OTT లవర్స్‌కి ముందే వచ్చిన సినీ పండుగ… వామ్మో ఒక్కరోజే అన్ని సినిమాలా.. చూడాల్సినవి మాత్రం?
ఓటీటీ ప్రేక్షకులకు ముందే పండుగ వచ్చిందోచ్. ఈ వారం సినీ ప్రేక్షకుల కోసం 21 సినిమాలు, సిరీసులు అలరిచండానికి సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు థియేటర్లలో సంక్రాంతి సినిమాలు హనుమాన్, గుంటూరు కారం, నాసామి రంగ, సైంధవ్ చిత్రాలు సందడి చేయనున్నాయి. ఇక వీటిలో అందరి దృష్టి హనుమాన్ గుంటూరు కారం సినిమాలపై ఉంది. ఇక ఈ టైంలో ఓటీటీలోకి వచ్చే సినిమాలు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు, సిరీసులు ఏంటో ఓ సారి చూద్దాం.
జనవరి రెండో వారం వీకెండ్ వచ్చేసింది. అయితే ఈసారి సంక్రాంతి పండగ సందడి గట్టిగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో 'గుంటూరు కారం', 'హను-మాన్', 'సైంధవ్', 'నా సామి రంగ' సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఇదే టైంలో ఓటీటీల్లోనూ పలు సినిమాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. మిగతా వారాలతో పోలిస్తే ఈ శుక్ర, శనివారాల్లో పెద్దగా చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలైతే ఏం లేవనే చెప్పాలి. 'అజయ్ గాడు' తెలుగు చిత్రంతో పాటు 'కిల్లర్ సూప్', 'ద లెజెండ్ ఆఫ్ హనుమాన్' లాంటి డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. ఇంతకీ ఈ శుక్రవారం ఏయే సినిమాలు ఏ ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయో ఓ లుక్ వేద్దాం.

ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, సిరీసుల లిస్ట్ ఇదే
నెట్‌ఫ్లిక్స్:
1. అడిరే - ఇంగ్లీష్ సినిమా -జనవరి 12న స్ట్రీమింగ్
2. లిఫ్ట్ - ఇంగ్లీష్ మూవీ -జనవరి 12న స్ట్రీమింగ్
3. లవ్ ఈజ్ బ్లైండ్: స్వీడన్ - స్వీడిష్ సిరీస్ -జనవరి 12న స్ట్రీమింగ్
4. డంబ్ మనీ - ఇంగ్లీష్ సినిమా -జనవరి 12న స్ట్రీమింగ్
5. బాయ్ స్వాలోస్ యూనివర్స్ - ఇంగ్లీష్ సిరీస్ - స్ట్రీమింగ్ అవుతోంది
6. ఛాంపియన్ - ఇంగ్లీష్ సిరీస్ - స్ట్రీమింగ్ అవుతోంది
7. డిటెక్టివ్ ఫోస్ట్ - పోలిష్ సిరీస్ - స్ట్రీమింగ్ అవుతోంది
8. కిల్లర్ సూప్ - హిందీ సిరీస్ - స్ట్రీమింగ్ అవుతోంది
9. మంత్ర సురుగణ - ఇండోనేసియన్ చిత్రం - స్ట్రీమింగ్ అవుతోంది
10. సోనిక్ ప్రైమ్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ - స్ట్రీమింగ్ అవుతోంది
అమెజాన్ ప్రైమ్:
11. రోల్ ప్లే - ఇంగ్లీష్ సినిమా -జనవరి 12న స్ట్రీమింగ్
12. దేహతి లడ్కే సీజన్ 2 - హిందీ సిరీస్ -జనవరి 12న స్ట్రీమింగ్
13. సెర్రిన్స్, మడేరా దే యాక్టర్ - స్పానిష్ సిరీస్ -జనవరి 12న స్ట్రీమింగ్
14. 90 హరి మెంకారి సువామి - ఇండోనేసియన్ సినిమా - స్ట్రీమింగ్ అవుతోంది
15. మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1 - తెలుగు డబ్బింగ్ మూవీ - స్ట్రీమింగ్ అవుతోంది

హాట్‌స్టార్:
16. ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 - తెలుగు డబ్బింగ్ -జనవరి 12న స్ట్రీమింగ్
17. సిరీస్ ఎకో - ఇంగ్లీష్ సిరీస్ - స్ట్రీమింగ్ అవుతోంది
జీ5:
18. అజయ్ గాడు - తెలుగు సినిమా -జనవరి 12న స్ట్రీమింగ్
జియో సినిమా:
19. టెడ్ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ -జనవరి 12న స్ట్రీమింగ్
ఆపిల్ ప్లస్ టీవీ:
20. కిల్లర్ ఆన్ ద ఫ్లవర్ మూన్ - ఇంగ్లీష్ మూవీ -జనవరి 12న స్ట్రీమింగ్
సోనీ లివ్:
21. చేరన్స్ జర్నీ - తమిళ వెబ్ సిరీస్ -జనవరి 12న స్ట్రీమింగ్


Click it and Unblock the Notifications











