This Week OTT: మంజుమ్మల్ బాయ్స్ సహా 15 చిత్రాలు ఓటీటీలోకి.. ఈ వారం పండగే!
అసలే ఎండాకాలం.. కాలు బయట పెట్టాలంటేనే జనాలు వణికిపోతున్నారు. సూర్యుడి ప్రతాపానికి తట్టుకోలేక ఇంట్లోనే ఉంటున్నారు. ఈక్రమంలోనే రోజంతా పడుకోలేక, ఉత్తిగా కూర్చోలేక.. ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. అదిరిపోయే సినిమాలు చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త వారం వస్తోందంటే చాలు ఏయే సినిమాలు వస్తున్నాయి, ఎలాంటి వెబ్ సిరీస్ లు సందడి చేయనున్నాయో అని తెలుసుకుంటున్నారు. ముందుగానే ఓటీటీలోకి వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ ల లిస్టును చూసేస్తూ.. ఏమేం చూడాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
అయితే తాజాగా ఈ వారం అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయ్యాయి. మంజుమ్మల్ బాయ్స్, షైతాన్, హీరామండి సహా మరో 13 సినిమాలు, వెబ్ సిరీస్ లు ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. అయితే ఆ చిత్రాలు ఏవి, ఎప్పుడు విడుదల కాబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్ వేదికగా..:
బాయిలింగ్ పాయింట్ 1 (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 29
ఫియాస్కో (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 30
హీరామండి (వెబ్ సిరీస్) - మే 1
షైతాన్ - మే 3
ది ఎ టిపికల్ ఫ్యామిలీ (కొరియన్ మూవీ) - మే 4
అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా..:
అంబర్ గర్ల్స్ స్కూల్ (వెబ్ సిరీస్) - మే 1
ద ఐడియా ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ) - మే 2
క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3 (వెబ్ సిరీస్) - మే 3
ఉమన్ ఆఫ్ మై బిలియన్ (డాక్యుమెంటరీ) - మే 3

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా.. :
ది వీల్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 30
మంజుమ్మల్ బాయ్స్ (తెలుగు వర్షన్) - మే 5
మాన్ స్టర్స్ ఎట్ వర్క్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - మే 5
జియో సినిమా వేదికగా..
మైగ్రేషన్ - మే 1
హాక్స్ 3 (వెబ్ సిరీస్) - మే 3
వోంకా (హాలీవుడ్) - మే 3
ది టాటూయిస్ట్ ఆఫ్ ఆష్ విజ్ (వెబ్ సిరీస్) - మే 3
ఆపిల్ ప్లస్ టీవీ
అకాపుల్కో సీజన్ 3 (వెబ్ సిరీస్) - మే 1


Click it and Unblock the Notifications











