమాలు వస్తున్నాయి. ఆ చిత్రాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆస్కార్ అవార్డుల్లో మొత్తం 7 అవార్డులు గెలుచుకున్న ఓప్పెన్ హైమర్ సినిమా కూడా ఈవారమే విడుదల అవుతుంది. అలాగే అబ్రహం ఓజ్లర్, వైవా హర్ష సుందర మాస్టర్, ఓ వతన్ మేరే వతన్, లాల్ సలామ్, ఫైటర్ వంటి సినిమాలు మార్చి 22వ తేదీన స్ట్రీమింగ్ కు రెడీగా ఉన్నాయి. ఇంకా ఏయే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీ వేదికగా రాబోతున్నాయో చూసేయండి.

నెట్ ఫ్లిక్స్ వేదికగా..
యంగ్ రాయల్స్ ఫరెవర్ (స్వీడిష్ సినిమా) - మార్చి 18
3 బాడీ ప్రాబ్లమ్ (వెబ్ సిరీస్) - మార్చి 21
ఫైటర్ (హిందీ) - మార్చి 21
బైయింగ్ బేవర్లీ హిల్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 22
షిర్లే (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 22
ద కసగ్రెనేడ్స్ మూవీ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 22
లాల్ సలామ్ (తమిళ/తెలుగు) - మార్చి 22
అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా..
ప్లే గ్రౌండ్ (హిందీ సిరీస్) - మార్చి 17
మరక్కుమ నెంజాం (తమిళ) - మార్చి 19
ఏ వతన్ మేరే వతన్ (హిందీ) - మార్చి 21
రోడ్ హౌస్ (హాలీవుడ్) - మార్చి 21

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా...
అబ్రహం ఓజ్లర్ (తెలుగు) - మార్చి 20
సౌండ్ ల్యాండ్ : ద సిరీస్ (జపనీస్ సిరీస్) - మార్చి 20
ఎక్స్ - మ్యాన్ 97 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 22
అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 22
లూటేరా (హిందీ) - మార్చి 22
డేవీ అండ్ జాన్సీస్ లాకర్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 22
ఫొటోగ్రాఫర్ సీజన్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 24

జియో సినిమా వేదికగా..
ఓపెన్ హైమన్ (తెలుగు) - మార్చి 21
బుక్ మై షో వేదికగా..
ఫ్రూయడ్స్ లాస్ట్ సెషన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 19
ఆపిల్ ప్లస్ టీవీ వేదికగా..
పామ్ రాయల్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 20
ఆర్లిల్లీ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 23
ఈటీవీ విన్
సందరం మాస్టర్ (తెలుగు) - మార్చి 22


Click it and Unblock the Notifications











