This Week OTT: ఈ వారం పండగే.. నా సామి రంగాతో పాటు ఓటీటీలోకి సరికొత్త చిత్రాలు!
ఈ మధ్య థియేటర్లలో పెద్ద పెద్ద సినిమాలు, హిట్ టాక్ వచ్చిన చిత్రాలు వస్తే తప్ప థియేటర్లకు వెళ్లట్లేదు చాలా మంది. ఎక్కువగా ఓటీటీలోనే ఫ్యామిలీతో కలిసి మరీ సినిమాలు చూస్తున్నారు. వీకెండ్ అయిపోయిందంటే చాలు అనేక సినిమాలు అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో సందడి చేస్తుంటాయి. అయితే ఈ వారం కూడా అనేక సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఫుల్ బజ్ క్రియేట్ అయిన అనేక కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ వారం అటు ఓటీటీలో, ఇటు థియేటర్లలో ఏమేం విడుదల కబాతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
యంగ్ అండ్ డైనమిక్ హీరో సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ తెరకెక్కించిన ఊరు పేరు భైరవకోన సినిమా ఫిబ్రవరి 16వ తేదీన విడదుల కానుంది. అలాగే జయం రవి హీరోగా, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా చేసిన కొత్త సినిమా సైరెన్ కూడా ఫిబ్రవరి 16వ తేదీన థియేటర్లలోకి రాబోతుంది. అలాగే మమ్ముట్టి ప్రధాన పాత్రలో వస్తున్న భ్రమయుగం కూడా ఈవారమే విడుదల కాబోతుంది. ఫిబ్రవరి 15వ తేదీన రిలీజ్ కాబోతుంది. అలాగే భాను దర్శకత్వంలో రాబోతున్న రాజధాని ఫైల్స్ సినిమా కూడా ఫిబ్రవరి 15వ తేదీనే విడుదల కానుంది.

నెట్ ఫ్లిక్స్ వేధికగా..:ఇక నెట్ ఫ్లిక్స్ వేధికగా.. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి సండర్ లెండ్ టిల్ ఐ డీ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఆ తర్వాతి రోజు నుంచి అంటే ఫిబ్రవరి 14 నుంచి లవ్ ఈజ్ బ్లైండ్ వెబ్ సిరీస్ అందుబాటులోకి రాబోతుంది. అదే రోజు నుంచి ప్లేయర్స్ అనే హాలీవుడ్ సినిమా కూడా విడుదల కాబోతుంది. ఇక ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఐన్ స్టీన్ అండ్ ది బాంబ్ అనే హాలీవుడ్ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుంది.
అమెజాన్ ప్రైమ్, జీ5 వేధికగా..:అమెజాన్ ప్రైమ్ వేధికగా.. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి ఫైవ్ బ్లైండ్ డేట్స్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అలాగే దిస్ ఈజ్ నౌ అనే హాలీవుడ్ సినిమా ఫిబ్రవరి 16న విడుదల కానుంది. జీ5 వేధికగా.. క్వీన్ ఎలిజబెత్ అనే మలయాళ సినిమా ఫిబ్రవరి 14 నుంచి విడుదల కాబోతుంది. అంతేకాకుండా ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ది కేరళ స్టోరీ స్ట్రీమింగ్ కానుంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా.. :ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ట్రాకర్ అనే వెబ్ సిరీస్ అందుబాటులోకి రాబోతుంది. సబ నయగన్ అనే తమిళ సినిమా ఫిబ్రవరి 14వ తేదీ నుంచి విడుదల కానుంది. ఓజ్లర్ అనే మలయాళ సినిమా కూడా ఫిబ్రవరి 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాుంది. అలాగే హిందీ సలార్ సినిమా కూడా ఫిబ్రవరి 16వ తేదీన విడుదల కానుంది. అలాగే నాగార్జున హీరోగా ఇటీవలే వచ్చిన నా సామిరంగా సినిమా ఫిబ్రవరి 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

సోనీ లివ్, ఆహా, ఆపిల్ టీవీ ప్లస్ వేధికగా..:సోనీ లివ్ లో ఫిబ్రవరి 12వ తేదీ నుంచి రాయ్ సింఘానీ వర్సెస్ రాయ్ సింఘానీ అనే హిందీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే ఆహాలో వీరమారి లవ్ స్టోరీ అనే తమిళ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన విడుదల కాబోతుంది. ది న్యూ లుక్ అనే వెబ్ సిరీస్ కూడా ఫిబ్రవరి 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ అద్భుతమైన సినిమాలు అన్నింటినీ ఓటీటీ వేధికగా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











