OTTలో సినీ జాతర.. హనుమాన్, ఈగల్ సహా 26 సినిమాలు..!
ఈ వీకెండ్ మునుపటి లెక్క ఉండదు.. ఈ వారం సినిమాల జాతరే. సంక్రాంతికి రిలీజ్ అయిన సూపర్ హిట్ హనుమాన్, రవితేజ ఈగల్ సహా బోలెడన్నీ చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఈ శుక్రవారం సినీ ప్రేక్షకులను అటు థియేటర్లలో చిన్న సినిమాలు రెడీగా ఉండగా.. ఓటీటీలో మాత్రం ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీ అయ్యాయి. అసలు ఏ ఏ సినిమాలు, సిరీసులు ఓటీటీలోకి రాబోతున్నాయి.. అందులో ఇంట్రెస్ట్ కలిగించేవి ఏంటి అనేవి ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
ఈ వారం థియేటర్లలో వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలంటైన్', ఆర్జీవీ 'వ్యూహం సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇక వీటితో పాటు ఒకటి, రెండు చిన్న సినిమాలు వస్తున్నప్పటికీ అంతగా ఇంట్రెస్ట్ కలిగించడం లేదు. ఇక సినీ ప్రేక్షకులు ఓటీటీవైపు లుక్కేస్తున్నారు. ఈ వీకెండ్‌లో ఓటీటీల్లో సందడి చేసేందుకు బోలేడు చిత్రాలు రెడీ అయిపోయాయి. సంక్రాంతి బ్లాక్ బస్టర్ హనుమాన్ ఈ వారం ఓటీటీలో రానుందని ప్రచారం జరుగుతుంది.

హనుమాన్ చిత్రం విడుదల అయిన 45 రోజుల తర్వాతే ఓటీటీలోకి రానుందని అప్పట్లో చెప్పారు. దీంతో మార్చి 1 లేదా 2న హనుమాన్ స్ట్రీమింగ్ కానుందని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో సడెన్ గా హనుమాన్ ఓటీటీలోకి వచ్చిన ఆశ్చర్యం లేదని చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాతో పాటు రవితేజ ఈగల్ కూడా ఓటీటీలోకి వచ్చేస్తోంది. రెండు ప్రముఖ ఓటీటీల్లో ఈ సినిమా మార్చి 1 నుంచే స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఇక వీటితో పాటు.. ఈటీవీ విన్ లో వళరి అనే హారర్ మూవీ, తమిళ డబ్బింగ్ సినిమా 'బ్లూ స్టార్', 'ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ' డాక్యుమెంటరీ, మేరి క్రిస్మస్ చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. మరి పూర్తి ఓటీటీ లిస్ట్ పై ఓ లుక్ వేయండి.
నెట్‌ఫ్లిక్స్:
1. ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్ (టర్కిష్ సిరీస్) - ఫిబ్రవరి 29న స్ట్రీమింగ్
2. మన్ సూఆంగ్ (థాయ్ సినిమా) - ఫిబ్రవరి 29న స్ట్రీమింగ్
3. ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ (హిందీ సినిమా) - ఫిబ్రవరి 29న స్ట్రీమింగ్
4. ఫ్యూరిస్ (ఫ్రెంచ్ సిరీస్) - ఫిబ్రవరి 29న స్ట్రీమింగ్
5. మామ్లా లీగల్ హై (హిందీ సిరీస్) - మార్చి 01న స్ట్రీమింగ్
6. మై నేమ్ ఈజ్ లోహ్ కివాన్ (కొరియన్ మూవీ) - మార్చి 01న స్ట్రీమింగ్
7. షేక్, ర్యాటెల్ & రోల్: ఎక్స్‌ట్రీమ్ (తగలాగ్ సినిమా) - మార్చి 01న స్ట్రీమింగ్
8. సమ్‌బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 01న స్ట్రీమింగ్
9. స్పేస్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 01న స్ట్రీమింగ్
10. ద పిగ్ ద స్నేక్ అండ్ ద పిజియన్ (మాండరిన్ సినిమా) - మార్చి 01న స్ట్రీమింగ్
11. ద నెట్‌ఫ్లిక్స్ స్లామ్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 03న స్ట్రీమింగ్
12. మెర్రీ క్రిస్మస్(బాలీవుడ్) - మార్చి 8న స్ట్రీమింగ్ (రూమర్డ్ డేట్)

అమెజాన్ ప్రైమ్:
13. బ్లూ స్టార్ (తమిళ సినిమా) - ఫిబ్రవరి 29న స్ట్రీమింగ్
14. పా పాట్రోల్: ద మైఠీ మూవీ (ఇంగ్లీష్ చిత్రం) - ఫిబ్రవరి 29న స్ట్రీమింగ్
15. రెడ్ క్వీన్ (స్పానిష్ సిరీస్) - ఫిబ్రవరి 29న స్ట్రీమింగ్
16. నైట్ స్విమ్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 01న స్ట్రీమింగ్
17. ఈగల్ (తెలుగు సినిమా) మార్చి 1న స్ట్రీమింగ్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
18. వండర్‌ఫుల్ వరల్డ్ (కొరియన్ సిరీస్) - మార్చి 01న స్ట్రీమింగ్
19. సేవ్ ది టైగర్స్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - మార్చి 10న స్ట్రీమింగ్ (రూమర్డ్ డేట్)
జీ5:
20. సన్‌ఫ్లవర్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మార్చి 01న స్ట్రీమింగ్
21. హనుమాన్ ( తెలుగు బేస్డ్ పాన్ ఇండియా సినిమా) మార్చి 2న స్ట్రీమింగ్ (రూమర్డ్ డేట్)
ఈటీవీ విన్:
22. ఈగల్ సినిమా మార్చి 1న స్ట్రీమింగ్
23. వళరి మార్చి 6న స్ట్రీమింగ్

ఆపిల్ ప్లస్ టీవీ:
24. నెపోలియన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 01న స్ట్రీమింగ్
25. ద కంప్లీట్లీ మేడ్-అప్ అడ్వెంచర్స్ ఆఫ్ డిక్ టర్పిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 01న స్ట్రీమింగ్
ముబీ:
26. ప్రిసిల్లా (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 01న స్ట్రీమింగ్


Click it and Unblock the Notifications











