OTT ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం పంచాయత్ 3తో పాటు 18 సినిమాలు అందుబాటులోకి!
ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా చాలా ఎక్కువ అయింది. అందరికీ సెలవులు కావడంతో.. అంతా ఇంట్లోనే ఉంటుంటడంతో.. ఎక్కువ మంది ఓటీటీల్లో తమకు నచ్చిన చిత్రాలు చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త వారం వచ్చినా, వీకెండ్ వచ్చినా ఎలాంటి సినిమాలు వస్తున్నాయి, ఏవేవి రాబోతున్నాయి అంటూ తెగ వెతికేస్తున్నారు. అలాంటి వాళ్ల కోసమే మేము ఏయే ఓటీటీలో ఎప్పుడు, ఎలాంటి సినిమాలు, వెబ్ సిరీస్ లు రాబోతున్నాయో వివరించబోతున్నాం. ముఖ్యంగా ఈ వారం ఏకంగా 19 సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల కాబోతున్నాయి.
ఇందులో అనేక మంది ఓటీటీ ప్రియులు ఎదురు చూస్తున్న క్రేజీ వెబ్ సిరీస్ లు ఉండగా.. మరికొన్న సరికొత్త థ్రిల్లర్ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఏయే ఓటీటోలో ఎలాంటి వెబ్ సిరీస్ లు ఉన్నాయి.. ముఖ్యంగా ఈ వారం విడుదల కాబోయేవి ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్ వేదికగా..:
ద లైఫ్ యూ వాంటెడ్ (ఇటాలియన్ సిరీస్) - మే 29
ఎరిక్ ( వెబ్ సిరీస్) - మే 30
గీక్ గర్ల్ (వెబ్ సిరీస్) - మే 30
ఎ పార్ట్ ఆఫ్ యూ (స్వీడిష్ సినిమా) - మే 31
రైజింగ్ వాయిసెస్ (స్పానిష్ వెబ్ సిరీస్) - మే 31
లంబర్ జాక్ ద మాన్ స్టర్ (జపనీస్ మూవీ) - జూన్ 1
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా.. :
కామ్ డెన్ (వెబ్ సిరీస్) - మే 28
ది ఫస్ట్ ఆమెన్ (హాలీవుడ్) - మే 30
ఉప్పు పులి కారమ్ (తమిళ) - మే 30
జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ (హాలీవుడ్ మూవీ) - మే 31

అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా..:
పంచాయత్ 3 (వెబ్ సిరీస్) - మే 28
జీ5 వేదికగా..:
స్వాతంత్ర్య వీర్ సావర్కర్ (హిందీ మూవీ) - మే 28
హౌస్ ఆఫ్ లైస్ (హిందీ వెబ్ సిరీస్) - మే 31
సైనా ప్లే
పొంబలై ఒరుమై (మలయాళ సినిమా) - మే 31

జియో సినిమా వేదికగా..:
ఇల్లీగల్ 3 (హిందీ వెబ్ సిరీస్) - మే 29
దేడ్ బీఘా జమీన్ (హిందీ) - మే 31
ది లాస్ట్ రైఫిల్ మ్యాన్ (హాలీవుడ్) - మే 31
లా అండ్ ఆర్డర్ టోరంటో (హాలీవుడ్ వెబ్ సిరీస్) - మే 31
ఏలీన్ (హాలీవుడ్ మూవీ) - జూన్ 1


Click it and Unblock the Notifications











