OTT Releases This Week: ఓటీటీ ప్రియులకు పండగ.. ఈ వారం స్ట్రీమింగ్‌కు రానున్న సినిమాలు,సిరీస్‌లు ఇవే..
OTT Releases: ఓటీటీ ప్రేక్షకులకు పుల్ టైం ఎంటర్టైమెంట్ అందబోతుంది. మార్చి 9 నుంచి మార్చి 15 నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, జీ5, ఈటీవీ విన్, లయన్స్‌గేట్ ప్లే వంటి పలు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలు వరుసగా స్ట్రీమింగ్‌కు రాబోతున్నాయి. తెలుగు సినిమాలతో పాటు తమిళం, హిందీ, ఇంగ్లీష్, కొరియన్, గుజరాతీ వంటి భాషలలోని ఆసక్తికరమైన కంటెంట్ కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. క్రైమ్ థ్రిల్లర్స్, రొమాంటిక్ డ్రామాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, యాక్షన్ సినిమాలు ఇలా అన్ని రకాల కథలతో ఈ వారం ఓటీటీలో మంచి కంటెంట్ అందుబాటులోకి రానుంది. ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు, సిరీస్‌ల జాబితా మీ కోసం..
భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapthi)
ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న తెలుగు సినిమాలలో మాస్ మహారాజా రవితేజ నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ప్రత్యేకంగా నిలుస్తోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలై ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ జీ5 సొంతం చేసుకుంది. అనేకసార్లు వాయిదా పడిన ఈ సినిమా చివరకు మార్చి 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్ విడుదల తర్వాత దాదాపు 59 రోజుల తరువాత ఓటీటీలోకి రావడం గమనార్హం.

విశ్వక్ సేన్ 'ఫంకీ' (Funky)
ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న మరో తెలుగు సినిమా 'ఫంకీ'. విశ్వక్ సేన్ హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాకు అనుదీప్ దర్శకత్వం వహించారు. 'జాతిరత్నాలు' సినిమా ద్వారా గుర్తింపు పొందిన అనుదీప్ ఈ మూవీని కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా మార్చి 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
'నవాబ్ కేఫ్'(Nawab Cafe )
శివ కందుకూరి, తేజు అశ్విని జంటగా, రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటించిన సినిమా 'నవాబ్ కేఫ్'. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా చాయ్ వ్యాపారం నేపథ్యంగా రూపొందింది. తండ్రి-కొడుకు భావోద్వేగాలపై ఆధారపడి తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో విడుదలై పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా మార్చి 12 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.
'ది తాజ్ స్టోరీ' ( The Taj Story )
బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ ప్రధాన పాత్రలో నటించిన 'ది తాజ్ స్టోరీ' సినిమా కూడా ఈ వారం ఓటీటీలోకి రానుంది. తుషార్ అమ్రిష్ గోయల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతంలో థియేటర్లలో విడుదలై వివాదాలకు దారి తీసింది. తాజ్ మహల్ చరిత్రకు సంబంధించిన వివాదాస్పద అంశాలను ప్రస్తావించడంతో ఈ సినిమా పెద్ద చర్చకు కారణమైంది. ఈ చిత్రంమార్చి 13 నుంచి లయన్స్‌గేట్ ప్లేలో హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' (Mad For Each Other)
సినిమాలతో పాటు ఓ కొత్త రియాలిటీ షో కూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అనే ఈ షో మార్చి 15 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ షోలో పది జంటలు ఒకే ఇంట్లో పది వారాల పాటు ఉంటూ తమ ప్రేమ, నమ్మకం, సంబంధాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, నటి రాధ, లయ ఈ షోకు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా కనిపించనుంది.
ఈ వారం ఇతర భాషలలో కూడా పలు సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. తమిళ చిత్రం 'పూకీ'మార్చి 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ప్రియాంక అరుల్ మోహన్ నటించిన 'మేడ్ ఇన్ కొరియా' సినిమా మార్చి 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతోంది. కన్నడ యాక్షన్ డ్రామా 'ల్యాండ్‌లార్డ్' కూడా మార్చి 13న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ మూవీ 'నాంగల్' సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక హాలీవుడ్ సినిమాలలో 'ది మాడిసన్', 'ది ఫ్యామిలీ మెక్‌ములెన్' వంటి చిత్రాలు మార్చి 15న జియో హాట్‌స్టార్‌లో విడుదల కానున్నాయి.
వెబ్ సిరీస్‌లు
వెబ్ సిరీస్‌ల పరంగా కూడా ఈ వారం మంచి కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. 'ఆస్పిరెంట్స్ సీజన్ 3' మార్చి 13 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అలాగే 'ఆంధ్ర ప్యార్ 2.0' అనే హిందీ వెబ్ సిరీస్ మార్చి 14న జీ5లో విడుదల అవుతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో 'వన్ పీస్ సీజన్ 2', 'వర్జిన్ రివర్ సీజన్ 7','ఫాటల్ సెడక్షన్ సీజన్ 3' వంటి సిరీస్‌లు విడుదల కానున్నాయి. ఇలా ఈ వారం ఓటీటీలో తెలుగు సినిమాలతో పాటు పలు భాషల సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి.


Click it and Unblock the Notifications











