This Week OTT Movies : ఈ వారం ఓటీటీ సినిమాలు.. ఈ మూవీస్ అస్సలు మిస్ కావొద్దు..
This Week OTT Movies: ఈ మధ్యకాలంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ప్రాధాన్యం రోజురోజుకీ పెరుగుతోంది. థియేటర్లకు వెళ్లే సమయం లేకపోయినా, లేదా అక్కడ మిస్ అయిన సినిమాలను చూడాలన్నా ప్రేక్షకులు ఇప్పుడు డిజిటల్ వేదికలపైనే ఆధారపడుతున్నారు. అంతేకాకుండా, ఓటీటీ కోసం ప్రత్యేకంగా రూపొందుతున్న వెబ్‌సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, ఒరిజినల్ మూవీస్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి వారం కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించే ఈ ప్లాట్‌ఫామ్స్, ఈసారి కూడా మార్చి 23 నుంచి 29 మధ్య విభిన్న జానర్లలో సినిమాలు, సిరీస్‌లను తీసుకొస్తున్నాయి. ఈ వారం ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్స్ కొత్త కంటెంట్‌తో సిద్ధమయ్యాయి.
ఇప్పటికే థియేటర్లలో పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన 'ఉస్తాద్ భగత్ సింగ్' భారీ అంచనాల మధ్య విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను అందుకుంది. పవన్ మాస్ ఎలిమెంట్స్, డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ, కథనం విషయంలో కొంత నిరాశ వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్: ది రివెంజ్' మాత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. కేవలం 4 రోజుల్లోనే 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో యాక్షన్, థ్రిల్లర్, హారర్, క్రైమ్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా వంటి అన్ని రకాల జానర్లలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అందుబాటులోకి రానుండటం విశేషం. దీంతో అన్ని వయసుల ప్రేక్షకులకు ఈ వారం ఓటీటీ ఒక పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్‌లా మారనుంది.

నెట్‌ఫ్లిక్స్ విషయానికి వస్తే, ఈ వారం హారర్, క్రైమ్, డాక్యుమెంటరీల మేళవింపుతో పలు ఆసక్తికర ప్రాజెక్టులు విడుదలవుతున్నాయి. 'సమ్‌థింగ్ వెరీ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్" అనే హారర్ మినీ సిరీస్ మార్చి 23న విడుదల కానుంది. అడవుల్లో జరిగే ఒక వివాహ వేడుక అనూహ్యంగా భయానకంగా మారడం ఈ కథలో ప్రధానాంశం. అలాగే "డిటెక్టివ్ హోల్" అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మార్చి 26న రానుంది. మానసిక ఒత్తిళ్ల మధ్య ఒక డిటెక్టివ్ హత్యల కేసును ఛేదించే కథ ఇది. ఇక ప్రపంచ ప్రసిద్ధ BTS బ్యాండ్ సిరీస్ లో 'BTS: ది రిటర్న్' డాక్యుమెంటరీ కూడా మార్చి 27న స్ట్రీమింగ్ కానుంది. అలాగే.. 'మర్దానీ 3'వంటి యాక్షన్ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
జియో హాట్‌స్టార్‌లో ఈ వారం ప్రధానంగా యాక్షన్, థ్రిల్లర్ కంటెంట్ ఆకట్టుకోనుంది. 'డేర్‌డెవిల్: బోర్న్ అగైన్' సీజన్ 2 మార్చి 24న విడుదల కానుంది. రాజకీయ ఒత్తిళ్లు, నేర ప్రపంచం మధ్య సాగుతున్న విజిలాంటీ కథ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుంది. అలాగే 'కాట్టాన్' అనే తమిళ మిస్టరీ థ్రిల్లర్ మార్చి 27న రాబోతోంది. గ్రామీణ నేపథ్యంలో జరిగే హత్య కేసు చుట్టూ తిరిగే ఈ కథలో అనేక ట్విస్టులు ఉంటాయట.
ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఈ వారం మంచి కంటెంట్ ను ఓటీటీ లవర్స్ ముందుకు తీసుకరాబోతుంది. 'ప్రెట్టీ లేథల్' అనే యాక్షన్ ఒరిజినల్ మూవీ మార్చి 25న విడుదల అవుతుంది. అలాగే 'బైట్' అనే వెబ్‌సిరీస్ కూడా అదే రోజు రానుంది. ఇక 'ఓ రోమియో'అనే డార్క్ రొమాంటిక్ మూవీ కూడా మార్చి 27న స్ట్రీమింగ్ కానుంది. ప్రేమ, ప్రతీకారం మేళవింపుతో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో మంచి స్పందన పొందింది.
ఇక తెలుగు ప్రేక్షకుల కోసం ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్‌లో 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'అనే సినిమా మార్చి 22 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా రూపొందింది. ఈ వారం ఓటీటీ రిలీజ్‌లలో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, అన్ని రకాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఓటీటీ ప్లాట్ ఫారమ్స్ సిద్దమయ్యాయి.
యాక్షన్ ఇష్టపడేవారికి "డేర్‌డెవిల్", థ్రిల్లర్ అభిమానులకు "డిటెక్టివ్ హోల్", హారర్ లవర్స్‌కు "సమ్‌థింగ్ వెరీ బ్యాడ్...", రొమాన్స్ కోసం "ఓ రోమియో", కుటుంబ కథల కోసం "సాంప్రదాయిని..." ఇలా అన్నిరకాల మూవీస్ అందుబాటులో ఉన్నాయి. మరి ఈ వారం మీరు ఏ కంటెంట్ ను చూస్తారు? మీ ఫేవరేట్ మూవీ ఏంటీ? కామెంట్ చేయండి.


Click it and Unblock the Notifications



















