This Week OTT Releases: కన్నప్ప, మార్గన్, సర్జామీన్.. ఓటీటీలోకి ఒకే రోజు 6 చిత్రాలు.. ఇక్కడ చూసేయండి!
తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ప్రస్తుతం థియేటర్లలో ఇంట్రెస్టింగ్ సినిమాలు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓటీటీలోనూ స్టార్ హీరోల చిత్రాలు స్ట్రీమింగ్ అవుతూ సందడి చేస్తున్నాయి. ప్రతి వారం ఓటీటీలోకి తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఇక జూలై 25 నుంచి జూలై 31వరకు ఆయా ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు రెడీ అయిన చిత్రాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఆ చిత్రాల వివరాల్లోకి వెళితే..
మార్గన్..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన రీసెంట్ ఫిల్మ్ మార్గన్. ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చైన్నైలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. కెమికల్ ఇంజెక్షన్ ద్వారా ఒకరి తర్వాత హత్యకు గురవుతుంటారు. ఇక హంతకుడిని పట్టుకునేందుకు ఏజీడీపీ ధృవ్ తన టీమ్ శృతి, కాళితో ఏం చేశారనేది సినిమా కథ. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ, అజయ్ దిషన్, దీప్షికా ప్రధాన పాత్రలో నటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమోజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 25 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.

షో టైమ్..
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ ఫిల్మ్ షో టైమ్. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రూపుదిద్దుకున్న ఈచిత్రం జూలై 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో రూపుదిద్దుకున్న ఈచిత్రానికి థియేటర్లలో కాస్తా మంచి రెస్పాన్స్ దక్కింది. ఒక చొరబాటు దారుడిని హత్య చేసిన తర్వాత వారి జీవితాలు ఎలా మారిపోయాయనేది కథ. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ కామాక్షి బాస్కర్ల హీరోయిన్ గా నటించింది. రాజా రవీంద్ర కీలక పాత్ర పోషించారు. జూలై 25 నుంచి ఈ చిత్రం సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.
సర్జామీన్..
సలార్, ఎంపురాన్ 2 వంటి భారీ చిత్రాల తర్వాత మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ సర్జామీన్. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్, యంగ్ స్టార్ ఇబ్రహీం అలీ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించారు. తండ్రికి, కొడుకు, దేశం, డ్యూటీ వంటి అంశాల మధ్య సాగిన కథ ఆసక్తిభరితంగా ఉంటుంది. ఈ చిత్రం కూడా జూలై 25 నుంచి జియో హాట్ స్టార్ లో ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.
మండల మర్డర్..
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రూపుదిద్దుకున్న ఇటీవల ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మండల మర్డర్. వార్ చిత్రం హీరోయిన్ వాణీ కపూర్ ప్రధాన పాత్రలో నటించింది. వైభవ్ రాజ్ గుప్తా, సర్వీన్ చావ్లా కీలక పాత్రలు పోషించారు. మైథలాజికల్ క్రైమ్ డ్రామాకు సంబంధించిన ఈ చిత్రం కూడా ఓటీటీ లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో జూలై 25 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ఎక్స్ & వై..
కన్నడ భాషలో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం X & Y. ఈ చిత్రంలో జూన్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విభిన్న కథాంశంతో అలరించిన చిత్రమిది. భూలోకానికి వచ్చిన ఒక ఆత్మ తన భవిష్యత్ తల్లిదండ్రులను కలుసుకోవడం సినిమా సారాంశం. లవ్, డీప్ ఎమోషన్స్ తో ఆకట్టుకుంది. అథర్వ ప్రకాశ్, డీ సత్య ప్రకాశ్, బృందా ఆచార్య ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం జూలై 25న సన్ నెక్ట్స్ ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్ అవుతోంది.
కన్నప్ప..
టాలీవుడ్ స్టార్ మంచు విష్ణు నటించిన మైథలాజికల్ ఫిల్మ్ కన్నప్ప. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం కూడా ప్రస్తుతం ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. కానీ పక్కా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు. ఈచిత్రం కూడా జూలై 25నే ఓటీటీలోకి తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











