This Week OTT Releases : సింగిల్, శుభం, జాట్.. ఈ వారం ఓటీటీ సినిమాలు.. ఇక్కడ చూసేయండి

తెలుగు ప్రేక్షకుల్లో ఓటీటీ చిత్రాలకు ఎంతటి డిమాండ్ ఉండిందో తెలిసిందే. వీకెండ్ వస్తే చాలు ఓటీటీ సినిమాలపై ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాగా ఈ వారం జూన్ 1 నుంచి జూన్ 7 వరకు ఓటీటీలోకి వచ్చే చిత్రాలు, అలాగే ఓటీటీ రిలీజ్ డేట్స్ ను ఖరారు చేసుకున్న సినిమాల గురించి తెలుసుకుందాం. రీసెంట్ గా థియేటర్లలో దుమ్ములేపి ఇప్పుడు ఆయా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో దుమ్ములేపేందుకు సిద్ధంగా ఉన్న చిత్రాల వివరాలు ఇక్కడ పూర్తిగా ఉన్నాయి. ఏఏ రోజున ఏ సినిమా ఓటీటీ ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్ధంగా ఉందనే వివరాల్లోకి వెళితే..

సమంత రూత్ ప్రభు 'శుభం'..
సమంత రూత్ ప్రభు నిర్మించిన తొలి చిత్రం 'శుభం'. ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. మే 9న థియేటర్లలోకి వచ్చింది. హర్షిత్ ఆర్, శ్రీనివాస్ గవిరెడ్డి, శ్రియా కొంతమ్, షాలిన కొండెపుడి, వంశీధర్ గౌడ్ లు తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రం జూన్ 13 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

This week Ott releases

శ్రీవిష్ణు #సింగిల్..
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు చివరిగా థియేటర్లలో #Single అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్, కల్యా ఫిల్మ్స్ బ్యానర్లలో విద్య కొప్పినీడి, బాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. మే9న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. ఇక జూన్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులోకి వచ్చింది.

రీతూ వర్మ 'దేవికా & డానీ'..
తెలుగు హీరోయిన్ రీతూ వర్మ తాజాగా నటించిన చిత్రం 'దేవికా & డానీ'. కామెడీ హార్రర్ ఫాంటసీ సిరీస్ గా జియో హాట్ స్టార్ లోకి వచ్చేసింది. జూన్ 6 నుంచి ఈ సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. రీతూ వర్మ, సూర్య వశిష్ట లీడ్ రోల్స్ లో నటించారు. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్ లో నిర్మాత సుధాకర్ చాగంటి నిర్మించారు.

సప్తగిరి 'పెళ్లి కానీ ప్రసాద్'..
నటుడు, కమెడియన్ సప్తగిరి తాజాగా నటించిన చిత్రం 'పెళ్లి కానీ ప్రసాద్'. కామెడీ డ్రామాగా 2025 మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రియాంక శంకర్ హీరోయిన్ గా నటించింది. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వంవహించారు. ఈటీవీ విన్ లో జూన్ 5 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.

గోపీచంద్ మాలినేని, సన్నీ డియోల్ 'జాట్'..
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మాలినేని - బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ డ్రామా ఫిల్మ్ జాట్. ఈ చిత్రం హిందీలో రూపుదిద్దుకుంది. తెలుగు వెర్షన్ లోనూ థియేటర్లలో విడుదలై బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో జూన్ 5 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.

నాని 'హిట్ 3'..
నేచురల్ స్టార్ నాని - శైలేష్ కొలను కాంబినేషన్ లో వచ్చిన చిత్రం హిట్ 3. మే1 థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ ప్యాక్డ్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఓటీటీలోనూ మే29 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం అందుబాటులో ఉంది.

సూర్య 'రెట్రో'..
తమిళ స్టార్ హీరో సూర్య - పూజా హెగ్దే హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'రెట్రో'. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ ఫిల్మ్ తెలుగులోనూ విడుదలైంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. మే 31 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

మోహన్ లాల్ 'తుడరమ్'..
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, శోభన నటించిన రీసెంట్ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ 'తుడరుమ్'. హృదయాన్ని కదిలించే ఈ ఫ్యామిలీ డ్రామా తెలుగులోనూ థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఓటీటీలోనూ అలరిస్తోంది. మే30 నుంచే జియో హాట్ స్టార్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X