OTTలో మూవీ ఫెస్టివల్.. ఒక్కరోజే 18 సినిమాలు.. అందులో చూడాల్సినవి మాత్రం?
సినీ ప్రేమికులకు దీపావళికి ముందే పండుగ వచ్చేసింది.. ఈ శుక్రవారం ఓటీటీ వేదికల్లో ఏకంగా 18 సినిమాలు, సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. ఎలాగూ థియేటర్లో డబ్బింగ్ చిత్రాలు, చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి.. అవి చూసే ఓపిక లేకపోతే... ఇంట్లోనే చూసేందుకు కొత్త కొత్త సినిమాలు, సిరీసులు ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాయి. ఏ సినిమా, సిరీసు.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది.. అందులో ఏది ఆసక్తి కలిగిస్తుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వీకెండ్ వచ్చిందంటే.. మూవీ లవర్స్ కు పండగే అని చెప్పవచ్చు. ఎందుకంటే.. కొత్త సిినిమాలు, సిరీసులు.. ఓటీటీల్లో సందడి చేస్తుంటాయి. వాటిని ఇంట్లోనే కూర్చొని ఎంచాక్క చూసేస్తారు. ఇక థియేటర్ లో అంత గొప్ప చిత్రాలు ఏమి లేవు. డబ్బింగ్ చిత్రాలు జపాన్, జిగర్ తాండ, టైగర్ 3 ఈ వారం రిలీజ్ కానున్నాయి. థియేటర్ కు వెళ్లి చూసే ఓపిక లేని వాళ్లకు ఓటీటీ ఓ మంచి వేదిక ఇక ఈ వారం ఓటీటీల్లో 18 సినిమాలు సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి.

ఇక అందులో ఆసక్తి కలిగించే చిత్రాలు అంటే మాత్రం మృణాల్ ఠాకూర్ నటించిన పిప్పా. ఈ సినిమా డైరెక్టుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఇందులో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ చూశాక కాస్త ఆసక్తి కలిగిస్తుంది. ఈ సినిమాతో పాటు.. త్రిష నటిస్తున్న ది రోడ్, అభిషేక్ బచ్చన్ ఘూమర్ చిత్రాలు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి.
ఇక కన్నడంలో సూపర్ హిట్టుగా నిలిచిన సినిమా తెలుగులో బాయ్స్ హాస్టల్ గా డబ్ అయింది. ఇక ఈ సినిమాలో రష్మి, తరుణ్ భాస్కర్ అతిథి పాత్రల్లో నటించారు. ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. మీరు వీకెండ్ లో ఫన్ లాంటి సినిమా చూడాలి అనుకుంటే ఈ సినిమాను కచ్చితంగా చూడండి.

శుక్రవారం నవంబర్ 10న ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న చిత్రాలు ఇవే...
నెట్‌ఫ్లిక్స్:
1. ఎట్ ద మూమెంట్ - మాండరిన్ సిరీస్ నవంబరు 10న స్ట్రీమింగ్
2. ఫేమ్ ఆఫ్టర్ ఫేమ్ - స్పానిష్ సిరీస్ నవంబరు 10న స్ట్రీమింగ్
3. ద కిల్లర్ - ఇంగ్లీష్ సినిమా నవంబరు 10న స్ట్రీమింగ్
4. అకుమా కున్ - జపనీస్ సిరీస్ -స్ట్రీమింగ్ అవుతోంది
అమెజాన్ ప్రైమ్:
5. 007: రోడ్ టూ ఏ మిలియన్ - ఇంగ్లీష్ సిరీస్ నవంబరు 10న స్ట్రీమింగ్
6. దిన్ హసీమ్ - ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో నవంబరు 10న స్ట్రీమింగ్
7. పిప్పా - హిందీ చిత్రం నవంబరు 10న స్ట్రీమింగ్
8. పులిక్కుత్తు పండి - తమిళ మూవీ నవంబరు 10న స్ట్రీమింగ్
9. హ్యాక్ క్రైమ్స్ ఆన్‌లైన్ - హిందీ సిరీస్ నవంబరు 10న స్ట్రీమింగ్
10. క్రష్డ్ సీజన్ 3 - హిందీ సిరీస్ నవంబరు 11న స్ట్రీమింగ్
11. BTS ఎట్ టూ కమ్ - కొరియన్ సినిమా -స్ట్రీమింగ్ అవుతుంది
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
12. కన్నూరు స్క్వాడ్ - తెలుగు డబ్బింగ్ మూవీ నవంబరు 10న స్ట్రీమింగ్
13. లేబుల్ - తెలుగు డబ్బింగ్ సిరీస్ నవంబరు 10న స్ట్రీమింగ్
జీ5:
14. ఘూమర్ - హిందీ సినిమా నవంబరు 10న స్ట్రీమింగ్
ఆహా:
15. ద రోడ్ - తెలుగు డబ్బింగ్ చిత్రం నవంబరు 10న స్ట్రీమింగ్
బుక్ మై షో:
16. ద అడల్ట్స్ - ఇంగ్లీష్ మూవీ నవంబరు 10న స్ట్రీమింగ్
లయన్స్ గేట్ ప్లే:
17. వాట్స్ లవ్ గాట్ టుడూ విత్ ఇట్ - ఇంగ్లీష్ సినిమా నవంబరు 10న స్ట్రీమింగ్
ఈ - విన్:
18. ద బాయ్స్ హాస్టల్ - తెలుగు డబ్బింగ్ మూవీ నవంబరు 10న స్ట్రీమింగ్


Click it and Unblock the Notifications











