OTTలోకి ఒకే రోజు 4 బ్లాక్ బస్టర్స్ సహా 15 సినిమాలు... అస్సలు మిస్ అవ్వొద్దు!
వీకెండ్ వచ్చేసింది.. ఓటీటీ ప్రేక్షకులకు పండగ తెచ్చేసింది. ఒక్క రోజే బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటు.. సిరిసులు కూడా ఓటీటీలోకి రాబోతున్నాయి. ఇక ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలు సందడి చేయనున్నాయి. అటు ఓటీటీలో కూడా పెద్ద సినిమాలు సందడి చేయనున్నాయి. దీంతో మూవీ లవర్స్ కు పండగే అని చెప్పవచ్చు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
సంక్రాంతి రిలీజైన 4 సినిమాల్లో ఇప్పటికే సైంధవ్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వారం మహేశ్ బాబు గుంటూరు కారం, ధనుశ్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ అయలాన్ చిత్రాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటితో పాటు.. సలార్, డంకీ చిత్రాలకే వణుకు పుట్టించిన చిత్రం కాటేరా. ఈ సినిమా కూడా ఈ వీకెండ్ రిలీజ్ కానుంది. దానితో పాటు బబుల్ గమ్ చిత్రం కూడా రాబోతుంది. మరోవైపు షారుఖ్ ఖాన్ భార్య నిర్మాణంలో తెరకెక్కిన భూమి పెడ్నేకర్ భక్షక్, సుస్మితా సేన్ ఆర్య వెబ్ సిరీసులు కూడా వచ్చేస్తున్నాయి.

మరోవైపు ఈ వారం థియేటర్లలో సందడి చేసేందుకు మాస్ మహారాజా రవితేజ ఈగల్ సిద్ధంగా ఉంది. సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం ఈనెల 9న థియేటర్లలో విడుదల అవుతుంది. వాటితో పాటు యాత్ర 2 చిత్రం కూడా థియేటర్లలో సందడి చేస్తుంది. ఇక ఓటీటీలో 15 సినిమాలు, సిరీసులు రిలీజ్ అవుతున్నాయి. ఏ ఏ సినిమాలు, ఏఏ సిరీసులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం.
ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీసుల లిస్ట్ ఇదే
నెట్‌ఫ్లిక్స్
1. వన్ డే (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 08న స్ట్రీమింగ్
2. గుంటూరు కారం(తెలుగు)- ఫిబ్రవరి 09న స్ట్రీమింగ్
3. భక్షక్-(హిందీ క్రైమ్ థ్రిల్లర్ )- ఫిబ్రవరి 09న స్ట్రీమింగ్
4. లవర్ స్టాకర్ కిల్లర్ ( డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 09న స్ట్రీమింగ్
5. యాషెస్ ( టర్కీ సిరీస్)- ఫిబ్రవరి 09న స్ట్రీమింగ్
6. ఎ కిల్లర్ పారడాక్స్ (కొరియన్ సిరీస్)- ఫిబ్రవరి 09న స్ట్రీమింగ్
7. ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 (స్పానిష్ సిరీస్)- ఫిబ్రవరి 09న స్ట్రీమింగ్
8. హారిబుల్ బాసెస్ - ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్
9. బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్
అమెజాన్ ప్రైమ్
10. కెప్టెన్ మిల్లర్(తెలుగు డబ్బింగ్ మూవీ)-ఫిబ్రవరి 09న స్ట్రీమింగ్
డిస్నీప్లస్ హాట్ స్టార్
11. ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3(వెబ్ సిరీస్)-ఫిబ్రవరి-09న స్ట్రీమింగ్
జీ5
12. కాటేరా(కన్నడ డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి- 09న స్ట్రీమింగ్
జియో సినిమా
13. హలో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 8న స్ట్రీమింగ్ అవుతుంది
సన్ నెక్ట్స్
14. అయలాన్- (తెలుగు డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి 09 (రూమర్ డేట్)న స్ట్రీమింగ్
ఆహా
15. బబుల్ గమ్ - ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్


Click it and Unblock the Notifications











