This Week OTT Movies: ఈ వారం ఓటీటీ సినిమాలు,వెబ్ సిరీస్ ఇవే! ఆ మూడు సినిమాలు చాలా స్పెషల్..

This Week OTT Movies: సమ్మర్ సీజన్ అంటే కేవలం థియేటర్లలోనే కాదు, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా కంటెంట్ జోరు పెరిగే సమయం. ఈసారి కూడా అదే ట్రెండ్ కొనసాగుతోంది. మే చివరి వారంలో (మే 25 నుంచి 31 వరకు) ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో భారీగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదలకు సిద్ధమయ్యాయి. థియేటర్లలో కొత్త రిలీజ్‌లు కొంచెం స్లోగా ఉన్న ఈ సమయంలో, ఓటీటీలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వరుసగా కొత్త కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా వేసవి సెలవులు కావడంతో కుటుంబం అంతా కలిసి ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఓటీటీని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీలో విడుదలవుతున్న సినిమాల, వెబ్ సిరీస్ ల జాబితా మీ కోసం..

Also Read
Top 10 Heroes: నంబర్ వన్ స్థానంలో ప్రభాస్.. అల్లు అర్జున్, రామ్ చరణ్ కు ఎన్నో స్థానాలంటే?
Top 10 Heroes: నంబర్ వన్ స్థానంలో ప్రభాస్.. అల్లు అర్జున్, రామ్ చరణ్ కు ఎన్నో స్థానాలంటే?

ధనుష్ 'కర' ఓటీటీ
మొదటగా ధనుష్ హీరోగా, మమిత బైజు హీరోయిన్‌గా నటించిన 'కర' సినిమా గురించి చెప్పుకుంటే... ఈ మూవీపై మొదట ఓ భారీ అంచనాలు ఉండే, కానీ థియేటర్లలో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కొన్ని సీన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కొంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, కథనం మిగిలిన భాగం అంతగా ఎంగేజ్ చేయలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా మే 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలవుతుండటం ఈ మూవీకి ప్లస్ పాయింట్‌గా మారనుంది. '

Recommended For You
2 ఎకరాల్లో ప్రభాస్ రాజమహల్.. మైండ్ బ్లోయింగ్ అనిపించేలా .. భవనం ఎక్కడో తెలుసా?
2 ఎకరాల్లో ప్రభాస్ రాజమహల్.. మైండ్ బ్లోయింగ్ అనిపించేలా .. భవనం ఎక్కడో తెలుసా?
This Week OTT Releases Kara Jetlee Leader and Must-Watch Movies amp amp Series List

జెట్లీ
ఇక మరోవైపు కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటించిన జెట్లీ సినిమా కూడా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ థ్రిల్లర్ మే 1న థియేటర్లలో విడుదలైంది. విమానం బ్యాక్‌డ్రాప్‌లో జరిగే వినోదాత్మక సంఘటనలతో సినిమా సాగుతుంది. వెన్నెల కిషోర్, రియా సింఘా, వైవా హర్ష వంటి నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా, కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ మూవీ మే 25 నుంచి జియో స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయినవారు ఇంట్లో కూర్చొని లైట్‌గా నవ్వాలనుకుంటే ఈ సినిమా మంచి టైంపాస్ ఆప్షన్‌గా ఉంటుంది.

You May Also Like
Karuppu Day 10 Collection: సూర్య ' వీరభద్రుడు ' వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..?
Karuppu Day 10 Collection: సూర్య ' వీరభద్రుడు ' వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..?

లీడర్
ఇక యాక్షన్ ప్రేమికులకు లీడర్ సినిమా ఓ మంచి ఛాయిస్. ప్రముఖ వ్యాపారవేత్త అరుల్ శరవణన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ మే 29 నుంచి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియోలో అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, ఆండ్రియా, శ్యామ్, సంతోష్ ప్రతాప్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ముఖ్యంగా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.

Jana Nayagan Release Date: సమంతకు సీఎం విజయ్ బిగ్ షాక్.. బంగారానికి జన నాయగన్‌కు క్లాష్ తప్పదా?
Jana Nayagan Release Date: సమంతకు సీఎం విజయ్ బిగ్ షాక్.. బంగారానికి జన నాయగన్‌కు క్లాష్ తప్పదా?


ఇవే కాకుండా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. మీ కోసం పూర్తి జాబితా..

నెట్‌ఫ్లిక్స్:

అన్‌టోల్డ్ యూకే: విన్ని జోన్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మే 26
ఏ గుడ్ గర్ల్స్ గైడ్ టూ మర్డర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 27
మై టూ సెంట్స్ (ఇటాలియన్ సిరీస్) - మే 27
ఎమి మార్టినజ్ (ఇంగ్లీష్ మూవీ) - మే 28
మర్డర్ మైండ్‌ఫుల్లీ (జర్మన్ సిరీస్) - మే 28
ద ఫోర్ సీజన్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 28
బ్రెజిల్స్ 70: ద థర్డ్ స్టార్ (పోర్చుగీస్ సిరీస్) - మే 29
కలబాసస్ కాన్ఫిడెంటల్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 29
రఫా (స్పానిష్ సిరీస్) - మే 29

పెద్ది తర్వాత బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ఆ హీరోనేనా? నెక్స్ట్ లెవెల్ ప్లాన్స్ వేస్తున్నాడా?
పెద్ది తర్వాత బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ఆ హీరోనేనా? నెక్స్ట్ లెవెల్ ప్లాన్స్ వేస్తున్నాడా?

అమెజాన్ ప్రైమ్:

స్పైడర్ నోయిర్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 27
లీడర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 28

హాట్‌స్టార్:

జెట్‌లీ (తెలుగు సినిమా) - మే 25
బ్రదర్స్ అండ్ సిస్టర్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 27
కజిన్స్ అండ్ కల్యాణమ్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 29

అలాంటి వారితో పెళ్లి? జీవితాంతం బాధే..సీరియల్ నటి ఎమోషనల్!
అలాంటి వారితో పెళ్లి? జీవితాంతం బాధే..సీరియల్ నటి ఎమోషనల్!

సన్ నెక్స్ట్:

ఫేసెస్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 29

జీ5:

రూమ్‌మేట్స్ (కన్నడ సిరీస్) - మే 27
ఆపిల్ టీవీ ప్లస్
ప్రొపెల్లర్ వన్ వే నైట్ కోచ్ (ఇంగ్లీష్ సినిమా) - మే 29
స్టార్ సిటీ (ఇంగ్లీష్ సిరీస్) - మే 29
లయన్స్ గేట్ ప్లే
ద రేస్ (రొమేనియన్ మూవీ) - మే 29

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X