OTTలో వీకెండ్ సర్ప్రైజ్... ఏకంగా 16 సినిమాలు.. ఆ ఆరు స్పెషల్ ఫోకస్!
మార్చి నెల కూడా అయిపోతుంది. ఇక ఈ వీకెండ్ కు ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు, సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. మరోవైపు థియేటర్లలో చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి. అయితే ఓటీటీలో మాత్రం ఎంటర్టైన్మెంట్ మాత్రం నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. బోలెడన్ని క్రేజీ సినిమాలు, సిరీసులు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అవేంటో ఓసారి కింది కథనంలో చూసి తెలుసుకుందాం.
ఇక ఈ వారం ఓటీటీలోకి 16 సినిమాలు, సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. అందులో ఇప్పటికే కొన్ని స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఇక ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో ఆసక్తి కలిగిస్తున్నవి ఆరు. అవేంటంటే.. మొదటగా సైలెంటుగా వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. దానితో పాటు హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రం కూడా ఓటీటీలో సందడి చేస్తుంది. అయితే హృతిక్ ఫైటర్ కేవలం హిందీలోనే స్ట్రీమింగ్ అవుతుంది.

మరోవైపు రజినీ కీలకపాత్రలో నటించిన లాల్ సలాం, క్రైమ్ థ్రిల్లర్ భూతద్దం నారాయణ, ఆస్కార్ విన్నింగ్ చిత్రం ఓప్పెన్ హైమర్, వైవ హర్ష నటించిన సుందరం మాస్టార్ ఇవన్నీ ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇక ఈ వీకెండ్ కు మీరు మీ ఫ్యామిలీతో కలిసి మీకు నచ్చిన చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయండి.
ఓటీటీలో సందడి చేస్తున్న చిత్రాలివే....

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :
1) అనాటమీ ఆఫ్ ఏ పాల్- (హాలీవుడ్ సినిమా)- మార్చి 22నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
2) డేవీ, జాన్సీస్ లాకర్- (హాలీవుడ్ సిరీస్)- మార్చి 22నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
3) లూటేరే- (హిందీ సిరీస్)- మార్చి 22నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
4) ఫొటోగ్రాఫర్ సీజన్- 1- (హాలీవుడ్ సిరీస్)- మార్చి 24న స్ట్రీమింగ్
5) ఏ వతన్ మేరే వతన్- (హిందీ సినిమా)- మార్చి 21న స్ట్రీమింగ్ అవుతుంది.
6) రోడ్ హౌస్- (హాలీవుడ్ చిత్రం)- మార్చి 21న స్ట్రీమింగ్ అవుతుంది

నెట్ ఫ్లిక్స్ :
7) 3 బాడీ ప్రాబ్లమ్- (హాలీవుడ్ సిరీస్) -స్ట్రీమింగ్ అవుతుంది
8) బైయింగ్ బెవర్లీ హిల్స్ సీజన్ -2- (హాలీవుడ్ సిరీస్)- మార్చి 22న స్ట్రీమింగ్ అవుతుంది
9) షిర్లే -(హాలీవుడ్ సినిమా)- మార్చి 22న స్ట్రీమింగ్ అవుతుంది
10) లాల్ సలామ్ (తెలుగు/తమిళ్) - మార్చి 22న స్ట్రీమింగ్ అవుతుంది
11 ) ఫైటర్ (హిందీలో) - మార్చి 21న స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
12) ఆపరేషన్ వాలంటైన్ - మార్చి 22న స్ట్రీమింగ్ అవుతుంది.
జియో సినిమా
13) ఓపెన్ హైమర్- (తెలుగు డబ్బింగ్ సినిమా)- స్ట్రీమింగ్ అవుతుంది
ఆపిల్ టీవీ :
14) ఆర్గిల్లీ -(హాలీవుడ్ సినిమా)- మార్చి 23న స్ట్రీమింగ్ అవుతుంది
ఆహా :
15) భూతద్దం భాస్కర్ నారాయణ స్ట్రీమింగ్ అవుతుంది
ఈటీవీ విన్
16) సుందరం మాస్టర్ (తెలుగు) మార్చి 22 నుండి స్ట్రీమింగ్


Click it and Unblock the Notifications











