OTT ప్రియులకు ఈవారమే అసలైన సినీ పండుగ... హనుమాన్ సహా 23 బ్లాక్ బస్టర్ సినిమాలు
ఈ వారం సినిమా ప్రియులకు ప్రియులకు పండగే అని చెప్పవచ్చు. అటు థియేటర్లలో, ఓటీటీలలో సినిమాల సందడి మొదలు కానుంది. ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాల హవా కొనసాగుతుండగా.. ఓటీటీలో కూడా సూపర్ హిట్ చిత్రాలు రాబోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 23కి పైగా చిత్రాలు రాబోతున్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
ఎప్పుడెప్పుడా అని హనుమాన్ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ శివరాత్రికే స్ట్రీమింగ్ కావాల్సిన హనుమాన్ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు హనుమాన్ హిందీ వర్షన్ మార్చి 16న జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ట్రూ లవర్, బ్రమయుగం వంటి చిత్రాలు స్ట్రీమింగ్ కు వచ్చేందుకు రెడీ అయ్యాయి. వాటిపై ఓ లుక్ వేయండి.

ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, సిరీసుల లిస్ట్ ఇదే..
నెట్ ఫ్లిక్స్
1. యంగ్ రాయల్స్ సీజన్ 3 (స్వీడిష్ వెబ్ సిరీస్) - మార్చి 11న స్ట్రీమింగ్
2. జీసస్ రివల్యూషన్ (ఇంగ్లిష్ సినిమా) - మార్చి 12న స్ట్రీమింగ్
3. టర్నింగ్ పాయింట్ (ఇంగ్లిష్ సిరీస్) - మార్చి 12న స్ట్రీమింగ్
4. 24 హవర్స్ విత్ గాస్పర్ (ఇంగ్లిష్ సినిమా) - మార్చి 14న స్ట్రీమింగ్
5. గర్ల్స్ 5 ఎవా: సీజన్ 3 (ఇంగ్లిష్ సిరీస్) - మార్చి 14న స్ట్రీమింగ్
6. చికెన్ నగ్గెట్ (కొరియన్ వెబ్ సిరీస్) - మార్చి 15న స్ట్రీమింగ్
7. ఐరిష్ విష్ (ఇంగ్లిష్ మూవీ) - మార్చి 15న స్ట్రీమింగ్
8. ఐరన్ రియన్ (స్పానిష్ వెబ్ సిరీస్) - మార్చి 15న స్ట్రీమింగ్
9. మర్డర్ ముబారక్ (హిందీ మూవీ) - మార్చి 15న స్ట్రీమింగ్
అమెజాన్ ప్రైమ్
10. లవ్ అదురా (హిందీ వెబ్ సిరీస్) - మార్చి 13న స్ట్రీమింగ్
11. బిగ్ గర్ల్స్ డోంట్ క్రై (హిందీ వెబ్ సిరీస్) - మార్చి 14న స్ట్రీమింగ్
12. ఇన్విన్సబుల్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) - మార్చి 14న స్ట్రీమింగ్
13. ఫ్రిడా (ఇంగ్లిష్ మూవీ) - మార్చి 15న స్ట్రీమింగ్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
14. గ్రేస్ అనాటమీ: సీజన్ 20 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) - మార్చి 15న స్ట్రీమింగ్
15. సేవ్ ద టైగర్స్ సీజన్ 2 (తెలుగు వెబ్ సిరీస్) - మార్చి 15న స్ట్రీమింగ్
16. టేలర్ స్విఫ్ట్: ద ఎరాస్ టూర్ (ఇంగ్లిష్ సినిమా) - మార్చి 15న స్ట్రీమింగ్

జీ5
17. మెయిన్ అటల్ హూ (హిందీ సినిమా) - మార్చి 14న స్ట్రీమింగ్
సోనీ లివ్
18. మమ్ముట్టి భ్రమయుగం (తెలుగు డబ్బింగ్ మూవీ) - మార్చి 15న స్ట్రీమింగ్
లయన్స్ గేట్ ప్లే
19. నో వే అప్ (ఇంగ్లిష్ చిత్రం) - మార్చి 15న స్ట్రీమింగ్
యాపిల్ ప్లస్ టీవీ
20. మ్యాన్ హంట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) - మార్చి 15న స్ట్రీమింగ్
బుక్ మై షో
21. ద డెవిల్ కాన్స్‌పరసీ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 15న స్ట్రీమింగ్
జియో సినిమా
22. హనుమాన్ (హిందీ వెర్షన్) - మార్చి 16న స్ట్రీమింగ్
23. ట్రాల్స్ బ్యాండ్ టుగెదర్ (ఇంగ్లిష్ సినిమా) - మార్చి 17న స్ట్రీమింగ్


Click it and Unblock the Notifications











