OTT ప్రేక్షకులకు పండగ... ఈ వారం 21సినిమాలు.. ఆ 2 మాత్రం డోంట్ మిస్!

హాయ్ మూవీ లవర్స్​!! వీకెండ్ వచ్చింది కదా అందుకే మీ కోసం మళ్లీ కొత్త సినిమా కబుర్లతో వచ్చేశాం. ఎందుకంటే వీకెండ్​ వస్తుందంటే కొత్త సినిమా, సిరీస్​లు ఏవేవి వస్తున్నాయా అంటూ ఓటీటీ ప్రియులు తెగ వెతికేస్తుంటారు. కొత్త వాటి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అందుకు తగ్గటే ఓటీటీ ప్లాట్​ఫామ్​ వాళ్లు కూడా కొత్త కొత్త కంటెంట్​లతో ఎంటర్​టైన్​ చేస్తున్నారు.

అయితే కొంతమందికి మాత్రం ఎలాంటి సినిమాలు, ఏ జోనర్ వెబ్ సిరీస్ చూడాలన్న చిన్న కన్ఫ్యూజన్‌ కూడా ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ వీకెండ్​లో చూసేందుకు కొన్ని ఇంట్రెస్టింగ్​ సినిమా సిరీస్​ల వివరాలను మీ ముందుకు తీసుకొచ్చేశాం. వాటి గురించి తెలుసుకోవాలంటే కింద పేర్కొన్న వాటిపై ఓ లుక్కేయండి.

This week OTT Releases :Lavanya Tripathi Miss Perfect, Venkatesh Saindhav and Web Series, Movies List February 1st week 2024

ఇక ఈ వారం రిలీజ్ అయ్యే చిత్రాల్లో ముఖ్యంగా రెండు చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఒకటి మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన మిస్ ఫర్ ఫెక్ట్ వెబ్ సిరీస్ కాగా.. మరొకటి వెంకటేష్ సైంధవ్ చిత్రాలు. ఇవి ఈవారమే ఓటీటీలోకి రానున్నాయి. మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటిస్తున్న వెబ్ సిరీస్ కావడంతో .... మంచి బజ్ ఏర్పడింది. ఇక ఈ సిరీసులో బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సిరీస్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మరొకటి.. సైంధవ్. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది.

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు, సిరీసుల జాబితా ఇదే..

నెట్ ఫ్లిక్స్
1. మైటీ భీమ్స్ ప్లే టైమ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జనవరి 29నుంచే స్ట్రీమింగ్ అవుతుంది
2. ది గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (ఇంగ్లీష్ మూవీ)- జనవరి 29నుంచే స్ట్రీమింగ్ అవుతుంది
3. జాక్ వైట్ హాల్: సెటిల్ డౌన్ (ఇంగ్లీష్ సినిమా)- జనవరి 30నుంచే స్ట్రీమింగ్ అవుతుంది
4. నాస్కర్: ఫుల్ స్పీడ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జనవరి 30నుంచే స్ట్రీమింగ్ అవుతుంది
5. అలెగ్జాండర్: ది మేకింగ్ ఆఫ్ ఏ గాడ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జనవరి 31నుంచే స్ట్రీమింగ్ అవుతుంది
6. బేబీ బండిటో (ఇంగ్లీష్ సిరీస్)- జనవరి 31నుంచే స్ట్రీమింగ్ అవుతుంది
7. ది సెవెన్ డెడ్లీ సిన్స్ (జపనీస్ వెబ్ సిరీస్)- జనవరి 31నుంచే స్ట్రీమింగ్ అవుతుంది
8. విల్ (డచ్ మూవీ)- జనవరి 31నుంచే స్ట్రీమింగ్ అవుతుంది
9. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (ఇంగ్లీష్ చిత్రం)- జనవరి 31నుంచే స్ట్రీమింగ్ అవుతుంది
10. లెట్స్ టాక్ అబౌట్ చు (మాండరీన్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 2న స్ట్రీమింగ్
11. ఓరియన్ అండ్ ది డార్క్ (ఇంగ్లీష్ సినిమా)- ఫిబ్రవరి 2న స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ వీడియో
12. మరిచి (కన్నడ సినిమా)- జనవరి 29నుంచే స్ట్రీమింగ్ అవుతుంది
13. డీ ప్రాంక్ షో (డచ్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 2న స్ట్రీమింగ్
14. మిస్టర్ అండ్ మిస్ స్మిత్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 2
15. సైంధవ్ (తెలుగు సినిమా)- ఫిబ్రవరి 3న స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్
16. కోయిర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జనవరి 31నుంచే స్ట్రీమింగ్ అవుతుంది
17. మిస్ పర్ఫెక్ట్ (తెలుగు వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 2న స్ట్రీమింగ్
18. సెల్ఫ్ (ఇంగ్లీష్ మూవీ)- ఫిబ్రవరి 2న స్ట్రీమింగ్

జియో సినిమా ఓటీటీ
19. ఇన్ ద నో (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- - జనవరి 29నుంచే స్ట్రీమింగ్ అవుతుంది

బుక్ మై షో ఓటీటీ ప్లాట్ ఫామ్
20. అసెడియో (స్పానిష్ చిత్రం)- - జనవరి 30నుంచే స్ట్రీమింగ్ అవుతుంది

మనోరమ మ్యాక్స్ ఓటీటీ
21. ఓ మై డార్లింగ్ (మలయాళ చిత్రం)- - ఫిబ్రవరి 2న స్ట్రీమింగ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X