This Week OTT: బిగ్ బాస్ విన్నర్ నుంచి విజయ్ సేతుపతి వరకు.. ఈ వారం ఓటీటీ ప్రియులకు పండుగే..
This Week OTT Releases: మార్చి మొదటి వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వరుస రిలీజ్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో క్రైమ్ థ్రిల్లర్స్, రొమాంటిక్ డ్రామాలు, సూపర్ నేచురల్ స్టోరీస్, రీమేక్ మూవీస్ ఇలా విభిన్న జానర్లలో కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. థియేటర్‌కు వెళ్లలేని ప్రేక్షకులకు ఇది పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీగా మారనుంది. ఈ వారంలో విడుదల కానున్న తాజా ఓటీటీ రిలీజ్‌ల వివరాలు ఇవే.
గాంధీ టాక్స్ (Gandhi Talks)
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ గాంధీ టాక్స్. ఈ సినిమా పూర్తిగా డైలాగ్ లేని సైలెంట్ మూవీ కావడం ప్రత్యేకత. నటన, నేపథ్య సంగీతం (A.R. Rahman) ద్వారా కథనం నడుస్తుంది. నిరుద్యోగ యువకుడు-ధనిక వ్యాపారవేత్త మధ్య ఆసక్తికర సంఘటనల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో అదితి రావు హైదరి, అరవింద్ స్వామి కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రయోగాత్మక సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమాను తప్పక చూడాల్సిందే. ఈ మూవీ మార్చి 6 నుంచి జీ 5 (ZEE5) స్ట్రీమింగ్ కానున్నది.

విక్రమ్ ఆఫ్ డ్యూటీ (Vikram on Duty)
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేత నిఖిల్ మలియక్కల్ ( Nikhil Maliyakkal) ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ సిరీస్ విక్రమ్ ఆఫ్ డ్యూటీ (Vikram on Duty). ఈ మూవీలో నిఖిల్ ఓ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారి విక్రమ్ వాసు పాత్రలో కనిపిస్తారు. గతంలోని చీకటి రహస్యాలు, ప్రస్తుత దర్యాప్తు ఈ రెండు లేయర్స్ కథకు ఉత్కంఠను తెస్తాయి. ఈ క్రైమ్ సిరీస్ మార్చి 6 నుంచి జియో హాట్ స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్ కానున్నది.
ఓం శాంతి శాంతి శాంతి (Om Shanti Shanti Shantihi)
డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా కాంబోలో తెరకెక్కిన మూవీ 'ఓం శాంతి శాంతి శాంతి' (Om Shanti Shanti Shantihi). ఏఆర్ సంజీవ్ తెరకెక్కించారు. బ్రహ్మాజీ, సురభి ప్రభావతిలు కీలక పాత్రల్లో నటించారు. జనవరి 30న థియేటర్లలోకి విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ అందుకుంది. తరుణ్ భాస్కర్ నటన ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తోంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ మూవీ మార్చి 4 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
దేవగుడి (Devagudi)
రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా 'దేవగుడి'(Devagudi). బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన దేవగుడి సినిమా పూర్తిగా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో అభినవ్ శౌర్య, తోషి అలహరి, అనుశ్రీ కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు రఘు కుంచె గురించే. నటుడిగా మారిన అతడు ఈ మూవీలో ఒక కీలక పాత్రలో కనిపించి మెప్పించాడు. ఈ మూవీ సన్ నెక్స్ట్ (Sun NXT)లో మంగళవారం (మార్చి 3) నుంచే స్ట్రీమింగ్ కానున్నది.
ధీరం (Dheeram)
ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా ధీరం (Dheeram). జితిన్ జోసెఫ్ తెరకెక్కించిన ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ లో ఇంద్రజిత్ సుకుమారన్‌తో పాటు అజు వర్గీస్ ఏసీపీ పాత్రలో ఆకట్టుకున్నాడు. అలాగే మంగళవారం నటి దివ్య పిళ్లై మరో కీలక పాత్రలో మెరిసింది. వీరితో పాటు విజయరాఘవన్, నిశాంత్ సాగర్, పానీ-ఫేమ్ సాగర్ సూర్య, రెబా మోనికా జాన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా మార్చి 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నది.
ఇతర ప్లాట్‌ఫామ్‌ల హైలైట్స్
నెట్‌ఫ్లిక్స్ - హలో బచ్చన్, ది డైనోసార్స్, వార్ మెషిన్
అమెజాన్ ప్రైమ్ వీడియో - యంగ్ షెర్లాక్, సుబేదార్
ZEE5 - జబ్ ఖులీ కితాబ్
లయన్స్‌గేట్ ప్లే - కిస్ ఆఫ్ ది స్పైడర్ ఉమెన్ ఇలా ఈ వారం దాదాపు 18 సినిమాలు/సిరీస్‌లు ఓటీటీలోకి వస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











