OTTలోకి ఈ వారం 32 సినిమాలు.. ఆ రెండు చిత్రాలు మాత్రం అస్సలే మిస్ కాకండి!
కొత్త వారం వస్తుందంటే చాలు.. అనేక కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. దీంతో సినీ ప్రియులు అంతా ఏమేం సినిమాలు ఈ వారం రాబోతున్నాయో తెలుసుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. అయితే ఏయే ఓటీటీలో ఏమేం సినిమాలు రాబోతున్నాయి... ఏయే వెబ్ సిరీస్ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆ వారం మొత్తం 32 సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి. అలాగే థియేటర్లలో కూడా కొన్ని ఆసక్తికరమైన సినిమాలు విడుదల కాబోతున్నాయి . ఆవివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వరుణ్ తేజ్ హీరోగా వస్తున్నా ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. శక్తిప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటించింది. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందనేది. అలాగే భూతద్దం భాస్కర్ అనే మరో సినిమా కూడా మార్చి ఒకటో తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. శివ కందుకూరి హీరోగా వచ్చిన ఈ సిిమాను పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు. అలాగే వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో వచ్చిన చారి 111 సినిమా కూడా మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలు నమోదు అయ్యాయి.

ఇదంతా ఇలా ఉండగా.. ఓటీటీలో పొలిటికల్ క్రికెట్ థ్రిల్లర్ బ్లూ స్టార్ తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ : ది బరీడ్ ట్రూత్ డాక్యుమెంటరీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని కూడా ఓటీటీ వేధికగా సందడి చేయబోతున్నాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియో..:
వెడ్డింగ్ ఇంపాజిబుల్ (కొరియన్ సిరీస్) - ఫిబ్రవరి 26
ఎనీవన్ బట్ యూ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 26
పూర్ థింగ్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 27
బ్లూ స్టార్ (తమిళ సినిమా) - ఫిబ్రవరి 29
పా పాట్రోల్: ద మైఠీ మూవీ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 29
రెడ్ క్వీన్ (స్పానిష్ సిరీస్) - ఫిబ్రవరి 29
నైట్ స్విమ్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 1

డిస్నీ ప్లస్ హాట్స్టార్లో..:
ఇవాజు (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 28
షోగున్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 28
ద ఇంపాజిబుల్ హెయర్ (కొరియన్ సిరీస్) - ఫిబ్రవరి 28
వండర్ ఫుల్ వరల్డ్ (కొరియన్ సిరీస్) - మార్చి 1
నెట్ఫ్లిక్స్లో...:
ఇండిగో (ఇండోనేషియన్ సినిమా) - ఫిబ్రవరి 28
అమెరికన్ కాన్స్ పరసీ: ద అక్టోపస్ మర్డర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 28
కోడ్ 8 పార్ట్ 2 (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 28
ద మైర్ సీజన్ 3 (పోలిష్ సిరీస్) - ఫిబ్రవరి 28
ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్ (టర్కిష్ సిరీస్) - ఫిబ్రవరి 29
మన్ నూఆంగ్ (థాయ్ సినిమా) - ఫిబ్రవరి 29
ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ (హిందీ సినిమా) - ఫిబ్రవరి 29
ఫ్యూరిస్ (ఫ్రెంచ్ సిరీస్) - ఫిబ్రవరి 29
మామ్లా లీగల్ హై (హిందీ సిరీస్) - మార్చి 1
మై నేమ్ ఈజ్ లోహ్ కివాన్ (కొరియన్ మూవీ) - మార్చి 1
షేక్, ర్యాటెల్ అండ్ రోల్: ఎక్స్ ట్రీమ్ (తగలాగ్ సినిమా) - మార్చి 1
సమ్ బడీ పీడ్ ఫీల్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 1
స్పేస్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 1
ద పిగ్ ద స్నేక్ అండ్ ద పీజియన్ (మాండలిన్ సినిమా) - మార్చి 1
ద నెట్ ఫ్లిక్స్ స్లామ్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 3
జీ5, జియో సినిమా, బుక్ మైషోలో..:
సన్ ఫ్లవర్ సీజన్ 2 అనే హిందీ సిరీస్ మార్చి 1వ తేదీ నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే జియో సినిమాలో ఫైవ్ నైట్స్ ఎట్ ది ఫ్రెడ్డీస్ అనే ఇంగ్లీష్ సినిమా ఫిబ్రవరి 27న విడుదల కానుంది. ఇక బుక్ మై షోలో ఫియర్ అనే ఇంగ్లీష్ సినిమా ఫిబ్రవరి 27వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. అలాగే ఆపిల్ ప్లస్ టీవీలో నెపోలియన్ అనే ఇంగ్లీష్ సినిమాతో పాటు ద కంప్లీట్లీ మేడ్ - అప్ అడ్వెంచర్స్ ఆఫ్ డిక్ టర్పిన్ అనే వెబ్ సిరీస్ మార్చి 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రిసిల్లా అనే ఇంగ్లీష్ సినిమా మార్చి 1 నుంచి ముబీలో స్ట్రీమింగ్ కానుంది.


Click it and Unblock the Notifications











