OTT: ఈ వారం థియేటర్ సినిమాలు ఇవే, ఓటీటీలోకి 20 మూవీస్.. వాటిని ఎక్కడ చూడొచ్చంటే?
ఈ వీకెండ్ ఓటిటిలోకి అడుగు పెట్టడానికి కొత్త సినిమాలు రెడీగా ఉన్నాయి. ఓవైపు థియేటర్లలో సందడి చేయడానికి హనీమూన్ ఎక్స్ ప్రెస్, ఓ మంచి ఘోస్ట్, సీతా కళ్యాణ వైభోగమే, ప్రభుత్వ జూనియర్ కళాశాల, నింద లాంటి చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి ఈ శుక్రవారం సిద్ధంగా ఉన్నాయి. ఇక ఓటిటిలోకి ఏకంగా 20కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు అడుగు పెట్టబోతున్నాయి. కానీ అందులో తెలుగు ప్రేక్షకుల కోసం ఈ శుక్రవారం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నవి నాలుగే తెలుగు సినిమాలు. అవేంటో ఒక లుక్కేద్దాం పదండి.
ఈవారం ఓటీడీలో రాబోతున్న సినిమాల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బాక్ మూవీ, నెట్ ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ సినిమా నడిగర్ తిలగం, అమెజాన్ ప్రైమ్ వీడియోలో గంగం గణేశా, రాధా మాధవం అందుబాటులో ఉన్నాయి. మిగతావన్నీ ఇంగ్లీష్, హిందీ, తమిళ, స్పానిష్ భాషల్లో ఉన్న సినిమాలు వెబ్ సిరీస్ లు. తెలుగు మూవీ లవర్స్ ఫస్ట్ ఆప్షన్ తెలుగులో రాబోయే సినిమాలే. కాబట్టి ఈ నాలుగు సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. గంగం గణేశా
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా మూవీ గం గం గణేశా. మే 31న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ ఉండడం వల్ల పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. అయితే ఎలాంటి హడావుడి లేకుండానే ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. యాక్షన్ క్రైమ్ కామెడీ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన 20 రోజులకే ఓటీటీలో సైలెంట్ గా స్ట్రీమింగ్ అవ్వడం విశేషం.
2. బాక్
మరికొన్ని గంటలో ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతోంది హర్రర్ మూవీ బాక్. సుందర్ సి దర్శకత్వంలో ఆయనే హీరోగా, తమన్నా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. జూన్ 21 నుంచి ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. తమిళంలో 100 కోట్లు కొల్లగొట్టిన మూవీగా రికార్డును క్రియేట్ చేసిన ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది.

3. నడిగర్ తిలగం
మలయాళ యంగ్ స్టార్ టోవినో థామస్ ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోషించారు. లాల్ జూనియర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. మే 3 నా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ కామెడీ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. జూన్ 21న ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మంచి మలయాళ కామెడీ మూవీని చూసి కడుపుబ్బా నవ్వుకోవాలి అనుకునే వారికి ఈ వీకెండ్ ఇదే బెస్ట్ ఆప్షన్.
4. రాధామాధవం
ఈ వారం స్ట్రీమింగ్ కి వచ్చేసిన మరో ఇంటరెస్టింగ్ మూవీ రాధా మాధవం. వినాయక్ దేశాయ్, అపర్ణ దేవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ మార్చ్ 1న థియేటర్లలో రిలీజ్ అయింది. అందరూ కొత్తవాళ్లే నటించిన ఈ విలేజ్ లవ్ స్టోరీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











