OTTలోకి రణబీర్ యానిమల్ సహా 18 సినిమాలు... ఎందులో చూడాలంటే?

ఓటీటీలోకి ఈ వారం కూడా కొత్త సినిమాలు వచ్చేందుకు రెడీ అయ్యాయి. ఈ వీకెండ్ కు థియేటర్లలో డబ్బింగ్ చిత్రాలు సందడి చేస్తుండగా.. ఓటీటీలో మాత్రం డైరెక్ట్ మూవీస్ తో పాటు.. సూపర్ హిట్ సినిమాలు, సిరీసులు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 18 సినిమాలు, సిరీసులు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఆ చిత్రాల్లో ఏ సినిమాలు, సిరీసులు ఆసక్తి కలిగిస్తున్నాయో ఈ స్టోరీలో చూద్దాం.

సంక్రాంతి సందడి ముగిసింది. ఇక థియేటర్లోకి కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. ధనుష్ క్యాప్టెన్ మిల్లర్, అయాలన్, ఫైటర్ చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఓటీటీలోనూ సూపర్ హిట్ చిత్రాలు వచ్చేందుకు రెడీ అయ్యాయి. గత ఏడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన యానిమల్ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి మరికొద్ది గంటల్లోకి రాబోతుంది. ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.

This week OTT Releases: Ranbir Kapoor Animal and Web Series, Movies List January 4th week 2024 Full List Here

యానిమల్ సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇక ఈ సినిమాతో పాటు... అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో పంచాయత్ సీజన్ 3 వెబ్ సిరీస్, జీ5లో సామ్ బహుదూర్ హిందీ చిత్రం స్ట్రీమింగ్ అవ్వనున్నాయి. ఇక వీటితో పాటు ఆసక్తి కలిగించే చిత్రాల జాబితా ఇక్కడ ఉంది. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో చూద్దాం పదండి.

ఈ వీకెండ్‌ ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, సిరీసులు ఇవే...

నెట్‌ఫ్లిక్స్‌:

1. గ్రీసెల్డా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24న స్ట్రీమింగ్ అవుతుంది
2. క్వీర్ ఐ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24న స్ట్రీమింగ్ అవుతుంది
3. సిక్స్ నేషన్స్: ఫుల్ కాంటాక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24న స్ట్రీమింగ్ అవుతుంది.
4. బూగీమన్ (అరబిక్ మూవీ) - జనవరి 25న స్ట్రీమింగ్ అవుతుంది
5. మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 25న స్ట్రీమింగ్ అవుతుంది.
6. బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ (కొరియన్ చిత్రం) - జనవరి 26న స్ట్రీమింగ్
7. యానిమల్ - జనవరి 26న స్ట్రీమింగ్
8. క్రిష్, ట్రిష్, బల్టీ బాయ్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జనవరి 28న స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్:

9. కజిమ్యాన్ (ఇండోనేసియన్ సినిమా) - జనవరి 25న స్ట్రీమింగ్ అవుతుంది
10. హస్లర్స్ (హిందీ సిరీస్) - జనవరి 24న స్ట్రీమింగ్ అవుతుంది
11. ఎక్స్‌పాట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 26న స్ట్రీమింగ్
12. పంచాయత్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 26న స్ట్రీమింగ్

హాట్‌స్టార్:

13. ఏ రియల్ బగ్స్ లైఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24న స్ట్రీమింగ్ అవుతుంది
14. ఫ్లెక్స్ X కాప్ (కొరియన్ సిరీస్) - జనవరి 26న స్ట్రీమింగ్
15. కర్మ కాలింగ్ (హిందీ సిరీస్) - జనవరి 26న స్ట్రీమింగ్
16. ఫైట్ క్లబ్ (తమిళ సినిమా) - జనవరి 27న స్ట్రీమింగ్
జీ5:
17. సామ్ బహుదూర్ (హిందీ సినిమా) - జనవరి 26న స్ట్రీమింగ్
ఆపిల్ ప్లస్ టీవీ:
18. మాస్టర్ ఆఫ్ ద ఎయిర్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 26న స్ట్రీమింగ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X