This Week OTT Releases : కూలీ, సు ఫ్రమ్ సో, సయ్యారా.. ఈవారం ఓటీటీలోకి దుమ్ములేపే చిత్రాలు.. ఇక్కడ చూసేయండి
తెలుగు ప్రేక్షకులకు థియేటర్లలోకి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎంత థియేటర్లలో సినిమాలు చూసినా రిపీటెడ్ ఆడియెన్స్ ఓటీటీలో వచ్చే సినిమాల గురించి ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సందర్బంగా సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 14 వరకు ప్రముఖ ఓటీటీ సంస్థల్లో ఇంట్రెస్టింగ్ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి.
మౌనమే నీ బాషా..
టాలీవుడ్ సీనియర్ నటుడు కనకాల రాజీవ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫిల్మ్ మౌనమే నీ భాష. కథా సుధ సిరీస్‌లో భాగంగా ETV విన్‌లో సెప్టెంబర్ 7 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి వర ముళ్లపూడి దర్శకత్వం వహించారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండటం విశేషం.
సు ఫ్రమ్ సో..
కన్నడ చిత్ర పరిశ్రమలో విడుదలై బ్లాక్‌బస్టర్ గా నిలిచిన చిత్రం సు ఫ్రమ్ సో. ఈ హారర్ర్ -కామెడీ సెప్టెంబర్ 9 నుంచి OTTలో విడుదలవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రానికి జేపీ తుమినాథ్ దర్శకత్వం వహించారు. రాజ్ బీ శెట్టి నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద రూ.120 కోట్ల గ్రాస్ వసూల్ చేయడం విశేషం.

కూలీ..
సూపర్ స్టార్ రజనీకాంత్ రీసెంట్‌గా నటించిన గ్యాంగ్ స్టర్ యాక్షన్ ఫిల్మ్ కూలీ. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్లో కళానిధి మారన్ రూ.350 కోట్లతో నిర్మించడం విశేషం. ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిందీ చిత్రం. ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కాబోతుండటం విశేషం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ అందుబాటులోకి రాబోతోంది.
సయ్యార..
బాలీవుడ్ లో విడుదలైన బ్లాక్ బాస్టర్ మ్యూజికల్ ఫిల్మ్ సయ్యారా. ఈ రొమాంటిక్ డ్రామాకు ఆషికీ 2 చిత్రం డైరెక్టర్ మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించారు. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లోకి సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బకాసుర రెస్టారెంట్..
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు మరో హర్రర్-కామెడీ ఫిల్మ్ బకాసుర రెస్టారెంట్ సిద్ధంగా ఉంది. ప్రవీణ్, హర్ష చెముడు, జై కృష్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో, అలాగే సన్ NXT రెండింటిలోనూ స్ట్రీమింగ్ కాబోతోంది.
రాంబో ఇన్ లవ్..
ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న తెలుగు సిరీస్ సెప్టెంబర్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ లో నటుడు అభినవ్ మణికంఠ, పాయల్ చెంగప్ప, భార్గవ్ రైట్స్, కావ్య కశెట్టి, అచుత్ నంద, అనన్య జింకా ప్రధాన పాత్రలు పోషించడం విశేషం.
డు యు వనా పార్ట్‌నర్..
స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా, డయానా పెంటీ నేతృత్వంలో రూపుదిద్దుకున్న సిరీస్ డు యు వనా పార్ట్‌నర్. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ గా నిర్మితమైంది. అమెజాన్ లోనే సెప్టెంబర్ 12 నుంచి ప్రేక్షకుల అందుబాటులోకి రానుంది. హిందీతో పాటు తెలుగులోనూ విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











