This Week OTT: ఓటీటీ ప్రియులకు పండగే.. హనుమాన్‌తో పాటు అద్భుతమైన హర్రర్ చిత్రాల సందడి!
న్యూ వీక్ వస్తుందంటే చాలు సినీ ప్రియుల కళ్లన్నీ ఓటీటీలో వచ్చే సినిమాలపైనే ఉంటాయి. కొత్త వారంలో వచ్చే కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తుండడంతో ఏవేవి వస్తాయి.. ఏయే సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడాలని ముందునుంచి ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా ఈ వారం సూపర్ హీరో హనుమాన్ తో పాటు అనేక హర్రర్ చిత్రాలు ఓటీటీ వేధికగా రాబోతున్నాయి. ఏయే వెబ్ సిరీస్ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఈ వారం థియేటర్లలో కూడా కొన్ని ఆసక్తికరమైన సినిమాలు విడుదల కాబోతున్నాయి . ఆవివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా ఈ వారం అంటే మార్చి 8వ తేదీ రోజు గోపీచంద్ హీరోగా చేసిన భీమా సినిమా రాబోతుంది. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు నమోదు అయ్యాయి. అలాగే విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించబోతున్నా గామి సినిమా కూడా 8వ తేదీన రిలీజ్ కాబోతుంది. అలాగే మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ ఫిల్మ్ ప్రేమలు కూడా తెలుగు మార్చి 8వ తేదీన విడుదల కాబోతుంది. మరోవైపు నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్ లు ప్రధాన పాత్రలో రాబోతున్న రికార్డు బ్రేక్ సినిమా కూడా శుక్రవారమే విడుదల కానుంది.

అలాగే నవ్వించే బాయ్స్ కూడా 8వ తేదీన వస్తుండగా.. నాయుడు గారి అబ్బాయి ప్రేమలో రాజుగారి అమ్మాయి మార్చి 9వ తేదీన సందడి చేయనుంది. ఇవి మాత్రమే కాకుండా శైతాన్ అనే హిందీ సినిమా కూడా శుక్రవారం రోజే థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అజయ్ దేవగణ్, ఆర్ మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో వస్తోందీ చిత్రం. భారీగానే అంచనాలు నమోదు అయిన ఈ చిత్రాలు థియేటర్లలో ఏ మేర సందడి చేయనున్నాయో చూడాలి.
నెట్ ఫ్లిక్స్ వేధికగా..:

అన్వేషిప్పిన్ కండెతుమ్ (తెలుగులో కూడా) - మార్చి 8
ది జెంటిల్ మ్యాన్ (హాలీవుడ్) - మార్చి 7
డ్యాన్ సెల్ (హాలీవుడ్) - మార్చి 8
ది బ్యాక్ అప్ ప్లాన్ (హాలీవుడ్) - మార్చి 8
హాట్ వీల్ లెట్స్ రేస్ (హాలీవుడ్) - మార్చి 4
హన్నాగాడ్స్ బీస్ జెండర్ అజెండా - మార్చి 5
ఫుల్ స్వింగ్ (డాక్యుమెంటరీ సీజన్ 2) - మార్చి 6
ప్రోగ్రామ్: కాన్స్, కల్స్ట్ అండ్ కిడ్నాపింగ్ - మార్చి 6
సూపర్ సెక్స్ - మార్చి 6
పోకెమాన్ హారిజన్స్ (వెబ్ సిరీస్) - మార్చి 7
ది సిగ్నల్ - మార్చి 7
బ్లోన్ అవే సీజన్ 4 (వెబ్ సిరీస్) - మార్చి 7
ది క్వీన్ ఆఫ్ టియర్స్ (కొరియన్ సిరీస్) - మార్చి 9
అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా..:
బ్యాచిలర్ పార్టీ (కన్నడ డబ్బింగ్ మూవీ) - మార్చి 4
సాగు (తెలుగు) - మార్చి 8
కెప్టెన్ మిల్లర్ (హిందీ) - మార్చి 8
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా..:
షో టైమ్ (హాలీవుడ్) - మార్చి 8

జీ5 వేధికగా..:
హనుమాన్ (తెలుగు) - మార్చి 8
ఊరుపేరు భైరవకోన - మార్చి 8 (అఫీషియల్ గా ప్రకటించలేదు)
సోనీలివ్ వేధికగా...:
మహారాణి (హిందీ వెబ్ సిరీస్ ) - మార్చి 7
ఈటీవీ విన్ వేధికగా..:
వళరి (తెలుగు వెబ్ సిరీస్) - మార్చి 6


Click it and Unblock the Notifications











