OTTలోకి ఈ వారం 17 సినిమాలు.. ఆ సంచలన మర్డర్ మిస్టరీ మూవీ కూడా!
వీకెండ్ ముగిసింది. కొత్త వారం మొదలైపోయింది. దీంతో మూవీ లవర్స్ చూపు ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలపై పడింది. అందుకే ఎప్పటిలాగే ఓటీటీ అండ్ థియేటర్ ప్రేక్షకుల్ని అలరించేందుకు పలు సినిమాలు రెడీ అయిపోయాయి. అయితే వీటిలో పలు చిత్రాలు బాగా ఆసక్తిని పెంచుతున్నాయి. క్రైమ్ సిరీస్ పోచర్, మోహన్ లాల్ మలైకొట్టై వాలిబన్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ : ది బరీడ్ ట్రూత్ డాక్యుమెంటరీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరి ఇంకా ఏఏ సినిమా సిరీస్‌లు థియేటర్లలో, ఏఏ ఓటీటీల్లో ఎప్పుడు నుంచి రానున్నాయో తెలుసుకుందాం..
వైవ హర్ష నటించిన సుందరం మాస్టర్ ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. కుటుంబ సమేతంగా చూసే చిత్రమిది. ఈ చిత్రాన్ని హీరో రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. దీంతో పాటు అభినవ్ గోమఠం ప్రధాన పాత్రలో నటించిన మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా! ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి తిరుపతి రావు ఇండ్ల దర్శకుడు. తరుణ్ భాస్కర్, అలీ రెజా, వైశాలి ఇతర పాత్రల్లో నటించారు.

ఇంకా దీపక్ సరోజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం సిద్ధార్థ్ రాయ్ ఫిబ్రవరి 23న రిలీజ్ కాబోతుంది. అలాగే విరాన్ ముత్తంశెట్టి హీరోగా నటించిన ముఖ్య గమనిక అనే చిత్రం కూడా ఫిబ్రవరి 23నే విడుదల కానుంది. లావణ్య కథానాయిక. 'థ్రిల్లింగ్ అంశాలతో సాగే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఇకపోతే అందాల తార యామీ గౌతమ్ మరో సరికొత్త కథతో తెరపై సందడి చేయడానికి రెడీ అయింది. ఈ సారి ఆర్టికల్ 370తో వస్తోంది. ఆదిత్య సుహాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆర్టికల్ 370 నేపథ్యంలో కశ్మీర్‌లో జరిగిన పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించారు. ఫిబ్రవరి 23న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
ఇక ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు రానున్న చిత్రాలివే..
అమెజాన్ ప్రైమ్‌లో
1. మలకోట్టై వాలిబన్- (మలయాళ సినిమా)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్ (రూమర్ డేట్)
2. పోచర్- (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
3. అపార్ట్‌మెంట్ 404 (కొరియన్ సిరీస్) - ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో
4. విల్ ట్రెంట్ సీజన్-2 (ఇంగ్లీష్ సినిమా)- ఫిబ్రవరి 21న స్ట్రీమింగ్
5. స్టార్ వార్స్: ది బ్యాడ్ బ్యాచ్(ఇంగ్లీష్ యానిమేషన్ మూవీ)- ఫిబ్రవరి 21న స్ట్రీమింగ్
నెట్‌ఫ్లిక్స్‌లో
6. ఐన్‌స్టీన్ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ చిత్రం)- ఫిబ్రవరి 19న స్ట్రీమింగ్
7. రిథమ్ ప్లస్ ఫ్లో ఇటలీ(రియాలిటీ సిరీస్)- ఫిబ్రవరి 19న స్ట్రీమింగ్
8. మైక్ ఎప్స్: రెడీ టు సెల్ అవుట్(కామెడీ సిరీస్)- ఫిబ్రవరి 20న స్ట్రీమింగ్
9. క్యాన్ ఐ టెల్ యు ఏ సీక్రెట్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 21న స్ట్రీమింగ్
10. సౌత్ పా(ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 22న స్ట్రీమింగ్
11. అవతార్ అండ్ ది లాస్ట్ ఎయిర్‌బెండర్(వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 22న స్ట్రీమింగ్
12. మీ కుల్పా(నెట్‌ఫ్లిక్స్ సినిమా)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
13. త్రూ మై విండో 3: లుకింగ్ ఎట్ యు(స్పానిష్ మూవీ)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
14. ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ : ది బరీడ్ ట్రూత్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
15. ఫార్మాలా 1: డ్రైవ్ టూ సర్వైవ్ సీజన్-6(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
16. ఎవరీథింగ్ ఎవరీవేర్ ఆల్ ఏట్ వన్స్- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్
17. మార్షెల్ ది షెల్ విత్ షూస్ ఆన్ - ఫిబ్రవరి 24న స్ట్రీమింగ్


Click it and Unblock the Notifications











