OTTలో ఫ్రైడే ఫెస్టివల్.... ఒక్కరోజే 11 సినిమాలు.. ఆ మూడు మిస్ అవ్వకండి!

సినిమా లవర్స్ కోసం ఓటీటీ సంస్థలు ఎన్నో కొత్త చిత్రాలు తీసుకువస్తుంది. ఈ వారం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి. సుందరం మాస్టర్, ఆర్జీవీ వ్యూహం, మమ్ముట్టి భ్రమయుగం వంటి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు.. ఓటీటీలో పలు ఆసక్తికర సినిమాలు, సిరీసులు స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. మరి అందులో ఏ సినిమా ఆసక్తి కలిగిస్తుందో ఓ సారి చూద్దాం పదండి.

కొత్త వీకెండ్ వచ్చేసింది. సినిమా ప్రేమికులకు పండగే అని చెప్పవచ్చు. ఇక ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలు లేవు కానీ రెండు చిన్న చిత్రాలతో పాటు ఓ మలయాళ చిత్రం కూడా రిలీజ్ అవుతుంది. వైవా హార్ష నటించిన సుందరం మాస్టర్, రామ్ గోపాల్ వర్మ వ్యూహం వంటి చిత్రాలు రిలీజ్ అవుతుండగా... వీటితో పాటు మలయాళ చిత్రం మమ్ముట్టి నటించిన బ్లాక్ అండ్ వైట్ కలర్ భ్రమయుగం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

This week OTT Releases : Mohan Lal Malaikottai Vaaliban, The Indrani Mukerjea Story, Poacher and Web Series, Movies List February 4th Weekend

ఇక ఓటీటీలో ఈ వారం బాగానే చిత్రాలు సందడి చేయనున్నాయి. ఇక ఒక్కరోజే 11 సినిమాలు రీలీజ్ కానున్నాయి. ఇందులో టాలీవుడ్ సినిమాలు లేనప్పటికీ.. డబ్బింగ్ మూవీస్ ఆసక్తి కలిగిస్తున్నాయి. వాటిలో క్రైమ్ థ్రిల్లర్ పోచర్, మోహన్ లాల్ నటించిన మలైకోట్టై వాలిబన్, సంచలన మర్డర్ కేస్ ది బరీడ్ ట్రూత్ లాంటి చిత్రాలు ఇంట్రెస్ట్ కలిగిపిస్తున్నాయి. ఇందులో దేశాన్ని కుదిపేసిన షీనా బోరా హత్య కేసు ఆధారంగా వస్తోన్న ది బరీడ్ ట్రూత్‌ డాక్యూమెంటరీపై అందరి కళ్లు ఉన్నాయని చెప్పాలి. ఇక ఇవే కాకుండా పలు వెబ్ సిరీసులు, సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఏయే సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో కింద లిస్ట్ చూడండి.

ఈ వీకెండ్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానున్న చిత్రాలివే..

నెట్‌ఫ్లిక్స్‌

1. అవతార్ అండ్ ది లాస్ట్ ఎయిర్‌బెండర్(వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 22నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
2. సౌత్‌ పా(ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 22నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
3. త్రూ మై విండో 3: లుకింగ్ ఎట్ యు(స్పానిష్ మూవీ)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
4. మీ కుల్పా(నెట్‌ఫ్లిక్స్ సినిమా)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
5. ఫార్ములా- 1: డ్రైవ్ టూ సర్వైవ్ సీజన్-6(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
6. ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
7. ఎవరీథింగ్ ఎవరీవేర్ ఆల్ ఏట్ వన్స్- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
8. మార్షెల్ ది షెల్ విత్ షూస్ ఆన్ - ఫిబ్రవరి 24న స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్
9. ది వించెస్టర్స్‌- ఫిబ్రవరి 22నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
10. పోచర్- (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
11. అపార్ట్‌మెంట్‌ 404- (థ్రిల్లర్‌ సిరీస్)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
12. ది సెకండ్ బెస్ట్ హాస్పిటల్ ఇన్‌ ది గెలాక్సీ(కార్టూన్ సిరీస్)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
13. మలకోట్టై వాలిబన్‌- (మలయాళ సినిమా)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
జియో సినిమా
14. సమ్మర్‌ హౌస్‌ సీజన్‌-8 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
లయన్స్‌ గేట్ ప్లే
15. సా ఎక్స్‌(అమెరికన్ హారర్‌ ఫిల్మ్)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X