OTTలో సినీ జాతర.. ఏకంగా 22 సినిమాలు... కచ్చితంగా చూడాల్సినవి మాత్రం అవే!
ఓటీటీలో ప్రతి వీకెండ్ సినిమాల సందడి మొదలు అవుతుంది. అటు థియేటర్లలో కూడా పెద్ద సినిమాలు సందడి చేయనున్నాయి. ముఖ్యంగా రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా రిలీజ్ అవుతుండగా.. ఇటు ఓటీటీలోనూ ఒకటి కాదు రెండు కాదు.. 22 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీసులు ఏంటి.. అవి ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయి.. ఆసక్తి కలిగిస్తున్న సినిమాలు, సిరీసులు ఏంటి అనేవి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ సారి థియేటర్లలో రణబీర్ కపూర్, సందీప్ వంగా కాంబినేషన్లో తెరకెక్కిన యానిమల్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 1న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇటు ఓటీటీల్లో కూడా ఏకంగా 22 సినిమాలు, సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈ విడుదల అవుతున్న చిత్రాల్లో ఆసక్తి కలిగిస్తున్నా చిత్రాలు ఏం ఉన్నాయో చూద్దాం.

నాగచైతన్య విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన దూత వెబ్ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది. చై తొలిసారి నటించిన వెబ్ సిరీస్ కావడంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి. మిషన్ రాణిగంజ్, ఇండియాన జోన్స్, '800', 'జర హట్కే జర బచ్కే', రూల్స్ రంజాన్ సినిమాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీసుల లిస్ట్
నెట్‌ఫ్లిక్స్:
1. ఫ్యామిలీ స్విచ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 30న స్ట్రీమింగ్
2. హార్డ్ డేస్ (జపనీస్ చిత్రం) - నవంబర్ 30న స్ట్రీమింగ్
3. ఒబ్లిటెరేటడ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 30న స్ట్రీమింగ్
4. ద బ్యాడ్ గాయ్స్: ఎ వెరీ బ్యాడ్ హాలీడే (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్) - నవంబర్ 30న స్ట్రీమింగ్
5. వర్జిన్ రివర్ సీజన్ 5: పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 30న స్ట్రీమింగ్
6. స్కూల్ స్పిరిట్స్, సీజన్ 1 (వెబ్ సిరీస్) - నవంబర్ 30న స్ట్రీమింగ్
7. ద బిగ్ అగ్లీ (2020) సినిమా - నవంబర్ 30న స్ట్రీమింగ్
8. మామాసపనో: నౌ ఇట్ కెన్ బీ టోల్డ్ (తగలాగ్ సినిమా) - డిసెంబర్ 1న స్ట్రీమింగ్
9. మే డిసెంబర్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 1న స్ట్రీమింగ్
10. మిషన్ రాణిగంజ్: ద గ్రేట్ భారత్ రెస్క్యూ (హిందీ చిత్రం) - డిసెంబర్ 1న స్ట్రీమింగ్
11. స్వీట్ హోమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 1న స్ట్రీమింగ్
12. ద ఈక్వలైజర్ 3 (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 1న స్ట్రీమింగ్
13. బాస్కెట్‌బాల్ వైవ్స్, 3-4 సీజన్స్ (సిరీస్) - డిసెంబర్ 1న స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్:
14. షెహర్ లఖోట్ (హిందీ వెబ్ సిరీస్) - నవంబర్ 30న స్ట్రీమింగ్
15. దూత (తెలుగు వెబ్ సిరీస్) - డిసెంబర్ 1న స్ట్రీమింగ్
16. క్యాండీ కేన్ లైన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 1న స్ట్రీమింగ్
డిస్ని ప్లస్ హాట్‌స్టార్:
17. ఇండియానా జోన్స్ అండ్ ద డయల్ ఆఫ్ డెస్టినీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 1న స్ట్రీమింగ్
18. మాన్‌స్టర్ ఇన్‌సైడ్: అమెరికాస్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ హాంటెడ్ హౌస్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబర్ 1న స్ట్రీమింగ్
19. ద షెఫర్డ్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 1న స్ట్రీమింగ్

జియో సినిమా:
20. 'జర హట్కే జర బచ్కే' - డిసెంబర్ 2న స్ట్రీమింగ్
21. '800' మూవీస్ డిసెంబర్ 2న స్ట్రీమింగ్
ఆహా:
22. రూల్స్ రంజన్ -నవంబర్ 30 సాయంత్రం 6గంటల నుంచి స్ట్రీమింగ్


Click it and Unblock the Notifications











