OTT ప్రేక్షకులకు పండగే... ఈ వారం ఏకంగా 18 సినిమాలు.. ఆసక్తి కలిగించేవి ఏంటంటే?
ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పండగే అని చెప్పవచ్చు. థియేటర్లలో చిన్న సినిమాల సందడి చేయగా.. ఓటీటీల్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ సందడి చేయనున్నాయి. ఇక ఈ వారం థియేటర్లలో 6 సినిమాలు విడుదలకు రెడీ ఉండగా.. ఓటీటీల్లో ఏకంగా 18 సినిమాలు, సిరీసులు రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ సినిమాలు విడుదల అవుతున్నాయి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి.. అందులో ఏవి ఆసక్తి కలిగిస్తున్నాయి అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అక్టోబర్ నెల ప్రారంభం అయింది. ఇక ఈ నెలలోనే దసరా పండగ ఉంది. దసరా పండక్కి పెద్ద సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉంటే.. ఇప్పుడు చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్యూ కట్టాయి. బాక్సాఫీస్ వద్దకు ఈ వారంలో ఆరు సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో మామ మశ్చింద్రా, రూల్స్ రంజన్, మ్యాడ్, మంత్ ఆఫ్ మధు, 800, చిన్నా చిత్రాలు పోటీలో ఉండగా.. ఈ సినిమాలు అన్ని ఆసక్తిని పెంచుతున్నాయి. మరి ఇందులో బాక్సాఫీస్ వద్ద ఎవరు సక్సెస్ అవుతారో కొద్దిరోజులు ఆగాల్సిందే.

ఇక అటు ఓటీటీలోనూ మంచి సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. వివిధ ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ లో ఏకంగా 18సినిమాలు, సిరీసులు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈవారం రిలీజ్ అవుతున్న వాటిల్లో ముఖ్యంగా ఆసక్తి కలిగిస్తున్న చిత్రాలు చూసుకుంటే.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఉండగా... సోహేల్ నటించిన మిస్టర్ ప్రగ్నెంట్ కూడా ఈవారమే రిలీజ్ కాబోతుంది.
ఇక వాటితో పాటుగా... సన్నీ డియోల్ నటించిన గదర్ 2 సినిమాతో పాటు.. టబు నటిస్తున్న ఖుఫీయా, రెజీనా నటించినా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ది గ్రేట్ ఇండియాన్ మర్డర్ వంటి సిరీసులు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇక ఓటీటీల్లో ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో వివరంగా తెలుసుకుందాం.

ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీసుల వివరాలు ఇవే...
నెట్‌ఫ్లిక్స్:
1. బెక్‌హమ్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 4న స్ట్రీమింగ్
2. మిస్‌శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి (తెలుగు) అక్టోబరు 5న స్ట్రీమింగ్
3. ఎవ్రీథింగ్ నౌ (వెబ్‌సిరీస్) అక్టోబరు 5న స్ట్రీమింగ్
4. ఖుఫియా (హిందీ) అక్టోబరు 5న స్ట్రీమింగ్
5. లుపిన్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 5న స్ట్రీమింగ్
6. ఫెయిర్ ప్లే (హాలీవుడ్) అక్టోబరు 6న స్ట్రీమింగ్
7. ఇన్సిడియస్ (హాలీవుడ్) అక్టోబరు 6న స్ట్రీమింగ్
8. స్ట్రాంగ్ గర్ల్ నామ్-సూన్ (కొరియన్) అక్టోబరు 6న స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్:
9. హర్కరా (మలయాళం) అక్టోబరు 1న స్ట్రీమింగ్ నుంచి అవుతోంది
10. ముంబై డైరీస్ (హిందీ) అక్టోబరు 6న స్ట్రీమింగ్
జీ5:
11. గదర్2 (హిందీ) అక్టోబరు 6న స్ట్రీమింగ్

డిస్నీ+హాట్‌స్టార్:
12. హంటెడ్ మాన్షన్ (హలీవుడ్) అక్టోబరు 4న స్ట్రీమింగ్
13. లోకి (వెబ్‌సిరీస్) అక్టోబరు 6న స్ట్రీమింగ్
ఆహా:
14. మిస్టర్ ప్రెగ్నెంట్ (తెలుగు) అక్టోబరు 6న స్ట్రీమింగ్
15. ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ (తెలుగు) అక్టోబరు 6న స్ట్రీమింగ్
బుక్ మై షో:
16. ది నన్ 2 (హాలీవుడ్) అక్టోబరు 3న స్ట్రీమింగ్ నుంచి అవుతోంది
17. గ్రాన్ టురిస్‌మో (హాలీవుడ్) అక్టోబరు 5న స్ట్రీమింగ్
18. ఆస్ట్రరాయిడ్ సిటీ (హాలీవుడ్) అక్టోబరు 6న స్ట్రీమింగ్
మొత్తంగా ఈ వారం బాక్సాఫీస్ వద్ద 6 చిన్న సినిమాలు పోటీ పడుతుండగా... 18 సినిమాలు, సిరీసులు ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం మీరు ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని నచ్చిన సినిమాలను చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











