OTTలోకి లావణ్య త్రిపాఠి మిస్ ఫెర్‌ఫెక్ట్, వెంకీ సైంధవ్ సహా 21 సినిమాలు.. ఎందులో చూడాలంటే?
కొత్త వారం వచ్చేసింది. దానితో పాటు.. సినిమా ప్రేక్షకుల కోసం ఓటీటీ చిత్రాల విడుదల జాబితా కూడా వచ్చేసింది. ఇక ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి ఉండగా.. ఓటీటీలో మస్త్ మజా ఇచ్చే సినిమాలు ఉన్నాయి. అయితే ఓటీటీలో ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 21 సినిమాలు, సిరీసులు సందడి చేయబోతున్నాయి. అందులో ఏవి ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి.. ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయో వివరాలు చూద్దాం.
సంక్రాంతి సందడి ముగిసినా... సంక్రాంతి సినిమాలు థియేటర్ వద్ద సందడి చేస్తున్నాయి. థియేటర్లో హనుమాన్ వంటి చిత్రం ఇంకా కొనసాగుతుండగా... ఈ వారం మరికొన్ని చిన్న చిత్రాలు సందడి చేయబోతున్నాయి. ఈ వారం థియేటర్ వద్ద 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు', 'బూట్ కట్ బాలరాజు' లాంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఏకంగా 21 కొత్త సినిమాలు, సిరీసులు స్ట్రీమింగ్ కి రానున్నాయి.

ఓటీటీలో ఆసక్తి కలిగిస్తున్న సినిమాల విషయానికి వస్తే... పెళ్లి తర్వాత మెగాకోడలు లావణ్య త్రిపాఠి నటించిన 'మిస్ ఫెర్‌ఫెక్ట్' సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సిరీస్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ ప్రధాన పాత్రలో, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా తెరకెక్కింది. ఈ సీరిస్ ఈ వారమే ఫిబ్రవరి 2న డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా రిలీజ్ కానుంది. అలానే పండగకి థియేటర్లలోకి వచ్చిన వెంకటేశ్ 'సైంధవ్'.. ఈ వీకెండ్‌లోనే ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరగుుతుంది. ఇవే కాకుండా ఇంకా పలు హిందీ, ఇంగ్లీషు సినిమాలు, సిరీసులు రానున్నాయి.
ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీసుల లిస్ట్ ఇదే...
నెట్‌ఫ్లిక్స్:
1. మైటీ భీమ్స్ ప్లే టైమ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 29న స్ట్రీమింగ్ కానుంది
2. ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 29న స్ట్రీమింగ్ కానుంది
3. జాక్ వైట్ హాల్: సెటిల్ డౌన్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 30న స్ట్రీమింగ్ కానుంది
4. నాస్కర్: ఫుల్ స్పీడ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 30న స్ట్రీమింగ్ కానుంది
5. అలెగ్జాండర్: ద మేకింగ్ ఆఫ్ ఏ గాడ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 31న స్ట్రీమింగ్ కానుంది
6. బేబీ బండిటో (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 31న స్ట్రీమింగ్ కానుంది
7. ద సెవెన్ డెడ్లీ సిన్స్ (జపనీస్ సిరీస్) - జనవరి 31న స్ట్రీమింగ్ కానుంది
8. WIL (డచ్ సినిమా) - జనవరి 31న స్ట్రీమింగ్ కానుంది
9. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 01న స్ట్రీమింగ్ కానుంది
10. లెట్స్ టాక్ అబౌట్ CHU (మాండరిన్ సిరీస్) - ఫిబ్రవరి 02న స్ట్రీమింగ్ కానుంది
11. ఓరియన్ అండ్ ద డార్క్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 02న స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్:
12. మరిచి (కన్నడ సినిమా) - జనవరి 29 (స్ట్రీమింగ్ అవుతోంది)
13. డీ ప్రాంక్ షో (డచ్ సిరీస్) - ఫిబ్రవరి 02న స్ట్రీమింగ్ కానుంది
14. మిస్టర్ & మిస్ స్మిత్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 02న స్ట్రీమింగ్ కానుంది
15. సైంధవ్ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 02న స్ట్రీమింగ్ కానుంది (రూమర్ డేట్)
హాట్‌స్టార్:
16. కోయిర్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 31న స్ట్రీమింగ్ కానుంది
17. మిస్ ఫెర్‌ఫెక్ట్ (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 02న స్ట్రీమింగ్ కానుంది
18. సెల్ఫ్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 02న స్ట్రీమింగ్ కానుంది
మనోరమ మ్యాక్స్:
19. ఓ మై డార్లింగ్ (మలయాళ సినిమా) - ఫిబ్రవరి 02న స్ట్రీమింగ్ కానుంది
బుక్ మై షో:
20. అసెడియో (స్పానిష్ సినిమా) - జనవరి 30న స్ట్రీమింగ్ కానుంది
జియో సినిమా:
21. ఇన్ ద నో (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 29 (స్ట్రీమింగ్ అవుతుంది)


Click it and Unblock the Notifications











