OTT లవర్స్‌కు ముందే వచ్చిన పండుగ... ఏకంగా 35 సినిమాలు రిలీజ్!

మళ్లీ కొత్త వారం మొదలు అయింది. ఇక దసర రాకముందే సినిమాల పండుగ మొదలైంది. ఈ వారం ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 35 సినిమాలు, సిరీసులు వివిధ ఓటీటీ వేదికల్లో విడుదల కాబోతున్నాయి. ఇక మూవీ లవర్స్ కు ఈ వారం పండగ అనే చెప్పవచ్చు. అయితే ఇందులో ఇంట్రెస్ట్ కలిగించేవి మాత్రం కొన్ని మాత్రమే ఉన్నాయి. అసలు ఆ 35 సినిమాలు ఏంటి.. ఎక్కడ రిలీజ్ అవుతున్నాయి.. అందులో ఇంట్రెస్ట్ కలిగించే చిత్రాలు, వెబ్ సిరీసులు ఏంటో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.

ఓటీటీ వేదికలు వచ్చాక.. మూవీ లవర్స్ కు ప్రతివారం పండగే. వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసి కొత్త కొత్త సినిమాలో ఎంచాక్క ఇంట్లోనే కలిసి చూడొచ్చు. లేదంటే అరచేతిలోనే టైం పాస్ కు ఏదో ఓ సినిమా చూసేయొచ్చు. ఇక ఈ వారం ఏకంగా 35 సినిమాలు, సిరీసులు రిలీజ్ అవుతున్నాయి.

OTT

ఇక వీటిలో ఆసక్తి కలిగిస్తున్న చిత్రం ప్రేమ విమానం. అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఈ వారమే డైరెక్టుగా ఓటీటీలోకి రాబోతుంది. ఇక దీనితో పాటు 9 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న బలగం వంటి సినిమా మట్టికథ ఓటీటీలోకి రాబోతుంది. దీనితో పాటు మథగమ్ పార్ట్ 2 కూడా ఆసక్తి కలిగిస్తోంది.

ఓటీటీలో ఈ వారం రిలీజ్ అయ్యే చిత్రాల వివరాలు ఇలా....

అమెజాన్ ప్రైమ్
1. అవేర్‌నెస్ (స్పానిష్ సినిమా) - అక్టోబరు 11న స్ట్రీమింగ్
2. ఇన్ మై మదర్స్ స్కిన్ (తగలాగ్ మూవీ) - అక్టోబరు 12న స్ట్రీమింగ్
3. ఎవ్రిబడీ లవ్ డైమండ్స్ (ఇటాలియన్ సిరీస్) - అక్టోబరు 13న స్ట్రీమింగ్
4. ద బరియల్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 13న స్ట్రీమింగ్
నెట్‌ఫ్లిక్స్
5. మార్గాక్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 09న స్ట్రీమింగ్
6. డైరీస్ సీజన్ 2 పార్ట్ 1 (ఇటాలియన్ సిరీస్) - అక్టోబరు 10న స్ట్రీమింగ్
7. లాస్ట్ వన్ స్టాండింగ్ సీజన్ 2 (జపనీస్ సిరీస్) - అక్టోబరు 10న స్ట్రీమింగ్
8. బిగ్ వేప్: ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ జుల్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 11న స్ట్రీమింగ్
9. వన్స్ అపాన్ ఏ స్టార్ (థాయ్ మూవీ) - అక్టోబరు 11న స్ట్రీమింగ్
10. ప్యాక్ట్ ఆఫ్ సైలెన్స్ (స్పానిష్ సిరీస్) - అక్టోబరు 11న స్ట్రీమింగ్
11. గుడ్‌నైట్ వరల్డ్ (జపనీస్ సిరీస్) - అక్టోబరు 12న స్ట్రీమింగ్
12. ద ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 12న స్ట్రీమింగ్
13. ఇజగ్బాన్ (యోరుబా సినిమా) - అక్టోబరు 13న స్ట్రీమింగ్
14. కాసర్ గోల్డ్ (మలయాళ మూవీ) - అక్టోబరు 13న స్ట్రీమింగ్
15. ద కాన్ఫరెన్స్ (స్వీడిష్ చిత్రం) - అక్టోబరు 13న స్ట్రీమింగ్
16. క్యాంప్ కరేజ్ (ఉక్రేనియన్ సినిమా) - అక్టోబరు 15న స్ట్రీమింగ్
హాట్‌ స్టార్
17. మథగమ్ పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబరు 12న స్ట్రీమింగ్
18. గూస్‌బంప్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 13న స్ట్రీమిం
19. సుల్తాన్ ఆఫ్ దిల్లీ (హిందీ సిరీస్) - అక్టోబరు 13న స్ట్రీమింగ్
ఆహా
20. మట్టికథ (తెలుగు సినిమా) - అక్టోబరు 13న స్ట్రీమింగ్
జీ5
21. ప్రేమ విమానం (తెలుగు మూవీ) - అక్టోబరు 13న స్ట్రీమింగ్
సోనీ లివ్
22. సంతిత్ క్రాంతి సీజన్ 2 (మరాఠీ సిరీస్) - అక్టోబరు 13న స్ట్రీమింగ్
జియో సినిమా
23. కోఫుకు (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 09న స్ట్రీమింగ్
24. అర్మాండ్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 10న స్ట్రీమింగ్
25. కమింగ్ ఔట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ టైమ్ మెషీన్ (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 11న స్ట్రీమింగ్
26. ద లాస్ట్ ఎన్వలప్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 12న స్ట్రీమింగ్
27. మురాఖ్ ద ఇడియట్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 13న స్ట్రీమింగ్
28. రింగ్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 15న స్ట్రీమింగ్
డిస్కవరీ ప్లస్
29. స్టార్ vs ఫుడ్ సర్వైవల్ (హిందీ సిరీస్) - అక్టోబరు 09న స్ట్రీమింగ్
ఈ-విన్
30. మిస్టర్ నాగభూషణం (తెలుగు సిరీస్) - అక్టోబరు 13న స్ట్రీమింగ్
బుక్ మై షో
31. మిషన్ ఇంపాజిబుల్ - డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 11న స్ట్రీమింగ్
32. టాక్ టూ మీ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 15న స్ట్రీమింగ్
33. ద క్వీన్ మేరీ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 15న స్ట్రీమింగ్
ఆపిల్ ప్లస్ టీవీ
34. లెసన్స్ ఇన్ కెమిస్ట్రీ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 13న స్ట్రీమింగ్
లయన్స్ గేట్ ప్లే
35. పాస్ట్ లైవ్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 13న స్ట్రీమింగ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X