OTTలోకి మహేష్ బాబు గుంటూరు కారం సహా 23 క్రేజీ సినిమాలు.. ఆ 6 మాత్రం డోంట్ మిస్!
మరో కొత్తవారం వచ్చేసింది.ఇక ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకుల కోసం బోలేడన్ని సినిమాలు వచ్చేశాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 23 సినిమాలు, సిరీసులు స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయాయి. ఇక అందులో ఇంట్రెస్ట్ కలిగించేవి ఎక్కువగానే ఉన్నాయి. అటు థియేటర్ల వద్ద రవితేజ ఈగల్ లాంటి చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక చెప్పుకోదగ్గ పెద్ద చిత్రాలు అయితే ఏమి లేవు. దీంతో అందరి దృష్టి ఓటీటీపైనే ఉంది. ఇక ఓటీటీలో ఏ ఏ సినిమాలు, సిరీసులు రిలీజ్ అవుతున్నా.. ఎక్కడ అనేది ఈ స్టోరీలో చూద్దాం.
ఈ వారం ఓటీటీలో 23 సినిమాలు, సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. అందులో ముఖ్యంగా 6 సినిమాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోల్ వచ్చిన గుంటూరు కారం సినిమా ఈ వారమే నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో సూపర్ హిట్టుగా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. మరోవైపు లవర్స్ డే కానుకగా సుమకొడుకు సినిమా బబుల్ గమ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

వీటితో పాటు... ధనుష్ కెప్టెన్ మిల్లర్ కన్నడ స్టార్ దర్శన నటించిన కాటేరా సినిమాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. మరోవైపు భూమి ఫెడ్నేకర్ క్రైమ్ థ్రిల్లర్ భక్షక్, సుస్మితా సేన్ ఆర్య-3 వెబ్ సిరీసులు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. అంతే కాకుండా ఈ వారంలో మాస్ మహారాజా నటించిన ఈగల్ థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీసుల జాబితా ఇదే...
నెట్‌ఫ్లిక్స్
1. డీ అండ్ ఫ్రెండ్స్ ఇన్ ఓజ్ (యానిమేషన్ సిరీస్)- ఫిబ్రవరి 05నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
2. ఆక్వామాన్ అండ్ ది లిస్ట్ కింగ్‌డమ్ - ఫిబ్రవరి 05నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
3. మాంక్ సీజన్స్(అమెరికన్ సిరీస్)- ఫిబ్రవరి 05నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
4. మై వైఫ్ అండ్ కిడ్స్ సీజన్స్(కిడ్స్ సిరీస్)-ఫిబ్రవరి 05నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
5. ది రీ-ఎడ్యుకేషన్ ఆఫ్ మోలీ సింగర్(అమెరికన్ సిరీస్)-ఫిబ్రవరి 05నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
6. లూజ్: ది లైట్ ఆఫ్ హార్ట్ (బ్రెజిలియన్ కిడ్స్ సిరీస్)- ఫిబ్రవరి 07న స్ట్రీమింగ్
7. రైల్: ది లాస్ట్ ప్రొఫెట్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 07న స్ట్రీమింగ్
8. లవ్ నెవర్ లైస్ పోలాండ్- సీజన్ 2 -పార్ట్ 2 -ఫిబ్రవరి 07న స్ట్రీమింగ్
9. వన్ డే (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 08న స్ట్రీమింగ్
10. గుంటూరు కారం(తెలుగు)- ఫిబ్రవరి 09న స్ట్రీమింగ్
11. భక్షక్-(హిందీ క్రైమ్ థ్రిల్లర్ )- ఫిబ్రవరి 09 న స్ట్రీమింగ్
12. లవర్ స్టాకర్ కిల్లర్ ( డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 09న స్ట్రీమింగ్
13. యాషెస్ ( టర్కీ సిరీస్)- ఫిబ్రవరి 09న స్ట్రీమింగ్
14. ఎ కిల్లర్ పారడాక్స్ (కొరియన్ సిరీస్)- ఫిబ్రవరి 09న స్ట్రీమింగ్
15. ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 (స్పానిష్ సిరీస్)- ఫిబ్రవరి 09న స్ట్రీమింగ్
16. హారిబుల్ బాసెస్ - ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్
17. బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్
ఆహాలో
18. బబుల్గమ్ ప్రీమియర్స్ - ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్
అమెజాన్ ప్రైమ్
19. కెప్టెన్ మిల్లర్(తెలుగు డబ్బింగ్ మూవీ)-ఫిబ్రవరి 09 న స్ట్రీమింగ్
డిస్నీప్లస్ హాట్ స్టార్
20. ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3(వెబ్ సిరీస్)-ఫిబ్రవరి-0 9న స్ట్రీమింగ్
జీ5
21. కాటేరా(కన్నడ డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి- 09న స్ట్రీమింగ్
22. లాంత్రానీ(హిందీ సినిమా) - ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్
బుక్ మైషోలో
23. అక్వామాన్ అండ్ ది లాస్ట్ కింగ్‌డమ్ - ఫిబ్రవరి 5నుంచి స్ట్రీమింగ్ అవుతుంది


Click it and Unblock the Notifications











