OTTలోకి నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ‍్యాన్ సహా 21 సినిమాలు... ఎందులో చూడాలంటే?
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సినిమాలు సందడి చేస్తున్నాయి. ప్రశాంత్ వర్మ తేజ సజ్జా హనుమాన్, గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్ సినిమాల జోరు ఉండగా.. ఇక ఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాలు లేవు. ఇదిలా ఉంటే.. ఈ వారం ఓటీటీల్లో విడుదల అయ్యే సినిమాలు ఏంటి.. అందులో ఏవి ఆసక్తి కలిగిస్తున్నాయి అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సంక్రాంతి సినిమాల సందడి థియేటర్లలో నడుస్తుంది. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ కాగా.. అందులో హనుమాన్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ క్రమంలోనే ఈ వారం థియేటర్లలలో ఒక్క మూవీ విడుదల కావడం లేదు. కాబట్టి అందరి దృష్టి ఓటీటీ సినిమాలపై పడింది. అందుకు తగ్గట్లే ఈ శుక్రవారం 20కి పైగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి.

ఇక ఆ 21 చిత్రాల్లో నితిన్ నటించిన 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమా ఆసక్తి కలిగిస్తుంది. దానితో పాటుగా 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' వెబ్ సిరీస్ కూడా ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. ఇంకా ఏ ఏ సిరీసులు, సినిమాలు రిలీజ్ కాబోతున్నాయో ఈ స్టోరీలో చూద్దాం.
ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే
నెట్ ఫ్లిక్స్
1. ఫుల్ సర్కిల్ - ఇంగ్లీష్ సినిమా జనవరి 19న స్ట్రీమింగ్
2. లవ్ ఆన్ ద స్పెక్ట్రమ్ U.S: సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ జనవరి 19న స్ట్రీమింగ్
3. మి సోల్ డాడ్ టియన్ అలాస్ - స్పానిష్ సినిమా జనవరి 19న స్ట్రీమింగ్
4. సిక్స్ టీ మినిట్స్ - జర్మన్ మూవీ జనవరి 19న స్ట్రీమింగ్
5. ద బెక్‌తెడ్ - కొరియన్ సిరీస్ జనవరి 19న స్ట్రీమింగ్
6. ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ - ఇంగ్లీష్ సినిమా జనవరి 19న స్ట్రీమింగ్
7. ద కిచెన్ - ఇంగ్లీష్ చిత్రం జనవరి 19న స్ట్రీమింగ్
8. కేప్టివేటింగ్ ద కింగ్ - కొరియన్ సిరీస్ జనవరి 20న స్ట్రీమింగ్
హాట్‌స్టార్
9. బ్రాన్: ద ఇంపాజిబుల్ ఫార్ములా వన్ స్టోరీ - ఇంగ్లీష్ సిరీస్ జనవరి 19న స్ట్రీమింగ్
10. కులీన్ రూనీ: ద రియల్ వగ్తా స్టోరీ - ఇంగ్లీష్ సిరీస్ జనవరి 19న స్ట్రీమింగ్
11. క్రిస్టోబల్ బలన్సియా - స్పానిష్ సిరీస్ జనవరి 19న స్ట్రీమింగ్
12. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ‍్యాన్ - తెలుగు సినిమా జనవరి 19న స్ట్రీమింగ్
13. స్నేక్స్ SOS: గోవాస్ వైల్డెస్ట్ సీజన్ 4 - ఇంగ్లీష్ సిరీస్ జనవరి 20న స్ట్రీమింగ్
అమెజాన్ ప్రైమ్
14. ఇండియన్ పోలీస్ ఫోర్స్ - హిందీ సిరీస్ జనవరి 19న స్ట్రీమింగ్
15. ఫిలిప్స్ - మలయాళ సినిమా జనవరి 19న స్ట్రీమింగ్
16. హజ్బిన్ హోటల్ - ఇంగ్లీష్ సిరీస్ జనవరి 19న స్ట్రీమింగ్
17. లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ ఐర్లాండ్ - ఇంగ్లీష్ సిరీస్ జనవరి 19న స్ట్రీమింగ్
18. జొర్రో - స్పానిష్ సిరీస్ జనవరి 19న స్ట్రీమింగ్
జియో సినిమా
19. లా & ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్ సీజన్ 25 - ఇంగ్లీష్ సిరీస్ జనవరి 19న స్ట్రీమింగ్
బుక్ మై షో
20. ఒడవుమ్ ముడియాదు ఒలియవుమ్ ముడియాదు - తమిళ సినిమా జనవరి 19న స్ట్రీమింగ్
21. ఆల్ ఫన్ అండ్ గేమ్స్ - ఇంగ్లీష్ చిత్రం జనవరి 20న స్ట్రీమింగ్


Click it and Unblock the Notifications











