OTT releases this week: ఈ వారం ఓటీటీ సినిమాలు.. ఆ ఐదు చాలా స్పెషల్..

This Week OTT Movies: సమ్మర్ స్పెషల్ గా థియేటర్‌లతో పాటు ఓటీ ప్లాట్‌ఫారమ్‌లకూ మంచి డిమాండ్ ఏర్పడింది. మే నెలలో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం అయితే, అదే టైంలో ఇంట్లోనే ఎంటర్టైన్ కావాలనుకునే ఆడియన్స్ ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా వేసవి సెలవులు ఉండటంతో కుటుంబం మొత్తం కలిసి సినిమాలు చూస్తే ట్రెండ్ పెరిగింది. ఇక ఈ వారం ఓటి విడుదల విషయానికి వస్తే, దాదాపు 10కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల సినిమాలు ఇవే..

'ఎల్‌ఐకే- లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ'(LIK)
కోలీవుడ్ యంగ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన 'ఎల్‌ఐకే- లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ'(LIK) సినిమా ఓటీటీలోకి రాబోతోంది. దర్శకుడు విఘ్నేష్ శివన్ రూపొందించిన ఈ ఫ్యూచరిస్టిక్ లవ్టైనర్ ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా మే 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా, S. J. సూర్య తనదైన విలనిజంతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కామెడీ టచ్‌తో కూడిన ఈ లవ్ స్టోరీ యువతను బాగా ఆకట్టుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉండటంతో టాలీవుడ్ ప్రేక్షకులకు ఇది మరో ప్లస్ పాయింట్‌గా మారింది.

This Week OTT Releases LIK Citadel 2 Dacoit Vaazha 2 Streaming Guide amp amp Dates

సిటాడెల్ సీజన్ 2
ఇక అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్న స్పై థ్రిల్లర్ సిరీస్ సిటాడెల్ సీజన్ 2 (Citadel 2) కూడా మే 6 అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ మొదటి సీజన్‌తోనే గ్లోబల్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు సీజన్ 2 మరింత యాక్షన్, సస్పెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసేందుకు సిద్ధమైంది. మొత్తం ఏడు ఎపిసోడ్స్ ఒకేసారి విడుదల అవుతుండటం ప్రత్యేక ఆకర్షణ. ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో ఒకేసారి స్ట్రీమింగ్ అవుతుండటంతో ఈ భారీ హైప్ సిరీస్. 'మాంటికోర్' అనే గ్లోబల్ నెట్‌వర్క్‌తో పోరాడే కథ మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతుందని ట్రైలర్ తెలియజేస్తోంది.

డెకాయిట్
టాలీవుడ్ వైపు చూస్తే అడివి శేష్ హీరోగా నటించిన డెకాయిట్ కూడా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ యాక్షన్-లవ్ థ్రిల్లర్ థియేటర్లలో మంచి టాక్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా, అడివి శేష్ కెరీర్‌లోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు మే 8 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాకున్నది. తెలుగు తో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉండటంతో ఈ సినిమా మరింత రీచ్ కానుంది. ఇందులో ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

భరతనాట్యం 2 మోహినియాట్టం
మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఓటీటీకి భారీ కంటెంట్ రాబోతోంది. ఇటీవల బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న భరతనాట్యం 2 మోహినియాట్టం చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో మే 8 నుంచి స్ట్రీమింగ్ సంస్థ. సుమారు రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా, క్లాసికల్ డాన్స్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రదర్శించిన ఇంటెన్స్ డ్రామాగా గుర్తింపు పొందింది. అయితే ఈ చిత్రం కేవలం మలయాళంలో మాత్రమే అందుబాటులో ఉంది.

వాలా 2
మరో మలయాళ బ్లాక్‌బస్టర్ 'వాలా 2' కూడా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో రూ.220 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించిన ఈ చిత్రం తెలుగులో కూడా మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ సినిమా మే 8 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ సంస్థ. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రాన మరింత విస్తృత ప్రేక్షకులకు చేరువైంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే ఈ టైనర్‌ను ఆస్వాదించవచ్చు.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మే 04 నుంచి 10వ తేదీ వరకు)

నెట్‌ఫ్లిక్స్: భరతనాట్యం 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 08

అమెజాన్ ప్రైమ్:

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 06
సిటాడెల్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 06
డెకాయిట్ (తెలుగు మూవీ) - మే 08
లుక్కే (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 08

హాట్‌స్టార్:
వాలా 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 08
సాంగ్ సంగ్ బ్లూ (ఇంగ్లీష్ మూవీ) - మే 08

జీ5:
లవ్ మాక్‌టైల్ 3 (కన్నడ సినిమా) - మే 08

సన్ నెక్స్ట్:
ఓ బటర్ ఫ్లై (తమిళ మూవీ) - మే 08
సూపర్ హిట్ (కన్నడ సినిమా) - మే 08

మొత్తానికి చూస్తే, మే నెలలో ఓటీ ప్లాట్‌ఫారమ్‌లు భారీ కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. లవ్ స్టోరీలు, యాక్షన్ థ్రిల్లర్స్, స్పై డ్రామాలు, క్లాసికల్ బ్యాక్‌డ్రాప్ మూవీస్-ఇలా ప్రతి జానర్‌కు చెందిన కంటెంట్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. థియేటర్‌కు వెళ్లలేకపోయినవారికి ఇది మంచి అవకాశం కాగా, కొత్త కంటెంట్ కోసం ఓటీటీ లవర్స్‌కు ఇది నిజంగా ఫెస్టివల్ సీజన్ అని చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X