OTT Releases This Week: ఈ వారం ఓటీటీ బ్లాక్ బస్టర్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..

This Week OTT Releases Full List : వేసవి ఎండలు తీవ్రంగా మండిపోతున్న వేళ.. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించాలనుకునే ప్రేక్షకులకు ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఈ వారం మంచి కంటెంట్‌తో సిద్ధమయ్యాయి. థియేటర్లలో చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు లేకపోవడంతో చాలామంది డిజిటల్ కంటెంట్‌పైనే ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ కొనసాగుతున్న సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్, యువత ఎక్కువగా ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మే 11 నుంచి 17 వరకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, ఆహా, జీ5 వంటి ప్రముఖ ఓటీటీ వేదికలపై పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ వారం ఓటీటీ లిస్ట్ మీ కోసం..

థియేటర్లలో చిన్న సినిమాల సందడి
ఈ వారం థియేటర్లలో సూర్య నటించిన తమిళ చిత్రం 'కరుప్పు' తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో విడుదలవుతోంది. అలాగే 'అరేయ్ ఆపండ్రా', 'హరుడు', 'శివం శైవం' వంటి చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే వీటిపై పెద్దగా అంచనాలు లేకపోవడంతో ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా ఓటీటీపైనే పడింది.

This Week OTT Releases Dhurandhar 2 EXAM Karthavya amp amp More Streaming Updates

'ధురంధర్ 2'
ఈ వారం ఎక్కువగా ఎదురుచూస్తున్న రిలీజ్‌లలో 'ధురంధర్ 2' ముందంజలో ఉంది. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో మే 14 నుంచి ఓవర్సీస్‌లో స్ట్రీమింగ్ కానుండగా.. భారతదేశంలో జియో హాట్‌స్టార్‌లో మే 15 నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ప్రత్యేకంగా ఈ సినిమాకు సంబంధించిన అన్‌కట్ వెర్షన్ విడుదలవుతుండటం అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. దాదాపు 3 గంటల 52 నిమిషాల నిడివితో 'ధురంధర్: ది రివెంజ్' ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఇంటెన్స్ డ్రామా, దేశభక్తి ఎలిమెంట్స్‌తో ఈ సినిమా మరోసారి డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

'కర్తవ్య'
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'కర్తవ్య' కూడా ఈ వారం ఆసక్తికర రిలీజ్‌లలో ఒకటి. మే 15 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. పులకిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రసికా దుగ్గల్, సంజయ్ మిశ్రా, జాకిర్ హుస్సేన్, మనీష్ చౌదరి వంటి ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రలు పోషించారు. షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మించిన ఈ చిత్రం ఒక మిస్టీరియస్ క్రైమ్ కేసు చుట్టూ తిరుగుతుంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే ఈ మూవీపై మంచి ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ హైలైట్ అవుతుందని చెబుతున్నారు.

ఎక్సామ్ (EXAM)

ఈ వారం అత్యంత ఆసక్తికర వెబ్ సిరీస్‌లలో 'EXAM' ఒకటి. తమిళ ఒరిజినల్ సిరీస్‌గా రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మే 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. పేపర్ లీక్స్, పరీక్షల్లో అవినీతి, విద్యా వ్యవస్థలో జరుగుతున్న స్కామ్స్ వంటి సమకాలీన అంశాలపై ఈ సిరీస్ తెరకెక్కింది. దుషార విజయన్, అదితి బాలన్, అబ్బాస్, నరేన్ మణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు జాతీయ అవార్డు గ్రహీత ఏ.సర్గుణం దర్శకత్వం వహించారు. మొత్తం ఏడు ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్ తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలను థ్రిల్లింగ్‌గా చూపించనున్న ఈ సిరీస్ యువతను ఆకట్టుకునే అవకాశం ఉంది.

'తిమ్మరాజుపల్లి టీవీ'
తెలుగు ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'తిమ్మరాజుపల్లి టీవీ' ఒకటి. కిరణ్ అబ్బవరం ప్రొడక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామా. కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మంచి స్పందన అందుకుంది. సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి వి. మునిరాజు దర్శకత్వం వహించారు. మే 15 నుంచి ఆహా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఆహా గోల్డ్ యూజర్లకు 24 గంటల ముందుగానే ప్రత్యేక ప్రీమియర్ అందించనున్నారు.

జియో హాట్‌స్టార్‌
ఇక జియో హాట్‌స్టార్ ఈ వారం'ది పనిషర్: వన్ లాస్ట్ కిల్' అనే ఇంగ్లీష్ యాక్షన్ మూవీ మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుండగా.. 'తుఖ్రా కా మేరే ప్యార్' సీజన్ 2, 'ఇన్‌స్పెక్టర్ అవినాష్' సీజన్ 2 కూడా విడుదల కానున్నాయి. ప్రత్యేకంగా 'ఇన్‌స్పెక్టర్ అవినాష్' సీజన్ 2పై హిందీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. క్రైమ్, యాక్షన్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంశాలతో ఈ సిరీస్ ముందుకు సాగనుంది.

నెట్‌ఫ్లిక్స్‌: 'నెమిసిస్', 'సోల్‌మేట్', 'బెర్లిన్ అండ్ ది లేడీ విత్ ఎర్మిన్' వంటి ఇంగ్లీష్, జపనీస్ సిరీస్‌లు విడుదల కానున్నాయి. అలాగే మలయాళ చిత్రం 'ఒరు దురోహ సహచర్యతిల్' తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

అమెజాన్ ప్రైమ్‌: అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'ఆఫ్ క్యాంపస్' అనే ఇంగ్లీష్ సిరీస్‌తో పాటు 'గుడ్ ఓమెన్స్ సీజన్ 3' కూడా స్ట్రీమింగ్ కానుంది. యూత్, ఫాంటసీ డ్రామా అభిమానులకు ఇవి మంచి ఎంపికలుగా ఉండనున్నాయి. మొత్తానికి ఈ వారం థియేటర్ల కంటే ఓటీటీల్లోనే ఎక్కువ సందడి కనిపించనుంది. ఇంట్లోనే కూర్చొని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడాలనుకునే వారికి ఈ వారం డిజిటల్ ప్లాట్‌ఫాంలు మంచి ఆప్షన్స్ తీసుకొస్తున్నాయి.

Read more about: ott movies Dhurandhar timmaraju
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X